చాలారోజుల కిందట నా మొదటి కవిత (ఇసుక దొంగలు) ను మీకు వినిపిస్తే, పరవాలేదన్నారు. కిందటేడాది ఉగాది సందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వినిపించిన కవిత అది. తరువాత ఆ కవితలను “సర్వజిత్ సంకల్పం” పేరుతో పుస్తకంగా ప్రచురించారు. నా రెండో కవితను “తూరుపు” కళింగాంధ్ర కవితా సంకలనం కోసం సంపాదకులు రాయమంటే రాశాను. అదే ‘వందనం’. ఇవ్వాళ దానినే మీ పైకి వదులుతున్నాను. మరి చదవండి…
నా రెండో కవిత ‘వందనం’…
పదమూడో వారం చదువు ముచ్చట్లు కెబిఎస్ కృష్ణతో…
నేను బాల్యంలో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి టెక్కలిలో బాబారావుగారి దగ్గరకు వెళ్లేవాడిని. అంధుడైన, నిరంతరం మంచం మీద వుండే అతనికి ఏం తెలుసని జనం అనుకునేవారు. కానీ అతని మనసొక మహాసాగరమని దగ్గరకు వెళ్లి చూస్తేనే తెలిసేది. (అప్పుడు రోణంకి అప్పలస్వామి మేష్టారి ఎదురింట్లో మా నివాసం) ఇంగ్లిషు భాషా సాహిత్యాల మీద ఆయనది సాధికారత. తరువాత చాలా కాలానికి పరిచయమైన కెబిఎస్ కృష్ణ ఆయన మనుమడే కావడం యాదృచ్ఛికం. కృష్ణ ప్రస్తుతం సీఫెల్ లో సిటీ ఇన్ క్రైంఫిక్షన్ అంశంపై పరిశోధన చేస్తున్నారు. అసాధారణ పాఠకుడైన కృష్ణ చదువును దగ్గరనుంచి చూస్తే ముచ్చట గొలుపుతుంది. ఈ వారం చదువు ముచ్చట్లు ఆయనతోనే. చదవండి మరి…
మానవీయ ముస్లిం కవిత్వం
ఇటీవల ఒక పుస్తక పరిచయం రాస్తూ వాదానికి, ధోరణికి, ఉద్యమానికి తేడా చెరిపేస్తూ నేనో వాక్యం రాస్తే ప్రముఖ కవి పి.ఎస్. నాగరాజు నా ఆలోచన సరిదిద్దుతూ కొన్ని విలువైన మాటలు చెప్పారు. కలగాపులగంగా వున్న నా ఆలోచనలను ఒకదారిలో పెట్టడానికి ఆయన ప్రయత్నించారు. కవులూ రచయితలతోపాటు పాఠకులు కూడా పదాలను ఎంత ప్రమత్తంగా వాడాలో హితబోధ చేశారు. నాగరాజుగారికి కృతజ్ఞత. ఈ ఆలోచనలకు భిన్నదిశలో పొడిగింపుగా మరో సంఘటన కూడా జరిగింది.
పన్నెండో వారం చదివి ముచ్చట్లు పప్పు అరుణగారితో…
మా శ్రీకాకుళమ్ వాస్తవ్యురాలైన పప్పు అరుణ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా బ్లాగులోకంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్-ఎడిటర్ గా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ తొలికథంటే నమ్మలేనట్టుగా రాసిన ‘ఎవరికి తెలియని కథలివిలే” మీరు చదివారా? ఆమె నిరంతర పఠనమే అంత మంచి రచనాశక్తిని అందించిందేమో! మరిన్ని విలువైన సాహిత్య ప్రయోగాలు ఆమెనుంచి తెలుగు పాఠకలోకం ఆశించవచ్చు. ఈ వారం ఆమె చదువు ముచ్చట్లు వినండి మరి…