ప్రతి ఏడాది ఎంతో నిష్టగా తెలుగు కథా సాహిత్యాన్నంతా కాచివడపోసి, ఆణిముత్యాల్లాంటి కథలను ఏరి, కథా సిరీస్ మనకందిస్తున్న కథా సంకలనలలో ‘కథ – 2002′ ను ఈ వారం పరిచయం చేస్తున్నాను. ఆర్థిక సంస్కరణల పేరిట గ్లోబలైజేషన్ కు ప్రపంచ దేశాలు వ్యాపార ద్వారాలు బార్లా తెరిచినపుడు ఏర్పడిన పరిణామాలు (మంచివి కానివ్వండి, చెడ్డవి కానివ్వండి) ఆయా దేశాల ప్రజలందరినీ ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. చేస్తూనే వుంటాయి. ఇదే విషయాన్ని ఈ కథా సిరీస్ ఎడిటర్ Read the rest of this entry »
‘కథ’ అనే వర్గంలోని టపాలు
ప్రపంచీకరణ్ వెర్సస్ పతనీకరణ
In కథ on ఏప్రియల్ 17, 2009 at 4:33 పూర్వాహ్నంమట్టివాసనతో మత్తెక్కించే ‘దర్గామిట్ట’ కతలు
In కథ on మార్చి 27, 2009 at 7:28 పూర్వాహ్నంజీవిక కోసమో, ఉపాధి కోసమో దేశాలు వలసలు పోయేవాళ్లకు ఆ పరాయి గడ్డలో ఆర్థికంగా కొంత పట్టు సంపాదించాక సొంతగడ్డ గుర్తొస్తుంది. తమ బాల్యం గురించి, ఆనాటి జ్ఞాపకలనూ మధురంగా తలచుకుంటూ వాటిని నెమరువెసుకుంటూ సాహిత్య సృజన చేస్తారు. దానినే మనం ‘డయాస్పోరా లిటరేచర్’ అని పిలుస్తున్నాం. Read the rest of this entry »
మన జన జీవితానికి అసలు సిసలు ప్రతిబింబం
In కథ on డిసెంబరు 5, 2008 at 4:19 పూర్వాహ్నం
తెలుగు సాహిత్య చరిత్రలో కళింగాంధ్ర అందించిన, అందిస్తున్న అసమానమైన కృషికి ప్రత్యేక గుర్తింపు వుంది. అందులోనూ శ్రీకాకుళ సాహితి సంస్థగా చేస్తున్న కృషిని తెలుగు సాహిత్యాభిమానులంతా గమనించి, గౌరవిస్తున్నారు. ఈ సంస్థ ఒక కార్యదీక్షతో సిరీసుగా వెలువరిస్తున్న కథా సంకలనాల పట్ల సాహితీ ప్రియులందరికీ ఎన్నో ఆశలు. ఆ ఆశలను తీరుస్తూ షడ్రచులతో వెలువరించిన కొత్త పుస్తకం “జంఝావతి కథలు”. శ్రీకాకుళంలో ప్రవహిస్తున్న నదీమ తల్లుల పేర్లతో ఇక్కడి జన జీవితాన్ని వారి సమస్యలను, జీవన పోరాటాన్ని అక్షరబద్దం చేయడానికి శ్రీకాకుళ సాహితి ప్రయత్నిస్తోంది. Read the rest of this entry »
కాలం గతి – మనిషి మతి – కథల శ్రుతి
In కథ on నవంబరు 28, 2008 at 9:45 పూర్వాహ్నం
ఒక ఏడాదిలో వివిధ దిన, వార, పక్ష, మాస, వార్షిక పత్రికలలో ప్రచురితమైన కథలనుంచి సుమారు పదిహేను కథల్ని ఎంపిక చేసి ఆ ఏడాది “కథ” పేరిట కథాసాహితి ప్రతియేటా 1990 నుంచి ప్రచురిస్తోంది. ఆ సిరీస్ తెలుగు సాహిత్యలోకంలో ఎంత ప్రాముఖ్యం సంపాదించిందంటే తెలుగు రచయితలు కథ సిరీస్ లో ఎంటరవడం పెద్ద రివార్డుగా భావిస్తారు. ఆ వరుస సంకలనాలు పాఠకలోకం నుంచి అంతే ఆదరణ పొందాయనడానికి నిదర్శనం – కాపీలు విడుదలైన Read the rest of this entry »
మట్టివాసనకు ఆనవాళ్లు నామిని కథలు
In కథ on నవంబరు 21, 2008 at 9:37 పూర్వాహ్నం
బాల్యంలో ఎంతో శ్రమించి అధోజగత్తు సహోదరులతో సహజీవనం గావించి అనంత జీవిత పరమపద సోపానపటంలో గబగబా నిచ్చెన మెట్లెక్కి సుఖపడేవారు కొందరుంటారు. వారిలో కొందరు ఆనాటి తమ బాల్యపు మధుర స్మృతులను సాహితీ రూపాలలో రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియనే డయాస్పోరా లేదా నోస్టాల్జియా సాహిత్యం అని పిలుస్తున్నాం. డయాస్పోరా సాహిత్యంలో ఆఫ్ బీట్ సాహిత్యమనదగ్గ గొప్ప కథలను రాసింది నామిని సుబ్రమన్యం నాయుడు. Read the rest of this entry »
ఏడు రుచుల సమ్మేళనం ‘ఆమె నవ్వు’ కథల సంపుటం
In కథ on నవంబరు 3, 2008 at 9:46 పూర్వాహ్నం
జీవితం పట్ల గొప్ప ఎరుకను కలిగించే మంచి కథకుడు యాళ్ల అచ్యుతరామయ్య. అలాంటి మంచి కథల మణిహారం “ఆమె నవ్వు” కథా సంపుటి ఇటీవల తెలుగు సాహిత్యంలో వెలువడిన తాజా ఉదాహరణ. 1991నుండి 1998 వరకు అంటే ఒక దశాబ్దకాలం పాటు తాను రాసిన ఇరవై రెండు కథలను గుదిగుచ్చి “ఆమె నవ్వు” అనే కథాహారంగా మనకు అచ్యుతరామయ్య అందించారు. ఇలా ఒకచోట చేర్చిన రెండు తక్కువ రెండు డజన్ల కథలన్నీ ఎంతో వైవిధ్యం కలిగినవి. చదివే పాఠకులకు వాస్తవిక జీవితానికి సంబంధించి ఒక స్పష్టమైన ఎరుకను అందిస్తాయి. Read the rest of this entry »
ఎ.వి. రెడ్డిశాస్త్రి రెండో కథల సంపుటి “ఈ మంటలు చల్లారవు”
In కథ on అక్టోబర్ 3, 2008 at 9:14 పూర్వాహ్నం
1897 నాటి గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం” మొదటి కూర్పును బంగోరె 1969లో స్కాలర్స్ ఎడిషన్ గా ప్రచురించారు. ఆ పుస్తకాన్ని తన ‘సంవేదన’ ఆరో సంచికలో రాచమల్లు రామచంద్రారెడ్డి సమీక్షించారు. అందులో ఇలా అంటారు: ‘షేక్ స్పియర్ అయినా అంతే, ఇబ్సెన్ అయినా అంతే, చెహోవ్ అయినా అంతే, గొప్ప కళాకారులెవరైనా అంతే. వాళ్ల శిల్పం సాధారణంగా అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది. కానీ వాళ్ల గొప్పతనం వాళ్ల శిల్పజ్ఞతలో వుండదు. షేక్ స్పియర్ గొప్పతనం అతని రచనల్లోని సర్వంకషమైన జీవిత వాస్తవికతలో వుంది. ఇబ్సన్ గొప్పతనం అతని రచనల్లోని గుండెలు పెకలించే విప్లవ భావనలో వుంది. చెహోవ్ లోని గొప్పతనం మహా కరుణార్ద్రమైన అతని మానవతా దృక్పథంలో వుంది. ఈ సర్వ గుణాల సమగ్ర సమ్మేళనంలో వుంది’. Read the rest of this entry »
అసలు సిసలు పోస్ట్ మోడర్న్ కథలు: “మాయలాంతరు”
In కథ on జులై 25, 2008 at 4:02 పూర్వాహ్నం
ఒక రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ముఖం చూసుకుందామని అద్దం ముందుకు వెళితే అక్కడ మీ ముఖానికి బదులు ఓ పురుగు కనిపిస్తుందనుకోండి. మీ పరిస్థితి ఏంటి? ఫ్రాంజ్ కాఫ్కా అనే ఫ్రెంచి రచయిత “మెటామార్ఫాసిస్” అనే కథను ఇలా మొదలుపెడతాడు. మనిషి రోజురోజుకు ఒంటరివాడై పోవడం (థీమ్ ఆఫ్ ఎలియనేషన్), నాగరికత పేరుతో మానవ జీవితంలో జరుగుతున్న విధ్వంసం ఇలాంటి రచనల్ని సృష్టించింది. Read the rest of this entry »
మానవీయ స్పర్శతో నిండిన కథలు
In కథ on జూన్ 20, 2008 at 4:48 పూర్వాహ్నం
సాహిత్యమెప్పుడూ హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడదు. జీవితంలోంచే పుడుతుంది. సాహిత్య రూపాలు జీవితాన్ని యథార్థంగా ప్రతిబింబించినప్పుడే అవి అందరి మన్నన పొందుతాయి. ప్రశంసలుపొందిన సాహితీవేత్తలు అటు జీవితాన్ని సునిశితంగా పరిశీలించడమే కాకుండా సాహిత్యాన్ని ఔపోశన పట్టినపుడే వాళ్లు సృజించిన ప్రతి అక్షరమూ పాఠకుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీవితపు చలన సూత్రాలను సమర్థంగా అర్థం చేసుకోవడానికి, రొటీన్ జీవితంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆనంద సంతోషాలు నింపుకోవడానికీ సాహిత్య పఠనం ఎంతో ఉపకరిస్తుంది. Read the rest of this entry »
జీవితం మనది.. కథనం మాత్రం భిన్నం..”అసంగత సంగతాలు”
In కథ on మార్చి 28, 2008 at 4:30 పూర్వాహ్నం
ఎవరు సాహిత్య సృజనచేసినా జీవితాన్ని వదిలేసి ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తే నేల విడిచి సాము గారడీ చేయడమే అవుతుంది. జీవితంలో ప్రతీదీ అనుభవించి నేర్చుకోవా లనుకోవడం మూర్ఖత్వం. ‘విన్నంత కన్నంత..’ అని భర్తృహరి ఏనాడో జీవన సూత్రం చెప్పాడు. జీవన మాధుర్యంలో రుచేకాదు జీవితాన్ని కొన్ని కీలక సూత్రాలు సైతం వినీ కనీ అనుభవించీ మాత్రమే కాక సాహిత్య అధ్యయనం ద్వారా కూడా నేర్చుకోవచ్చని మానవ చరిత్ర బోధిస్తోంది. అలా జీవితాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి కథా పఠనం కూడా ఒక సాధనమే. అయితే అలాంటి కథలు రాసేవారు మాత్రం అరుదు. మరి సామాన్య జీవితాన్ని సైతం అసామాన్యంగా కథనీకరణం చేస్తే అప్పుడే అధ్యయనం మొదలుపెట్టిన పాఠకుడు మాత్రం కంగారు పడిపోవడం ఖాయం. కానీ ఓపిగ్గా ఎలా చెప్తున్నారన్న అంశంతోపాటు ఏమిటి చెప్తున్నారన్న విషయం కూడా అవగతం చేసుకుంటే మనసు విశాలమవుతుంది. బుద్ధి వికసితమవుతింది. Read the rest of this entry »