దుప్పల రవికుమార్

జులై , 2009 నెల టపాలు

ముప్పై ఆరో వారం చదువు ముచ్చట్లు మధురాంతకం నరేంద్రతో…

In చదువు ముచ్చట్లు on జులై 27, 2009 at 6:36 పూర్వాహ్నం
వృత్తిరీత్యా ఇంగ్లిషు ప్రొఫెసరు అయిన మధురాంతకం నరేంద్ర గొప్ప సాహిత్య పిపాసి. ఆయన తండ్రి మధురాంతకం రాజారాం నుంచి వారసత్వంగా అబ్బిన కూసు విద్య సాహిత్య సేవ. ఏటా వస్తున్న కథల్లోంచి మంచి కథలను ఎంచి ప్రతిఏటా “కథావార్షిక” ను తీసుకొస్తున్నారు. అదికాక ప్రతి ఏడాది ఒక రచయితకు కథాకోకిల పురస్కారాన్ని అందించి ప్రతిభావంతులైన రచయితలకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇంతటితో ఆగక రకరకాల సాహితీ సంస్థల సహకారంతో రాష్ట్రమంతటా పర్యటించి సాహితీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. రచయిత రచనలు చేసుకోవడంతోనే ఊరుకోక ఈ విధమైన ఉద్యమ సమానమైన సహృదయ సాహితీ వాతావరణాన్ని సృష్టించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ వారం మధురాంతకం నరేంద్ర చదువు ముచ్చట్లు వినండి మరి… Read the rest of this entry »

వివేచనాత్మక సాహిత్యాన్ని కొత్త దృష్టితో చూపించే వ్యాసాలు

In వ్యాసం on జులై 24, 2009 at 5:51 పూర్వాహ్నం

Pictureనోబెల్ బహుమతి గ్రహీత, స్విస్ భాషా రచయిత హెర్మన్ హెస్ తన “సిద్ధార్థ” నవలలో నదిని వినడం ద్వారా సమస్తం తెలుసుకోగలుగుతామని బోధిస్తాడు. అయితే అంతకు చాలాకాలం ముందునుంచే బైబిలు భూమితో మాట్లాడితే మరిన్ని విషయాలపట్ల వివేచన కలుగుతుందని చెప్తుంది. విప్లవకవి వరవరరావు తన విమర్శ వ్యాస సంపుటికి అదే పేరు “భూమితో మాట్లాడు...” అనే ఖాయం చేశారు. ఆ పుస్తకాన్ని ఈ వారం పాఠకులకు పరిచయం చేస్తున్నాను. Read the rest of this entry »

ముప్పై ఐదోవారం చదువు ముచ్చట్లు ఆరి సీతారామయ్యతో…

In చదువు ముచ్చట్లు on జులై 20, 2009 at 4:46 పూర్వాహ్నం
అమెరికాలో రోచెస్టర్లోని ఓక్ లాండ్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసరుగా పనిచేస్తున్న ఆరి సీతారామయ్య ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అప్పుడప్పుడూ కథలు రాస్తుంటారు. ”గట్టు తెగిన చెరువు” కథాసంపుటి వెలువరించారు. మంచి పాఠకులైన సీతారామయ్యగారి చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి…. Read the rest of this entry »

ఈ గొడవ ఒక్కరిది కాదు… జనమందరిది

In కవిత on జులై 17, 2009 at 4:15 పూర్వాహ్నం

Naa-Godava‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె 

మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు 

పతిత మానవు జూచి చితికిపోవును మనసు 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

తప్పు దిద్దగ లేను దారి చూపగ లేను

తప్పు చేసినవాని దండింపగా లేను

కష్టపడువారలను కాపాడగా లేను 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?

అవకతవకలు నేను సవరింపలేనప్పుడు

‘పరుల కష్టాలతో పనియేమి మాక’నెడు 

అన్యులను గనియైన హాయిగా మనలేను 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’ Read the rest of this entry »

ముప్పై నాలుగో వారం చదువు ముచ్చట్లు టంకశాల అశోక్ తో…

In చదువు ముచ్చట్లు on జులై 14, 2009 at 6:02 పూర్వాహ్నం
అవును, ఈయన వార్త దినపత్రిక ఎడిటర్ అశోక్ గారే. సీనియర్ జర్నలిస్టూ, నిరంతర పఠనమూ, ముక్కుసూటిగా మాట్లాడడమూ అన్న పదాలు స్ఫురించగానే గుర్తొచ్చేది టంకశాల అశోక్ పేరే….  పత్రిక-వార్తలు-విశ్లేషణలు-పర్యటనలు తప్ప నిజానికి మరో పాత్రికేయ రాజకీయ మర్మమేమీ ఎరుగని అశోక్ ఎక్కువ మాట్లాడరు. ఇలాంటి వ్యక్తులు జర్నలిజం వృత్తిలో వుండడం అరుదు. తక్కువ మాట్లాడినా, నిష్టూరమనిపించినా, నిక్కచ్చిగా స్పష్టంగా మాట్లాడడం ఆయన బలహీనత. వార్త ఆదివారం రెగ్యులర్ గా చూస్తూవుంటే ఆయన ఏం చదువుతున్నారో వారు రాసే రివ్యూల బట్టి తెలుస్తుందనుకోండి. ఎంతో మితభాషి, బ్లాగు ప్రపంచానికి దూరంగా వున్న ఆయనతో ఈ నాలుగు మాటలూ మాట్లాడించిందీ కస్తూరి మురళీకృష్ణగారు. ఈ వారం అశోక్ సార్ చదువు ముచ్చట్లు విందామా మరి…. Read the rest of this entry »

ఐదేళ్ళ తెలుగు కథ

In పుస్తకాల ఊసులు on జులై 13, 2009 at 7:06 పూర్వాహ్నం

తెలుగు సాహిత్య అభిమానులకు విజ్ఞప్తి. కథా సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకున్న పాఠకులకు ఈ విన్నపాన్నిప్రసిద్ద కవి, విమర్శకుడు, పాఠకుడు అఫ్సర్ చేస్తున్నారు. దయచేసి ఈ చిన్న నోట్ ను చదివి, సహృదయంతో సహకరించాల్సిందిగా ఈ బ్లాగు పాఠక మిత్రులను కోరుతున్నాను. Read the rest of this entry »

కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు

In Uncategorized on జులై 13, 2009 at 4:37 పూర్వాహ్నం

మీరు చదివారా?” బ్లాగులో వారానికొకటి చొప్పున పుస్తకాన్ని పరిచయం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. కిందిటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ దిగువ పుస్తకాల మీద పరిచయ వ్యాసాలు అందించాను. వాటిని మరొక్కమారు మీకు గుర్తుచేసే ప్రయత్నమిది. Read the rest of this entry »

ఎప్పుడూ భారతీయ ఆధ్యాత్మిక రాయబారి వివేకానందుడే

In అనువాదం, వ్యాసం on జులై 10, 2009 at 4:30 పూర్వాహ్నం

పేదల, దీనుల కుత్తుకలపై పరమనీచముగా హిందూ మతమువలె కాలిడి తొక్కు మతమును లోకమున వేరు లేదు” (1).

బుద్ధుడు మొదలుకుని రామనోహనరావుల వరకును ప్రతి వ్యక్తియు వర్ణ వ్యవస్థతోపాటు మతమును – ధర్మమును – ధ్వంసము చేయబూని విఫలులైరి” (2).

ఇతరులపట్ల పరమ నికృష్టముగా అసూయపడుటలో, (హిందూ మతానికి) ఇంత పేరు ప్రతిష్ట జగత్తున లేదు” (3). Read the rest of this entry »

ముప్పై మూడో వారం చదువు ముచ్చట్లు రెంటాల కల్పనగారితో…

In చదువు ముచ్చట్లు on జులై 6, 2009 at 4:41 పూర్వాహ్నం

తూర్పు పడమర బ్లాగరి అయిన రెంటాల కల్పన కవి. అంతకంటే ముందు మంచి పాఠకులు. “నేను కనిపించే పదం” కవయిత్రి కల్పన వృత్తిరీత్యా జర్నలిస్ట్. నిరంతర సాహిత్య అధ్యయన, రచన తృష్ణ కలిగిన అతికొద్ది మంది తెలుగు సాహితీపరులలో ఈమె ఒకరు. (ఇటీవల ఈమె రాసిన ‘అయిదో గోడ’ కథ మీద జరగవలసినంత సమ్యక్ దృక్పథంలో చర్చ జరగకపోవడం వల్ల ఒక మంచి సాహిత్య సృజన తెలుగు పాఠకలోకానికి చేరలేకపోయిందని నా వ్యక్తిగత ఫిర్యాదు.) ఈమె చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి…. Read the rest of this entry »

జీవన శైలిలో మార్పే వ్యక్తిత్వ వికాసం

In నవల on జులై 3, 2009 at 4:21 పూర్వాహ్నం

themonkవారానికొకటిగా ఇంటర్ నెట్ ప్రపంచంలో “మీరు చదివారా?” బ్లాగులో వస్తున్న పుస్తక పరిచయాలను అభిమానంగా చదివి అభినందిస్తున్న ఓ హెల్త్ అసిస్టెంట్ మిత్రుడు కొన్ని మాసాల కిందట ‘రీడ్ అండ్ రివ్యూ’ అంటూ ఓ పుస్తకం పంపించారు. రాబిన్ ఎస్. శర్మ రాసిన “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ” పుస్తకమది. ఈ వారం ఆ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. Read the rest of this entry »

ఈ నెల పత్రిక “వీక్షణం”

In పత్రిక పరిచయం on జులై 1, 2009 at 11:41 పూర్వాహ్నం

సాహిత్య పాఠకులైన “మీరు చదివారా?” బ్లాగు మిత్రులకు ఇకపై ప్రతినెలా ఒక పత్రికను పరిచయం చేయాలని ఈ పత్రికా పరిచయం శీర్షిక ఉద్దేశం.

 ఈ నెల మనమంతా తప్పక చదవాల్సిన పత్రిక “వీక్షణం” పరిచయం చేస్తున్నాను. Read the rest of this entry »