దుప్పల రవికుమార్

మార్చి, 2008 నెల టపాలు

జీవితం మనది.. కథనం మాత్రం భిన్నం..”అసంగత సంగతాలు”

In కథ on మార్చి 28, 2008 at 4:30 పూర్వాహ్నం

ఎవరు సాహిత్య సృజనచేసినా జీవితాన్ని వదిలేసి ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తే నేల విడిచి సాము గారడీ చేయడమే అవుతుంది. జీవితంలో ప్రతీదీ అనుభవించి నేర్చుకోవా లనుకోవడం మూర్ఖత్వం. ‘విన్నంత కన్నంత..’ అని భర్తృహరి ఏనాడో జీవన సూత్రం చెప్పాడు. జీవన మాధుర్యంలో రుచేకాదు జీవితాన్ని కొన్ని కీలక సూత్రాలు సైతం వినీ కనీ అనుభవించీ మాత్రమే కాక సాహిత్య అధ్యయనం ద్వారా కూడా నేర్చుకోవచ్చని మానవ చరిత్ర బోధిస్తోంది. అలా జీవితాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి కథా పఠనం కూడా ఒక సాధనమే. అయితే అలాంటి కథలు రాసేవారు మాత్రం అరుదు. మరి సామాన్య జీవితాన్ని సైతం అసామాన్యంగా కథనీకరణం చేస్తే అప్పుడే అధ్యయనం మొదలుపెట్టిన పాఠకుడు మాత్రం కంగారు పడిపోవడం ఖాయం. కానీ ఓపిగ్గా ఎలా చెప్తున్నారన్న అంశంతోపాటు ఏమిటి చెప్తున్నారన్న విషయం కూడా అవగతం చేసుకుంటే మనసు విశాలమవుతుంది. బుద్ధి వికసితమవుతింది. Read the rest of this entry »

రెండుసార్లు మరణించి ఎప్పటికీ బతికుండే వీరుడి కథ

In నవల on మార్చి 21, 2008 at 4:25 పూర్వాహ్నం

వీధుల్లో, సందుల చివర, ఇంటి ముందర గేటు దగ్గర, సినిమా హాలు రేకు కప్పుల నీడన, టీ బడ్డీల దగ్గర గంటల తరబడి దేశం గురించి, సమాజం గురించి, తమ ఈడు ఆడపిల్లల గురించి చర్చించుకుని, వ్యాఖ్యానించుకుని, పుకార్లు ప్రచారం చేసుకుని గడిపే యువతరం ఒక మూడు గంటలు (గట్టిగా ఒక సినిమా చూసినంతసేపు) కేటాయించగలిగి ఒక పుస్తకం చదివితే చాలు. ఈ దేశంలో కొన్ని కోటానుకోట్ల పనిగంటలు సద్వినియోగమవుతాయి. ఆ పుస్తకం ఏ మత ప్రబోధాల గ్రంథమూ కాదు. ఇటీవల మార్కెట్టును ముంచెత్తుతున్న వ్యక్తిత్వ వికాస పుస్తకమూ కాదు. ఒక నవల. ఒక డాక్టర్ జీవితాన్ని చిత్రించిన సాధారణ నవల. Read the rest of this entry »

మార్పు మూలాల శోధన : ది టిపింగ్ పాయింట్

In వ్యాసం on మార్చి 7, 2008 at 11:35 పూర్వాహ్నం

కొన్ని చిన్న నిచ్చ విషయాలే ఎంత పెద్ద పెద్ద మార్పులకు దారి తీస్తాయో వివరించి చెప్పే పుస్తకం “ది టిపింగ్ పాయింట్”ను ఈ వారం పరిచయం చేస్తున్నాను. Read the rest of this entry »