దుప్పల రవికుమార్

సెప్టెంబరు , 2008 నెల టపాలు

సాహితీ ప్రియులకు నిజమైన విందు ఈ ‘సహృదయం’

In వ్యాసం on సెప్టెంబరు 26, 2008 at 4:44 పూర్వాహ్నం

80, 90 దశకాలలో చినవీరభద్రుడి సాహితీ అభ్యాస ప్రతిస్పందనే “సహృదయునికి ప్రేమలేఖలు”. నిజానికివి ఉత్తరాలు కావు. పలు ఉపన్యాస ప్రసంగాలు, కొన్ని పుస్తకాలకు రాసిన ముందుమాటలు. ఇంకా మరికొన్ని సాహితీ వ్యాసాలు. ఈ వ్యాసాలు చదవగానే మనకు తెలిసేది చినవీరభద్రుడు గొప్ప పాఠకుడని. ఇంగ్లిషులో  అయితే ఒరేషియస్ రీడరంటాం. అదే తెలుగులో అయితే భయంకరమైన పాఠకుడంటాం. కథ, కవిత, వ్యాసం, నవల, రిపోర్టులనే భేదం లేకుండా; దేశ కాలాల తేడా లేకుండా; భాషా భేదాలు చూపకుండా సాహిత్యాన్ని, సాహిత్య కారుల్ని రచయిత అధ్యయనం చేసిన సంగతి మనకిట్టే బోధపడుతుంది. ఏనుగు ఆహారం తీసుకుంటున్నట్టుగా కాకుండా, ఆ రచయితల రచనలను ఎంతో సూక్ష్మ పరిశీలనతో చదవడం ఈ “ప్రేమలేఖలు”లో కనిపించే రెండో లక్షణం. Read the rest of this entry »

మనిషి నిజనైజం పోరాడడమే

In నవల on సెప్టెంబరు 19, 2008 at 6:44 పూర్వాహ్నం

ప్రకృతితో మనిషికి శత్రుత్వమైతే లేదు కాని, పోరాటం మాత్రం నిరంతరంగా సాగుతూనే వుంతుంది. తనదైన శైలిలో ప్రకృతితో జరిపే పోరాటమే మానవ నాగరకత బీజం. ఫలితంపై దృష్టి పెట్టకుండా పోరాటం కొనసాగిస్తుండడమే మానవ వికాస చరిత్రకు ప్రాణవాయువు. ఈ భీకర సంగ్రామంలో జయాపజయాలు లెక్కచేస్తే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా ఆ నిరంతర పోరు ఫలితమే. ఆ పరంపరను కొనసాగిస్తూ మనం జరుపుతున్న కృషి భావితరాలకు మరెంతో స్ఫూర్తి. ఈ శృంఖలం ఇలా కొనసాగవలసిందే. దీన్నే ఒక నవలికగా రాసిన ఒక రచయితకు ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమానం అందించాం. ఆ రచయిత పేరు ఎర్నెస్ట్ హెమింగ్ వే. ఆ నవలిక పేరు ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ. Read the rest of this entry »

విమర్శకే కాదు నవల అధ్యయనానికి కూడా చుక్కాని

In వ్యాసం on సెప్టెంబరు 12, 2008 at 5:58 పూర్వాహ్నం

తన “నవలాశిల్పం” కు రాసుకున్న ముందుమాటలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య మంచి నవలకు, వ్యాపార నవలకు మధ్య వున్న తేడాను గుర్తించలేక పోవడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. అక్కడే నవలను అధ్యయనం చేయడం ఎలాగో నేర్పే మంచి గ్రంథం ఇంతవరకు తెలుగులో రాలేదని చెప్తారు. లూకాచ్, కాడ్వెల్, లీవిస్, హెరాల్డ్ బ్లూమ్ తదితర విమర్శకులు రచించిన మాదిరి గ్రంథాలు తెలుగులో లభించడం లేదని విమర్శకుని ఫిర్యాదు. కానీ తెలుగు విమర్శలో విశేషమైన కృషి చేసిన, చేస్తున్న విమర్శకులు చాలా చాలా చాలా తక్కువ మందే కావచ్చు కాని, వారి కృషి మాత్రం అద్వితీయం. రాశిలో తక్కువైనా వాశిలో మాత్రం ఘనమని చెప్పుకోవచ్చు. Read the rest of this entry »

ముద్దులొలికించే ముద్దు కత

In కవిత on సెప్టెంబరు 5, 2008 at 7:57 పూర్వాహ్నం

పదహారో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే కవులుండేవారు. అందులో ఒకరు పింగళి సూరన. మనకు చరిత్రను సరిగ్గా దాదుకునే గుణం లేకపోవడం వల్ల పింగళి సూరన జీవితం గురించి పెద్దగా తెలియదు. సూరనకు సమకాలీనుడైన క్రిస్టోఫర్ మార్లో, విలియం షేక్ స్పియర్ల గురించి మాత్రం ఆ దేశంలో వాళ్లకు బాగా తెలుసు. ఎన్నో వివరాలను సేకరించి, ఖాళీలను సమగ్ర ఆధారాలతో పూరించుకుని ఆ దేశాల్లో భావి తరాల కోసం ఆ పురాతన సాహితీవేత్తలను పదిలంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. Read the rest of this entry »