అది త్రేతాయుగం…
నూనూగు మీసాల నూతన యవ్వనంలో పడుచు అందాల రాముడు తన తోటి సావాసగాళ్లతో రవ్వంత తుళ్లింతతో ఆటపాటలలో లీనమైవుండగా, తమ రాజసౌధానికి వచ్చిన మునులకు వంగి ప్రణమిల్లి వారికి దారిచ్చి మరలా తన ఆటలో మునిగిపోయాడు. అలా వెళ్లిన మునులు ఇలా తననే రమ్మనేసరికి ఆశ్చర్యపోతూ బిడియపడుతూ తండ్రి దశరథరాజు కొలువులోకి అడుగుపెట్టాడు. వారు చెప్పిందంతా విని మ్రాన్పడిపోయాడు.
read more »