ఐ.టి.డి.ఏ. (అంటే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) చేస్తున్న బృహత్ కార్యక్రమాలు పేపర్లలో చదువుతున్నపుడు గిరిజనులపట్ల ప్రభుత్వం చూపిస్తున్న కేర్, కన్ సర్న్ లకు మనకు సెంటిమెంటుతో కన్నీళ్లొస్తాయి. ఏదైనా గిరిజన గ్రామానికి వెళ్లి రెండ్రోజులు వాళ్లతోపాటు గడిపితే వారి కడగండ్లన్నీ గమనించాక కన్నీరు వరదవుతుంది. హైమన్ డ్వార్ఫ్ వి గాని, లెవీస్ట్రాసువి గాని ఆంత్రపాలజీ వ్యాసాలు చదువుతుంటే గిరిజనులనుంచి గిరిజన జీవన విధానాన్ని వేరు చేసి వాళ్ల సంస్కృతిని ధ్వంసం చేస్తుండడం చూసి హృదయం ఛిద్రమవుతుంది. Read the rest of this entry »
జూన్ , 2008 నెల టపాలు
దోపిడీకి గురవుతున్న గిరిజనం
In నవల on జూన్ 27, 2008 at 4:12 పూర్వాహ్నంమానవీయ స్పర్శతో నిండిన కథలు
In కథ on జూన్ 20, 2008 at 4:48 పూర్వాహ్నం
సాహిత్యమెప్పుడూ హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడదు. జీవితంలోంచే పుడుతుంది. సాహిత్య రూపాలు జీవితాన్ని యథార్థంగా ప్రతిబింబించినప్పుడే అవి అందరి మన్నన పొందుతాయి. ప్రశంసలుపొందిన సాహితీవేత్తలు అటు జీవితాన్ని సునిశితంగా పరిశీలించడమే కాకుండా సాహిత్యాన్ని ఔపోశన పట్టినపుడే వాళ్లు సృజించిన ప్రతి అక్షరమూ పాఠకుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీవితపు చలన సూత్రాలను సమర్థంగా అర్థం చేసుకోవడానికి, రొటీన్ జీవితంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆనంద సంతోషాలు నింపుకోవడానికీ సాహిత్య పఠనం ఎంతో ఉపకరిస్తుంది. Read the rest of this entry »
వ్యర్థత అరికడితేనే దేశ ప్రగతి
In వ్యాసం on జూన్ 13, 2008 at 5:35 పూర్వాహ్నం
ఇవాళ్టి తెలుగు నాటక రంగం పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. నాటకాల్లో కాస్త అనుభవం సంపాదించాక సినిమా రంగంలో ప్రయత్నించడం సాధారణమైపోయింది. సినిమారంగంలో సెటిలైతే సరేసరి లేదంటే బుల్లితెర మీదకు దాడిచేయడం దురదృష్టకర పరిణామంగా మారింది. Read the rest of this entry »
మందస రైతుల తిరుగుబాటు – నివురు గప్పిన నిప్పు
In వ్యాసం on జూన్ 6, 2008 at 4:48 పూర్వాహ్నం
భారతీయులు చరిత్ర రచనలో నిర్లక్ష్యం చూపించారని పాశ్చాత్యులే కాదు, మన చరిత్ర పరిశోధకులు కూడా అంటుంటారు. మన చరిత్రను మనం నమోదు చేసుకోకపోవడానికి ప్రధాన కారణం భారతీయ తాత్విక దృక్పథమే. మనం సాధించిన అభివృద్ధి లేదా మనమనుభవిస్తున్న క్లేశాలు అశాశ్వతమనే విశ్వాసమే చరిత్ర రచనకు ప్రేరణ కలిగించకపోవడానికి ప్రధాన కారణం. భారతీయుల్లో సామ్రాజ్యవాద కాంక్ష లేకపోవడం కూడా మరో కారణం. మన మీదకి దండెత్తి వచ్చిన వారిని నిలవరించే ప్రయత్నాలు చేశామే కాని పొరుగు దేశాన్ని దురాక్రమించి వాటిని దోచుకుందామనే దురాశ మనకేనాడు లేకపోవడం వల్ల కూడా చరిత్ర రచన జరగలేదు. Read the rest of this entry »