వ్యక్తుల బలహీనతలను, రాజకీయ నాయకుల అరాజకత్వాన్ని, అధికారుల అవినీతి రీతులను కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడడమంటే జనమందరికీ భలే ఇష్టంగా ఉంటుంది. కాని ఆ వ్యక్తులకు, రాజకీయ శక్తులకు కోపం నషాళానికి అంటుతుంది. ఉన్నమాట అన్నవారిని, రాసిన వారిని శత్రువుల్లాగా చూస్తారు. ఇంతమంది శత్రువులను, మరెంతమందో స్నేహితులను సంపాదించుకునే ఈ నిజాలు నిజాయితిగా మాట్లాడడం అనితరసాధ్యమైన విద్య. ఇలా మాట్లాడి , మాట్లాడి కొందరికదే ఓ బలహీనతగా మారుతుంది. నివురుగప్పిన నిప్పులాగా ఆ నిజానికి వ్యంగ్యం పూతపూస్తే, ఓహో… దానికి సాహిత్య విలువ ఏర్పడి, అదొక చురకగా, చురకత్తిగా, సమాజ ప్రక్షాళన దిశలో చిగురుటాకులా సామాజిక ప్రయోజనం సాధించితీరుతుంది. అలాంటి రచయితలు మన తెలుగులో ఎవరైనా వున్నారా అని లెక్క పెట్టాలనుకుంటే మన చేతివేళ్లు చాలా మిగిలిపోతాయి. అరుదైన అపురూప వ్యంగ్య వైభవం ప్రదర్శించే అతి కొద్దిమంది తెలుగు పత్రికా రచయితల్లో ఎం.వి.ఆర్.శాస్త్రి ఒకరు. దశాబ్దానికిపైగా “ఆంధ్రభూమి” దినపత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తున్న శాస్త్రి ప్రతి శనివారం ‘సాక్షి’ పేరుతో నిర్వహిస్తున్న శీర్షిక “వీక్ పాయింట్”. కొన్ని వ్యాసాలను అదేపేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను. Read the rest of this entry »
ఫిబ్రవరి, 2008 నెల టపాలు
సమాజ శ్రేయమే వ్యంగ్య లక్ష్యం
In వ్యాసం on ఫిబ్రవరి 29, 2008 at 10:05 పూర్వాహ్నంఇసక దొంగలు
In మరింకేదైనా.. on ఫిబ్రవరి 23, 2008 at 5:04 పూర్వాహ్నంనిండా పారుతున్న నది ఒడ్డున
నీళ్లు అమ్ముతున్నట్టు
చెరుకు తోట పెంచుతున్న రైతుకు
పంచదార రుచి చూపిస్తున్నట్టు
ఇరవైఒకటో శతాబ్దపు యువతకు
మాట్లాడే కళ బోధిస్తూ నేను…. Read the rest of this entry »
“జర్నలిజంలో సృజనరాగాలు” : అక్షరంపై అంతులేని అనురాగం
In వ్యాసం on ఫిబ్రవరి 22, 2008 at 11:26 పూర్వాహ్నం
కథానిలయానికి ఈ మధ్యన అలా వెళ్లినపుడు కారా మేష్టారు కల్మషంలేని స్వచ్ఛమైన అదే చిరునవ్వుతో ‘మరో మంచి పుస్తకం వచ్చింది చదువుతావా?’ అని నాకో పుస్తకం అందించారు. సాహితీ జ్ఞానభాండాగారంలోంచి అందమైన పుస్తకం తీసిచ్చారు. ఒక అర్థం తెలియని సర్రియలిస్ట్ పెయింటంగ్ రమణ జీవిది ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉంది. ‘పుష్పాలు – ప్రేమికులు – పశువులు’ కథల రచయిత మునిపల్లె రాజుగారి కథలలో వేదాంత భావనకు దాసోహమనని తెలుగు పాఠకులు వుండరమో. ఆ పుస్తకానికి ముందుమాట రాసిన పోరంకి దక్షిణామూర్తి ‘ఋఅజుగారు మీకేమవుతారు?’ అన్న కాప్షన్ ఎప్పటికీ మర్చిపోలేం కదా! అదే అసాధారణ రచయిత రాసిన ఈ పుస్తకం పేరు “జర్నలిజంలో సృజనరాగాలు” పేరు వినగానే జర్నలిస్టులకు నాలుగు వినసొంపైన మాటలేమైనా చెప్పారేమోనన్న ఆతృతతో గబగబా తిరగేసిన మనకు ఇది జర్నలిజంపై పుస్తకం కాక, మరో సాహిత్య విందుగా కనిపిస్తుంది. ఎక్కడలేని ఉత్సాహంతో పుస్తకంలో మునిగిపోయాను. సరిగంగ స్నానమాడాను. ఈ వారం ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. Read the rest of this entry »
మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”
In కవిత on ఫిబ్రవరి 15, 2008 at 11:12 పూర్వాహ్నంప్రబంధ కవిత్వ యుగం నుంచి ఆధునిక కవితవైపు (ముఖ్యంగా భావ కవిత్వంవైపు) తెలుగు సాహిత్యలోకపు దృష్టి మళ్లించిన కవిగా కట్టమంచి రామలింగారెడ్డిగారిని చెప్పుకోవచ్చు. సి.ఆర్.రెడ్డిగారిని కవిగా యువపాఠకులు గుర్తించరు. వారికి తెలిసిందల్లా సి.ఆర్.రెడ్డిగారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు మొదటి వైస్ ఛాన్సలరని మాత్రమే. కాని ఆయన బహుముఖ ప్రతిభావముతులు. తెలుగు కవిత్వాన్ని కొత్తదారి పట్టించిన ఆయన కావ్యం ‘ముసలమ్మ మరణం’ ను ఈ వారం పరిచయం చేస్తున్నాను. Read the rest of this entry »
కళింగాంధ్ర కవిత్వం – ‘తూరుపు ‘
In కవిత on ఫిబ్రవరి 1, 2008 at 7:07 పూర్వాహ్నం
కళింగాంధ్ర సాహిత్య జీవితాన్ని కథారూపంలో ఏటేటా సంకలనం చేయడంలో కృషి చేస్తున్న సంస్థ ‘శ్రీకాకుళ సాహితి ‘. ఇదే కృషిని వ్యాస ప్రక్రియలో చేస్తున్నది ‘వెలుగు ‘సంస్థ. ఇక దాదాపుగా తొలి ప్రయత్నంగా ‘లైఫ్’ ప్రచురణ సంస్థ కళింగాంధ్ర కవిత్వాన్ని “తూరుపు” పేరుతో సంకలనం చేసింది. ఆ పరిచయం ఈ వారం… Read the rest of this entry »