దుప్పల రవికుమార్

ఆగష్టు, 2009 నెల టపాలు

ముప్పై తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు శరత్ తో…

In చదువు ముచ్చట్లు on ఆగష్టు 17, 2009 at 4:34 పూర్వాహ్నం
ఇంటర్ నెట్ పాఠకులలో శరత్ తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కూడలి నిర్వాహకుడు వీవెన్ తో నిర్వహణపరమైన వివాదంలో దాదాపుగా బ్లాగు రచయితలు పాఠకులు రెండు వర్గాలుగా విడిపోయారు. తన సునిశిత హాస్య, వ్యంగ్య శైలితో శరత్ పాఠకులను అలరించే బ్లాగును ఇక్కడ చూడొచ్చు. అంతే కాకుండా సూక్ష్మ బ్లాగింగ్ కోసం ఒక సైటును నిర్వహిస్తున్నారు. ఇదికాక తన వీడియోచిత్రాలతో యూట్యూబు ద్వారా మరికొంతమంది ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అయితే ఈ సమాధానాలు అందుకున్నంతవరకూ నాకు తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం శరత్ అమెరికాలో నివశిస్తున్నారన్నది. మనిషి అంతశ్చేతన (సబ్ కాన్షస్) గురించి రాయడం వలన మాత్రమే అప్పటి సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి ఇప్పటి శరత్ వరకూ ఇంత వివాదాస్పదం కావడం మనం మర్చిపోకూడదు. మంచి పాఠకులైన శరత్ కమ్మటి రచయిత కూడా. ఆయన “ఎవరు” నవల “చతుర”లో ప్రచురితమైంది. మరి ఈవారం ఆయన చదువు ముచ్చట్లు వినండి… Read the rest of this entry »

ఈ స్వాతంత్ర్య దినోత్సవాన తెలుగు సాహిత్య లోకమంతా శ్రీకాకుళంలోనే…

In మరింకేదైనా.. on ఆగష్టు 12, 2009 at 6:59 పూర్వాహ్నం

కొంచెం అతిగా కన్పించినా ఇది నిజం. సాహిత్య అకాడెమీ, కథానిలయం, శ్రీకాకుళ సాహితి సంయుక్తంగా నిర్వహిస్తున్న కొడవటిగంటి కుటుంబరావు నూరేళ్ల సంబరాలకు ఈసారి శ్రీకాకుళం వేదిక అవుతోంది. దీనికి మహామహులందరూ వస్తున్నారు. పూర్తి వివరాలిదిగో: Read the rest of this entry »

ముప్పైఎనిమిదో వారం చదువు ముచ్చట్లు గొర్తి సాయిబ్రహ్మానందంతో…

In చదువు ముచ్చట్లు on ఆగష్టు 10, 2009 at 5:07 పూర్వాహ్నం

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం రెగ్యులర్ గా చదివే కథాప్రియులకు గొర్తి సాయి బ్రహ్మానందం గారి పేరు సుపరిచితం. ప్రతి ఏటా కనీసం రెండు, మూడు మంచి కథలు రాసే ఈయన వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పుట్టి పెరిగింది కోనసీమ అమలాపురంలోనే చదువు కొనసాగించింది మాత్రం విశాఖపట్నంలో. ప్రస్తుతం వుంటున్నది అమెరికాలో. ‘కంప్యూటర్ బానిసత్వంలో మగ్గుతున్న సిలికాన్ వేలీ తెలుగువాళ్లలో నేనూ ఒకణ్ని’ అని తనను తాను పరిచయం చేసుకునే సాయి బ్రహ్మానందం రాసిన కొన్ని నాటకాలు నంది నాటక పరిషత్ పోటీల్లోనూ, పరుచూరి పరిషత్తులోనూ ప్రదర్శితమయ్యాయి. ఈయన రాసిన “అపార్ట్ మెంట్” నాటకానికి బహుమతులు కూడా పొందారు. దూరదర్శన్ సప్తగిరిలో కొన్ని నాటకాలు ప్రసారమయ్యాయి. అప్పుడప్పుడూ రాస్తూన్న కథలూ వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. ఈ వారం ఆయన చదువు ముచ్చట్లు వినండి మరి… Read the rest of this entry »

నాయకులకే కాదు ప్రజలకూ తెలియాలి పాలన

In వ్యాసం on ఆగష్టు 7, 2009 at 4:45 పూర్వాహ్నం

paalanaరాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్సుకు, పాలన శాస్త్రం అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషనుకు పోలికగానీ తేడాగాని తెలియని సైన్స్ గ్రాడ్యుయేట్లను చూస్తుంటే మన చదువుల మీద చిరాకేస్తుంది. ఒకసారి పుస్తకాల పార్సిలు వి.పి.పిలో వస్తే విడిపించుకోవడానికి పోస్టాఫీసుకు వెళ్లాను. పదిహేను పదహారేళ్ల కుర్రాడొకడు స్టాంపుల కోసం కౌంటర్లో అడిగాడు. పోస్టల్ అసిస్టెంట్ ఆ కుర్రాడి మీద దయ చూపకుండా “ఏవి కావాలి? పోస్టల్ స్టాంపులా? రెవెన్యూ స్టాంపులా?” అని అడిగాడు. ఆ రెండింటికీ తేడా తెలియని ఆ కుర్రాడు బిక్కమొగం వేశాడు. ఆ కుర్రాడి దగ్గరకెళ్ళి వాటిని దేనికోసం తెమ్మన్నారో Read the rest of this entry »

ఈ వారం చదువు ముచ్చట్లు ఎవరితో…?

In చదువు ముచ్చట్లు on ఆగష్టు 3, 2009 at 6:15 పూర్వాహ్నం
తెలుగు దినపత్రికల లోకంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో “సాక్షి” రావడంతో ఇటు జర్నలిస్టుల, అటు నాన్-జర్నలిస్టుల జీవితాలు బాగుపడడం మొదట కనిపించిన మార్పు. ‘అవతలి కోణం’ ఇప్పుడు పాఠకులకు తెలియరావడం రెండో సంగతి. అంతర్జాతీయ స్థాయి జర్నలిజపు, పత్రికా మేకప్పూ తదితర హంగులు, రూపులూ మనకు కూడా తెలియడం మూడో ముచ్చట. వీటన్నింటిని పక్కనపెడితే వార్తలను, ఫీచర్లను కలగలిపేసిన తెలుగు పాత్రికేయాన్ని ఆ చెరనుంచి రక్షించ ప్రయత్నం చేస్తోంది సాక్షి”. అందుకు ఉదాహరణలుగా నిలుస్తున్న కలాలే ఖదీర్ బాబు, యాసీన్, యాకూబ్ పాషా, మాధవ్ శింగరాజు, మాధవీకళ, తదితరులు. ఈ కుర్ర హీరోల పేర్ల జాబితాలో నేను కావాలని వదిలేసిన పేరోదో మీరు చెప్పుకోండి. ప్రతి మాటలోనూ భావుకత, లాలిత్యం ఉట్టిపడేలా అక్షరాలను చెక్కే ఆ యువ రచయిత చదువు ముచ్చట్లు ఈ వారం మీకోసం… (పేరు ప్రశ్నజవాబుల కిందనుంది – ముందు జవాబులు చదివి తర్వాతే పేరు చూడండేం!) Read the rest of this entry »

ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం

In పత్రిక పరిచయం on ఆగష్టు 1, 2009 at 10:31 పూర్వాహ్నం

ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం

పుస్తకాలు చదివేవారంతా అనివార్యంగా ప్రేమించేది పత్రికలను. ప్రతి వారం వారానికొక పుస్తకం చొప్పున పరిచయం చేస్తున్న ఈ బ్లాగులో ఇప్పటికే వున్న “చదువు ముచ్చట్లు” శీర్షికతో పాటు మరో సరికొత్త శీర్షికను నిర్వహించాలని ప్రయత్నం. ఈ “పత్రిక పరిచయం” శీర్షికలో  సాహిత్య, సామాజిక అంశాలకు సంబంధించిన వివిధ పత్రికలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.  ఈ శీర్షికను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.  మీకు తెలిసిన కొన్ని పత్రికల వివరాలు కూడా తెలియపరచండి.

కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ముందుగా చెప్పుకోదగ్గ పత్రిక “ప్రజాసాహితి”.  Read the rest of this entry »