నేను బ్లాగావరణంలోకి ప్రవేశించిన తరువాత మొదట పరిచయమైన వ్యక్తి దేవరపల్లి రాజేంద్రకుమార్. విశాఖపట్నంలో రిసెర్చ్ చేస్తున్న అతని స్నేహితుని కంప్యూటరులో కొన్ని కొత్త ఉపకరణాలు వేస్తూ చేగొడియాలు తింటూ… బ్లాగు హడావిడికి కాసులు రాలుతాయా.. అని చర్చించుకుంటూ… గడిపిన సాయంత్రం మర్చిపోలేనిది. విశాఖతీరాన… బ్లాగుతో, నవతరంగం నిర్వాహకునిగా.., దాదాపు అన్ని బ్లాగుల్లో సమాధానాలు రాస్తూ… అందరికీ మంచి మిత్రుడైన రాజేంద్రగారితో ఈ వారం చదువు ముచ్చట్లు…
తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు దేవరపల్లి రాజేంద్రకుమార్తో…
మన చదువులు చంపేందుకా?… బతికించేందుకా?
‘ఆంధ్రజ్యోతి’ సచిత్ర వారపత్రికగా మూతపడ్డాక రోడ్డున పడిన అనేకమంది జర్నలిస్టులలో నామిని ఒకరు. డయాస్పోరా సాహిత్యాన్ని, నోస్టాల్జియా కొసమెరుపుతో తెలుగు సాహిత్య వినువీధుల్లో ఒక నూతన ట్రెండును సృష్టించిన ఘనుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. నామిని స్కూల్ సంప్రదాయపు తెరలేపిన రచయిత ఉద్యోగంలేని రోజుల్లో పిల్లల చదువులపై దృష్టి కేంద్రీకరించారు. “ఇస్కూలు పిలకాయల కత“, “పిల్లల భాషలో ఆల్జీబ్రా” అనే రెండు పుస్తకాలను ప్రచురించారు. చదువుతున్న చిన్నారులపై సిలబస్ పేరుతో, మార్కులతో, ర్యాంకులపేరుతో ఎంత వత్తిడి మోపుతున్నామో జాగ్రత్తగా పరిశీలించిన నామిని విద్యారంగంపై తన మూడో పుస్తకం “చదువులా? చావులా?”ను ప్రచురించారు. ఆ పుస్తక పరిచయం ఈ వారం…
ఎనిమిదో వారం చదువు ముచ్చట్లు వీవెన్ తో…
వీవెన్ గారి గురించి నాలుగు పరిచయ వాక్యాలు రాయాలనుకోవడం దుస్సాహసం. ఒక్కటి చెప్పగలను వీవెన్ లేకపోతే ఇప్పటికి నా బ్లాగు వీక్షకుల సంఖ్య వందలోపే వుండేది. అలాంటి బ్లాగు ప్లాట్ ఫారం ప్రారంభించడమే కాకుండా వీవెనుడి టెక్నిక్ లతో విజ్ఞానవంతులను చేస్తున్న అత్యంత సౌమ్యులు వీవెన్. ఆయన చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి….
అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం
న్యూయార్క్ టైమ్స్ పత్రికలో సుమారుగా రెండేళ్లపాటు ప్రతివారం బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో నిల్చున్న అరుదైన పుస్తకం రాబర్ట్ కియోసాకి రాసిన “రిచ్ డాడ్ పూర్ డాడ్”. అమెరికాలో తల్లిదండ్రుల ఆలోచనలను తలకిందులు చేసిందా పుస్తకం. డబ్బు విలువ పిల్లలకు తెలియజెప్పాలని తల్లిదండ్రులందరికీ నిఖార్సయిన హెచ్చరికలు అందజేసిన ఆ విలువైన పుస్తకం ఈ వారం పరిచయం చేసుకందాం.
ఏడోవారం చదువు సంగతులు రెడ్డిశాస్త్రిగారితో…
తెలుగు సాహిత్య లోకంలో ఎ.వి. రెడ్డిశాస్త్రి తెలియని వారుండరు. ఇంగ్లిషు కథావాతావరణాన్ని తెలుగునేల మీద దించిన అతికొద్దిమంది ప్రతిభావంతులైన తెలుగు కథకుల్లో ఈయన ఒకరు. ఇప్పటిదాకా రెండు (“అసంగత సంగతాలు“, “ఈ మంటలు చల్లారవు“) కథాసంపుటాలు ప్రచురించారు. ఈ వారం ఆయన చదువు ఊసులు మనతో పంచుకుంటున్నారు. రెడ్డిశాస్త్రిగారు నా ప్రశ్నలకు స్పందించి సమాధానాలు పంపినందుకు నేను నిజంగా చాలా సంతోషపడ్దాను. ఏడు పదులు దాటిన వేళ కూడా ఇప్పటికీ రోజుకు కనీసం ఐదు గంటలు చదువుతూ, ఏదో ఒకటి రాసుకుంటూ యువతకు స్ఫూర్తిదాయకంగా సాహితీ కృషి సాగిస్తున్నారు. ఇక చదవండి.