దుప్పల రవికుమార్

‘చదువు ముచ్చట్లు’ అనే వర్గంలోని టపాలు

ముప్పై తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు శరత్ తో…

In చదువు ముచ్చట్లు on ఆగష్టు 17, 2009 at 4:34 పూర్వాహ్నం
ఇంటర్ నెట్ పాఠకులలో శరత్ తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కూడలి నిర్వాహకుడు వీవెన్ తో నిర్వహణపరమైన వివాదంలో దాదాపుగా బ్లాగు రచయితలు పాఠకులు రెండు వర్గాలుగా విడిపోయారు. తన సునిశిత హాస్య, వ్యంగ్య శైలితో శరత్ పాఠకులను అలరించే బ్లాగును ఇక్కడ చూడొచ్చు. అంతే కాకుండా సూక్ష్మ బ్లాగింగ్ కోసం ఒక సైటును నిర్వహిస్తున్నారు. ఇదికాక తన వీడియోచిత్రాలతో యూట్యూబు ద్వారా మరికొంతమంది ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అయితే ఈ సమాధానాలు అందుకున్నంతవరకూ నాకు తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం శరత్ అమెరికాలో నివశిస్తున్నారన్నది. మనిషి అంతశ్చేతన (సబ్ కాన్షస్) గురించి రాయడం వలన మాత్రమే అప్పటి సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి ఇప్పటి శరత్ వరకూ ఇంత వివాదాస్పదం కావడం మనం మర్చిపోకూడదు. మంచి పాఠకులైన శరత్ కమ్మటి రచయిత కూడా. ఆయన “ఎవరు” నవల “చతుర”లో ప్రచురితమైంది. మరి ఈవారం ఆయన చదువు ముచ్చట్లు వినండి… Read the rest of this entry »

ముప్పైఎనిమిదో వారం చదువు ముచ్చట్లు గొర్తి సాయిబ్రహ్మానందంతో…

In చదువు ముచ్చట్లు on ఆగష్టు 10, 2009 at 5:07 పూర్వాహ్నం

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం రెగ్యులర్ గా చదివే కథాప్రియులకు గొర్తి సాయి బ్రహ్మానందం గారి పేరు సుపరిచితం. ప్రతి ఏటా కనీసం రెండు, మూడు మంచి కథలు రాసే ఈయన వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పుట్టి పెరిగింది కోనసీమ అమలాపురంలోనే చదువు కొనసాగించింది మాత్రం విశాఖపట్నంలో. ప్రస్తుతం వుంటున్నది అమెరికాలో. ‘కంప్యూటర్ బానిసత్వంలో మగ్గుతున్న సిలికాన్ వేలీ తెలుగువాళ్లలో నేనూ ఒకణ్ని’ అని తనను తాను పరిచయం చేసుకునే సాయి బ్రహ్మానందం రాసిన కొన్ని నాటకాలు నంది నాటక పరిషత్ పోటీల్లోనూ, పరుచూరి పరిషత్తులోనూ ప్రదర్శితమయ్యాయి. ఈయన రాసిన “అపార్ట్ మెంట్” నాటకానికి బహుమతులు కూడా పొందారు. దూరదర్శన్ సప్తగిరిలో కొన్ని నాటకాలు ప్రసారమయ్యాయి. అప్పుడప్పుడూ రాస్తూన్న కథలూ వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. ఈ వారం ఆయన చదువు ముచ్చట్లు వినండి మరి… Read the rest of this entry »

ఈ వారం చదువు ముచ్చట్లు ఎవరితో…?

In చదువు ముచ్చట్లు on ఆగష్టు 3, 2009 at 6:15 పూర్వాహ్నం
తెలుగు దినపత్రికల లోకంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో “సాక్షి” రావడంతో ఇటు జర్నలిస్టుల, అటు నాన్-జర్నలిస్టుల జీవితాలు బాగుపడడం మొదట కనిపించిన మార్పు. ‘అవతలి కోణం’ ఇప్పుడు పాఠకులకు తెలియరావడం రెండో సంగతి. అంతర్జాతీయ స్థాయి జర్నలిజపు, పత్రికా మేకప్పూ తదితర హంగులు, రూపులూ మనకు కూడా తెలియడం మూడో ముచ్చట. వీటన్నింటిని పక్కనపెడితే వార్తలను, ఫీచర్లను కలగలిపేసిన తెలుగు పాత్రికేయాన్ని ఆ చెరనుంచి రక్షించ ప్రయత్నం చేస్తోంది సాక్షి”. అందుకు ఉదాహరణలుగా నిలుస్తున్న కలాలే ఖదీర్ బాబు, యాసీన్, యాకూబ్ పాషా, మాధవ్ శింగరాజు, మాధవీకళ, తదితరులు. ఈ కుర్ర హీరోల పేర్ల జాబితాలో నేను కావాలని వదిలేసిన పేరోదో మీరు చెప్పుకోండి. ప్రతి మాటలోనూ భావుకత, లాలిత్యం ఉట్టిపడేలా అక్షరాలను చెక్కే ఆ యువ రచయిత చదువు ముచ్చట్లు ఈ వారం మీకోసం… (పేరు ప్రశ్నజవాబుల కిందనుంది – ముందు జవాబులు చదివి తర్వాతే పేరు చూడండేం!) Read the rest of this entry »

ముప్పై ఆరో వారం చదువు ముచ్చట్లు మధురాంతకం నరేంద్రతో…

In చదువు ముచ్చట్లు on జులై 27, 2009 at 6:36 పూర్వాహ్నం
వృత్తిరీత్యా ఇంగ్లిషు ప్రొఫెసరు అయిన మధురాంతకం నరేంద్ర గొప్ప సాహిత్య పిపాసి. ఆయన తండ్రి మధురాంతకం రాజారాం నుంచి వారసత్వంగా అబ్బిన కూసు విద్య సాహిత్య సేవ. ఏటా వస్తున్న కథల్లోంచి మంచి కథలను ఎంచి ప్రతిఏటా “కథావార్షిక” ను తీసుకొస్తున్నారు. అదికాక ప్రతి ఏడాది ఒక రచయితకు కథాకోకిల పురస్కారాన్ని అందించి ప్రతిభావంతులైన రచయితలకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇంతటితో ఆగక రకరకాల సాహితీ సంస్థల సహకారంతో రాష్ట్రమంతటా పర్యటించి సాహితీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. రచయిత రచనలు చేసుకోవడంతోనే ఊరుకోక ఈ విధమైన ఉద్యమ సమానమైన సహృదయ సాహితీ వాతావరణాన్ని సృష్టించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ వారం మధురాంతకం నరేంద్ర చదువు ముచ్చట్లు వినండి మరి… Read the rest of this entry »

ముప్పై ఐదోవారం చదువు ముచ్చట్లు ఆరి సీతారామయ్యతో…

In చదువు ముచ్చట్లు on జులై 20, 2009 at 4:46 పూర్వాహ్నం
అమెరికాలో రోచెస్టర్లోని ఓక్ లాండ్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసరుగా పనిచేస్తున్న ఆరి సీతారామయ్య ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అప్పుడప్పుడూ కథలు రాస్తుంటారు. ”గట్టు తెగిన చెరువు” కథాసంపుటి వెలువరించారు. మంచి పాఠకులైన సీతారామయ్యగారి చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి…. Read the rest of this entry »

ముప్పై నాలుగో వారం చదువు ముచ్చట్లు టంకశాల అశోక్ తో…

In చదువు ముచ్చట్లు on జులై 14, 2009 at 6:02 పూర్వాహ్నం
అవును, ఈయన వార్త దినపత్రిక ఎడిటర్ అశోక్ గారే. సీనియర్ జర్నలిస్టూ, నిరంతర పఠనమూ, ముక్కుసూటిగా మాట్లాడడమూ అన్న పదాలు స్ఫురించగానే గుర్తొచ్చేది టంకశాల అశోక్ పేరే….  పత్రిక-వార్తలు-విశ్లేషణలు-పర్యటనలు తప్ప నిజానికి మరో పాత్రికేయ రాజకీయ మర్మమేమీ ఎరుగని అశోక్ ఎక్కువ మాట్లాడరు. ఇలాంటి వ్యక్తులు జర్నలిజం వృత్తిలో వుండడం అరుదు. తక్కువ మాట్లాడినా, నిష్టూరమనిపించినా, నిక్కచ్చిగా స్పష్టంగా మాట్లాడడం ఆయన బలహీనత. వార్త ఆదివారం రెగ్యులర్ గా చూస్తూవుంటే ఆయన ఏం చదువుతున్నారో వారు రాసే రివ్యూల బట్టి తెలుస్తుందనుకోండి. ఎంతో మితభాషి, బ్లాగు ప్రపంచానికి దూరంగా వున్న ఆయనతో ఈ నాలుగు మాటలూ మాట్లాడించిందీ కస్తూరి మురళీకృష్ణగారు. ఈ వారం అశోక్ సార్ చదువు ముచ్చట్లు విందామా మరి…. Read the rest of this entry »

ముప్పై మూడో వారం చదువు ముచ్చట్లు రెంటాల కల్పనగారితో…

In చదువు ముచ్చట్లు on జులై 6, 2009 at 4:41 పూర్వాహ్నం

తూర్పు పడమర బ్లాగరి అయిన రెంటాల కల్పన కవి. అంతకంటే ముందు మంచి పాఠకులు. “నేను కనిపించే పదం” కవయిత్రి కల్పన వృత్తిరీత్యా జర్నలిస్ట్. నిరంతర సాహిత్య అధ్యయన, రచన తృష్ణ కలిగిన అతికొద్ది మంది తెలుగు సాహితీపరులలో ఈమె ఒకరు. (ఇటీవల ఈమె రాసిన ‘అయిదో గోడ’ కథ మీద జరగవలసినంత సమ్యక్ దృక్పథంలో చర్చ జరగకపోవడం వల్ల ఒక మంచి సాహిత్య సృజన తెలుగు పాఠకలోకానికి చేరలేకపోయిందని నా వ్యక్తిగత ఫిర్యాదు.) ఈమె చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి…. Read the rest of this entry »

ముప్పైరెండో వారం చదువు ముచ్చట్లు జ్ఞానప్రసూనగారితో…

In చదువు ముచ్చట్లు on జూన్ 29, 2009 at 6:05 పూర్వాహ్నం

 prasuna ప్రతి ఇంట్లో హడావిడీ జీవితం ఐపోయింది. చదువు, ఉద్యోగాలు అంటు పరుగులెత్తడం. ఉమ్మడి కుటుంబాలు కావు. మంచి మాటలు చెప్పే పెద్దవాళ్లు లేరు. మరి జీవిత ప్రయాణంలో తగిలే ఒడిదుడులు , ఆటుపోట్ల సమయంలో బామ్మ, అమ్మమ్మ తప్పక గుర్తొస్తుంది కదా. మరి ఆ బామ్మ కూడా మనతో సమానంగా కంప్యూటర్ ముందు కూర్చుని బ్లాగు రాస్తుంటే ?? ఈ ఆలోచన వింతగా ఉందా. కాని 70 ఏళ్లకు పైబడ్డ జ్ఞానప్రసూనగారు చురుగ్గా , క్రమం తప్పకుండా సురుచి అనే బ్లాగును నిర్వహిస్తున్నారు. ఆ బ్లాగు టైటిల్ తగ్గట్టే ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి. ఎన్నో మంచి మాటలు చెప్తారు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ల్నప్పుడు, అక్కడ వాళ్లందరు ఏదో చిన్న పెట్టి పట్టుకుని టక్కు టక్కుమంటూ ఉంటారు. బోర్ కొడుతుంది అంటే కొడుకు తెచ్చిచ్చిన లాప్ టాప్ తో కష్టపడి టైపింగ్ నేర్చుకుని పిల్లల సాయంతోనే బ్లాగు మొదలెట్టి , తనకు తెలిసిన ఎన్నో మంచి పద్యాలు, కథలు, పురాణా విశేషాలు చెప్తుంటారు. బ్లాగ్ అంటే ఆలోచనా తరంగం.ఇది ఇంత పరిధిలోనే వుండాలి, ఈవిషయం పైనే వ్రాయాలి అనే నియమం లేదు. ఒక్కొక్క తరంగానికి ఆలోచనా రూపం ఇవ్వడమే! ఒక వర్ణన, ఒకడైరీ,  ఒక ఆశ్చర్యం,  ఒక ఆనందం,  ఒక పొగడ్త, ఒక వేదన. ఏదైనా కావచ్చు. దీనిలో అంతస్సూత్రంగా ఒక గొంతు వుంటుంది. అది స్వానుభవాలని, అభిప్రాయాలని, ఆశని వెలువరిస్తుందనే మాట ప్రతి బ్లాగరూ ఒప్పుకుంటారు. అమెరికా కనిపెట్టనేలా?పెట్టితిరిబో మనవాళ్ళు వెడలనేలా?వెడలితిరిబో వెనుకకు రాకపోనేలా? అడుగంటెన్ బామ్మల ముద్దుముచ్చటల్! అంటూ విదేశాలనుండి వచ్చిన మనవడు వెళ్లిపోయాక ఆవిడ పడ్డ బాధ అందరికీ బాధ కలిగిస్తుంది. ఉద్యోగాలు చదువుల వేటలో వెళ్లినవారి బామ్మలు, అమ్మమ్మలు అందరూ ఇలాగే బాధపడతారేమో… 

ఇలా వివిధ అంశాలపై, మంచి మంచి మాటలు అందించే జ్ఞానప్రసూన గత ఏడవ, ఏనిమిదవ దశకంలో పత్రికా పాఠకులకు సుపరిచితుడైన రావూరి వెంకట సత్యనారాయణగారి కుమార్తె. మరి ఈ వారం ఈమె చదువు ముచ్చట్లు వినండి… Read the rest of this entry »

ముప్పై ఒకటో వారం చదువు ముచ్చట్లు గీతా రామస్వామిగారితో…

In చదువు ముచ్చట్లు on జూన్ 22, 2009 at 5:45 పూర్వాహ్నం

తెలుగు పుస్తక ప్రచురణ రంగంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక మేలిమి మలుపు. ప్రత్యామ్నాయ సాహిత్య ప్రచురణలో, ముఖ్యంగా అనువాద సాహిత్య ప్రచురణలో తెలుగు పాఠకులకు ఒక పెన్నిధి హెచ్ బి టి. ఉత్తమ సాహిత్య ప్రచురణతో పాటు పాఠకులకు అందుబాటులో ఉండే ధరలతో తెలుగు పాఠకలోకానికి ఎనలేని సాహిత్య సేవ చేస్తున్న హెచ్ బి టి కృషి వెనుకనున్నది గీతా రామస్వామి గారు. స్వయంగా రచయిత్రి అయిన గీతగారు ఒక మంచి పాఠకురాలు. తెలుగు నాకు పెద్దగా రాదు కనుక ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం బాగోదేమో అని ముందు నిరాకరించినా, ఈ జవాబుల ఉపయోగం చెప్పాక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చి సహకరించారు. ఆమె ఇంగ్లీషులో రాసిన జవాబులను యథాతథంగా ఇస్తూ నా తెలుగు స్వేచ్చానువాదాన్ని కూడా బ్రాకెట్లలో ఇస్తున్నా. మరి ఈ వారం గీత గారి చదువు ముచ్చట్లు చదవండి… Read the rest of this entry »

ముప్పయ్యో వారం చదువు ముచ్చట్లు హెచ్చార్కెతో…

In చదువు ముచ్చట్లు on జూన్ 15, 2009 at 10:44 పూర్వాహ్నం

కొందరు డబ్బుతో కులుకుతారు. ఇంకొందరు నచ్చినవి తింటూ కులుకుతారు. కొందరు చదువుతూ కులుకుతుంటారు. నేనేమో నా బ్లాగువల్ల కులుకుతున్నాను. ఎంత కులుకంటే… నా కళ్ళు ఎప్పుడో నెత్తిమీదికి చేరిపోయాయి. ఈ పదిహేను నెలల బ్లాగు ప్రయాణంలో వందకు దాటి పరిచయ వ్యాసాలు, ఐదు వందలకు దాటి కామెంట్లు, వీటికి మించి సాహితీ ప్రపంచంలో నేను నోరు తెరుచుకుని, కళ్లు చిట్లించుకుని చూసే పెద్దపెద్ద తలకాయల్తో పరిచయాలు… అహాహా నా కులుకుకు లెక్కలేకపోతుంటే… ఇంతలో నాకెంతో నచ్చే హెచ్చార్కె సార్ ఊసులు ఈ వారం చదువు ముచ్చట్లుగా నా బ్లాగు మిత్రులకు అందజేస్తుంటే…. ఎలాగుందో మీకెవరికైనా తెలుసా…. నా కులుకు కైపు, నిషాల సంగతి తర్వాత… ముందు హెచ్చార్కె చదువు ముచ్చట్లు వినండి మరి…. Read the rest of this entry »

ఇరవై తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు గొరుసు జగదీశ్వర రెడ్డితో…

In చదువు ముచ్చట్లు on జూన్ 9, 2009 at 5:12 పూర్వాహ్నం

గొరుసు కథలు కొన్ని చదివాక కళింగాంధ్ర కథకుడేమో ననుకున్నా. కానీ తరవాత తెలిసింది, తెలంగాణ, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాలలో ఉద్యోగరీత్యా సంచరించి అన్ని ప్రాంతాలవారికీ వారి సొంత మనిషిలాగే కనిపించే భాషలో కథల్రాస్తారని. తెలుగు సాహిత్యంలో గర్వించదగ్గ కథలు రాసే జగదీశ్వర్ అడపాతడపా బ్లాగుల్లో కామెంట్లు మాత్రమే రాస్తుంటారు. అంటే సొంత బ్లాగు మొదలెట్టని అబ్లాగరి. వృత్తిరీత్యా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న ఈయనకి జర్నలిజమన్నా, సాహిత్యమన్నా ఎంతో ప్రేమ, మమకారం. మరి ఈ వారం ఈ మధుర కథకుడి చదువు ముచ్చట్లు వినండి… Read the rest of this entry »

ఇరవై ఎనిమిదో వారం చదువు ముచ్చట్లు అఫ్సర్ తో…

In చదువు ముచ్చట్లు on మే 25, 2009 at 7:39 పూర్వాహ్నం

సాధారణంగా చదువు ముచ్చట్లను ప్రతివారం బ్లాగులతో పరిచయమున్న వ్యక్తులనే అడుగుతూ వస్తున్నాగాని, దీని పరిధిని మరింత పెంచాలని రచయితలను, కవులను, కొందరు విమర్శకులను కూడా ప్రశ్నలు పంపిస్తున్నాను. అయితే ప్రింట్ కున్న పవిత్రత (సేక్రెడ్ నెస్) ఇంకా జాలానికి రాలేదేమోనని నాకనిపించడానికి కారణం రచయితలు స్పందించకపోవడమే. బహుశా ఈ బ్లాగు స్థాయి కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారేమో, నాకు తెలీదు. సరే, ఈ వారం ప్రసిద్ధ కవి, విమర్శకుడు అఫ్సర్ తో చదువు ముచ్చట్లివి. తెలుగు కవి అఫ్సర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈయన అమెరికాలో బోధన సాగిస్తున్నారు. బోధన, పరిశోధన, అధ్యయనంలో పూర్తిగా తలమునకలుగా వున్న అఫ్సర్ సమయాన్ని కేటాయించి ఇంత విపులంగా తన చదువు ముచ్చట్లు చెప్పినందుకు థాంక్స్ తెలుపుకుంటూన్నా. మరి చదవండి…. Read the rest of this entry »

ఇరవై ఏడో వారం చదువు ముచ్చట్లు వసంతలక్ష్మిగారితో…

In చదువు ముచ్చట్లు on మే 15, 2009 at 6:24 పూర్వాహ్నం

ఆదివారం ఆంధ్రజ్యోతి మ్యాగజీన్ ఎడిటర్ గా వసంతగారు పాఠకలోకానికి, పాత్రికేయ ప్రపంచానికి, సాహితీప్రియులకు చిరపరిచితురాలు. ప్రతి వారం ఆమె రాసే ‘సండే కామెంట్’ కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. సాహిత్య, ఉద్యమ కోణాలు, వివిధ సామాజిక అంశాల పట్ల అవగాహన, చురుకయిన విశ్లేషణ ఆమెను ఉదయం పత్రికలో పనిచేయక ముందు నుంచీ భిన్న రంగాల మేధావులకు పరిచయం చేశాయి. పుస్తకాలంటే ప్రేమ, స్నేహమంటే ప్రాణం, నమ్మిన విషయాలకోసం దూసుకుపోయే చొరవ వసంతలక్ష్మిగారిని పత్రికా సంపాదకుల్లో విభిన్నంగా నిలబెడతాయి. ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్ వసంతగారి జీవిత భాగస్వామి. కొన్ని భారతీయ భాషల నుంచి తెలుగులోకి కథలనూ అనువదించిన ఆమె చదువు ముచ్చట్లు ఈవారం… Read the rest of this entry »

ఇరవైఆరో వారం చదువు ముచ్చట్లు కస్తూరి మురళీకృష్ణతో…

In చదువు ముచ్చట్లు on మే 9, 2009 at 5:10 పూర్వాహ్నం

కస్తూరి మురళీకృష్ణగారి రాతలు-కోతలు బ్లాగు పూర్తిగా చదవకముందు ఆయనో కరడుగట్టిన హిందుత్వవాది అని అనుకున్నాను. అప్పటినుంచి ఆయన బ్లాగు చూస్తున్నా చదివేవాడిని కాను. కానీ, ఇంతలో ఆయన ఆంధ్రభూమి వీక్లీలో రాస్తున్న నవలల పరిచయం శీర్షిక చదవడం మొదలుపెట్టాక, మళ్లీ మురళీకృష్ణగారి బ్లాగు చదవడం ఆరంభించాను. కానీ అవన్నీ తీర్చని సందేహాలెన్నో ఈ వారం మీరు చదవబోతున్న చదువు ముచ్చట్లు తీర్చాయి. పుస్తకాలను ప్రిజుడీస్ తో చదవకూడదని నాకు పాఠం చెప్పాయి. అసలింత విరివిగా ఎలా రాయగలుగుతున్నారని తల బద్దలుకొట్టుకుంటున్న నాకు, అసలిన్ని పుస్తకాలు ఎలా చదవగలుగు తున్నారా అని నోరెళ్లబెట్టుకునేలా చేశాయి యీ జవాబులు. మరి మీరూ చదవండి ఈ వారం కస్తూరి మురళీకృష్ణగారి చదువు ముచ్చట్లు…. Read the rest of this entry »

ఇరవై అయిదో వారం చదువు ముచ్చట్లు జయప్రకాష్ తో…

In చదువు ముచ్చట్లు on ఏప్రియల్ 30, 2009 at 5:02 పూర్వాహ్నం

నేను బ్లాగింగ్ మొదలుపెట్టిన తొలిదినాల్లో నాకొచ్చే వందలాది సందేహాలను ఆన్ లైనులో, ఫోనులో తీరుస్తూ… ఇలా చెప్తే వీడికి అర్థంకావట్లేదనుకుని కొణతం దిలీప్ కొన్ని ఫైళ్లు పంపించేవారు. అవన్నీజయప్రకాష్ గారివర్డ్ ప్రెస్ ట్యుటోరియల్ పాఠాలు. అలా జేపీసార్ కు నేను ఏకలవ్య శిష్యుడిని. తర్వాత మీరుచదివారా?లో రాసిన కొన్ని పుస్తక పరిచయ వ్యాసాలను తాను ఎడిట్ చేస్తున్న ‘డిస్కవర్ తెలంగాణ‘లో తిరిగి ప్రచురించడం ద్వారా మరికొంతమంది తెలంగాణ మిత్రులను పరిచయం చేశారు. జేపీ తన సొంత బ్లాగును రాస్తూనే ఫిలిం తెలంగాణ, ప్రాణహిత, పోలేపల్లి, ఫరెవర్ తెలంగాణ సైట్ల ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి…. Read the rest of this entry »

ఇరవై నాలుగో వారం చదువు ముచ్చట్లు టి శ్రీవల్లీ రాధికగారితో…

In చదువు ముచ్చట్లు on ఏప్రియల్ 24, 2009 at 5:16 పూర్వాహ్నం

మహార్ణవం‘ బ్లాగరి టి. శ్రీవల్లీరాధిక కథకురాలు, కవయిత్రి. సున్నితమైన హ్యూమన్ ఎమోషన్స్ను అంతే సుకుమారమైన పదాలతో కవిత్వీకరించడం ఈమె ప్రత్యేకత. దాదాపుగా అన్ని తెలుగు పత్రికల్లోనూ కవితలు రాస్తున్న రాధిక కథ “మై ఫ్రెండ్” పేరుతో అనువాదమై, అమెరికాలో భారత రాయబార కార్యాలయం ప్రచురించే ‘ఇండియన్ రివ్యూ’లో జులై-2008 సంచికలో (p. 18-21) ప్రచురితమైంది. “రేవు చూడని నావ” కవితా సంపుటి “మహార్ణవం”, “ఆలోచన అమృతం” కథాసంకలనాలు ప్రచురించిన  ఈమె చదువు ముచ్చట్లు ఈ వారం వినండి మరి… Read the rest of this entry »

ఇరవైమూడోవారం చదువు ముచ్చట్లు గద్దె ఆనంద్ స్వరూప్తో…

In చదువు ముచ్చట్లు on ఏప్రియల్ 13, 2009 at 10:23 పూర్వాహ్నం

గద్దె ఆనందస్వరూప్ గారిని మొదటిసారి వినడం “ఒక దళారి పశ్చాత్తాపం” పుస్తకంలో దిలీప్ గారు ప్రస్తావించినప్పుడు. తరువాత ఒకరిద్దరు రచయితలు ఆయన ప్రస్తావన తెచ్చినా పెద్దగా వివరాల్లోకి వెళ్లలేదు. అయితే విన్నదాన్నిబట్టి ఆయన అభిరుచి కలిగిన పాఠకులని అర్థమైంది. ఈ వారం చదువు ముచ్చట్లు ఆయనవే. అవి చదివాక మీరు కూడా ఆ మాట ఒప్పుకుంటారు. గణితం పట్ల మక్కువ ఎక్కువ కలిగిన ఆనంద్ స్వరూప్ గారి చదువు ముచ్చట్లు మరిక వినండి… Read the rest of this entry »

ఇరవైరెండో వారం చదువు ముచ్చట్లు మీనాక్షి రెడ్డి మాధవన్ తో…

In చదువు ముచ్చట్లు on ఏప్రియల్ 6, 2009 at 7:38 పూర్వాహ్నం

సాక్షిలో అనుకుంటాను, గీతా రామస్వామి గారు ఇంగ్లిషు నవలలు రెండింటిని కొన్ని నెలల క్రితం పరిచయం చేశారు. వారిలో ఒకరు మీనాక్షి రెడ్డి మాధవన్. యు ఆర్ హియర్ అన్న తొలి నవలతో చక్కటి రచయిత్రి అన్న ముద్ర కూడా సంపాదించారు. అప్పటికే దేశంలో తన బ్లాగుతో ఇంగ్లిష్ బ్లాగులోకంలో గొప్ప పాపులర్ అయిన మీనాక్షితో చదువు ముచ్చట్లు ఈ వారం… Read the rest of this entry »

ఇరవై ఒకటో వారం చదువు ముచ్చట్లు ఫణీంద్రతో…

In చదువు ముచ్చట్లు on మార్చి 30, 2009 at 7:21 పూర్వాహ్నం
మరో చదువు పురుగు ఫణీంద్ర.        చదివిన చదువు ఇచ్చిన వ్యక్తిత్వం నిలబెట్టుకునే ప్రయత్నంలో రకరకాల ఉద్యోగాలు చేస్తూ ప్రస్తుతానికి జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న ఫణి గమ్మత్తయిన చదువరి.                 ఒకరకంగా తెలుగునేలమీద ఇంత అరుదైన చదువు అభిరుచులు వున్నారని మనకు తెలుస్తున్న కొద్దీ చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా వుంది.     మనకు కావలసిందల్లా మంచి మంచి ప్రచురణలే గాని, తప్పక చదివి తీరతాం.        ఈ వారం ఫణీంద్ర చదువు ముచ్చట్లు వినండి మరి… Read the rest of this entry »

ఇరవయ్యోవారం చదువు ముచ్చట్లు నాగరాజుగారితో…

In చదువు ముచ్చట్లు on మార్చి 23, 2009 at 6:13 పూర్వాహ్నం

గతవారం పరుచూరి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూకు వచ్చిన స్పందన అపూర్వం. శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, హైదరాబాదులనుంచి బ్లాగు మిత్రులు ఫోన్లపై అభినందించారు. మరో ఐదుగురు మెయిల్లద్వారా బాగుందని చెప్పారు. ఒక బాగా చదువుకుంటున్న పాఠకుడు తోటి పాఠకుడిని ఎంత ప్రభావితం చేస్తాడో కదా! అలాంటిదే ఈ వారం చదువు ముచ్చట మరోటి మీకు అందించాలి. సాలభంజికలు బ్లాగుతో అందరి మన్నన పొందిన పప్పు నాగరాజుగారు ఎంత విస్తృత అభిరుచులు కలిగిన పాఠకులో ఇది చదివాక మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి పనివత్తిడి వల్ల బ్లాగు రాయడం కుదరక తాత్కాలికంగా క్యాప్ బిగించి కూర్చున్న నాగరాజుగారు పెన్ను క్యాప్ ఎక్కడో పోగొట్టుకోవాలని, ఆయనకు తీరుబడి కుదరాలని కోరుకుంటూ… చదువు ముచ్చట్లలోకి వెళ్లండి. Read the rest of this entry »

పంతొమ్మిదో వారం చదువు ముచ్చట్లు పరుచూరి శ్రీనివాస్ గారితో…

In చదువు ముచ్చట్లు on మార్చి 16, 2009 at 4:48 పూర్వాహ్నం

పరుచూరి శ్రీనివాస్ గారిని నెటిజన్లు నడిచే గ్రంథాలయం అని పిలుస్తారు. ఎందుకట్లా పిలవడం? జస్ట్… మరికొద్ది నిమషాల్లో మీకే తెలుస్తుంది. బ్లాగు రాయకుండా బ్లాగు లోకానికి ఆప్తమిత్రులైన శ్రీనివాస్ గారిని బహుశా ‘అబ్లాగరి’ అని పిలవచ్చేమో. నేనైతే ఈ జవాబులు చదివి మురిసిపోయా. ఎన్ని పుస్తకాలో…. మరెన్ని పుస్తకల సంగతులో… మరి మీరూ ఎంజాయ్ చేయండి…   “మీరు గతంలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులకు మల్లేనే నాకూ చిన్న వయస్సునుండి పుస్తకాలతో అవినావభావ సంబంధం వుంది. పుస్తకాల గురించి, ముఖ్యంగా పుస్తక చరిత్ర (Book History) గురించి చాలా ఆసక్తి వుంది.” అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించిన శ్రీనివాస్ గారి చదువు ముచ్చట్లివిగో… Read the rest of this entry »

పద్దెనిమిదో వారం చదువు ముచ్చట్లు కత్తి మహేష్ కుమార్ తో…

In చదువు ముచ్చట్లు on మార్చి 9, 2009 at 5:56 పూర్వాహ్నం
పర్ణశాల బ్లాగరి కత్తి మహేష్ కుమార్ ను పరిచయం చేసే సాహసం చేయనుగాని, ఇంకొకరు సరదాగా సుత్తి నరేష్ కుమార్ పానశాల పేరుతో బ్లాగు మొదలెట్టారంటే చాలు, మహేష్ ఏ స్థాయిలో చర్చలను రేకెత్తించారో అర్థమవుతుంది. సాహిత్యం, సమాజం, మనసు, మనసులోపలి ముసుగులు ఇలా విభిన్న అంశాలపై తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పగల కత్తిలాంటి బ్లాగరి మహేష్. బ్లాగును సీరియస్ గా తీసుకునే అతికొద్దిమంది బ్లాగరులలో ఒకరైన ఈయన చదువు ముచ్చట్లు ఈ వారం… Read the rest of this entry »

అరవింద్ ఆడిగ తో ఈ వారం చదువు ముచ్చట్లు…

In చదువు ముచ్చట్లు on ఫిబ్రవరి 23, 2009 at 9:02 పూర్వాహ్నం

అవున్నిజమే. తాజా బుకర్ బహుమతి విజేత అరవింద్ ఆడిగతో ఈ వారం చదువు ముచ్చట్లు. ‘అసాసిన్స్…’ ముందే రాసినా, మొదట ప్రచురణ పొందిన నవల “ది వైట్ టైగర్”. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఈ రచనకు మన దేశంలో మాత్రం తిట్లు తప్పలేదు. (ప్రస్తుతం ‘స్లమ్ డాగ్ మిలియనీరు’కు లాగా) జర్నలిజం వృత్తిగా మొదట ఎంచుకున్నా ప్రస్తుతం రచనే ఫుల్ టైం జాబ్ గా ఎంచుకుందామనుకుంటున్నఅరవింద్ ఆడిగ చదువు ముచ్చట్లు వినండి మరి… Read the rest of this entry »

పదహారో వారం చదువు ముచ్చట్లు జ్యోతక్కతో…

In చదువు ముచ్చట్లు on ఫిబ్రవరి 16, 2009 at 4:05 పూర్వాహ్నం

తెలుగు బ్లాగావరణంలో ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని జ్యోతక్కతో ఈ వారం చదువు ముచ్చట్లు. ఆమె గృహిణిగా కర్తవ్యాలు నిర్వహిస్తూనే మరోవైపు దాదాపుగా తెలుగు బ్లాగులన్నీ చదువుతూ వాటి బాగోగులను చర్చిస్తూ, ప్రోత్సహిస్తూ, దాదాపుగా ఒక మోడరేటరుగా వున్నారంటే అతిశయోక్తి కాదు. ఇవేకాక తనపేరుతోనూ, షడ్రచులు పేరుతో మరో బ్లాగునూ నిర్వహిస్తున్నారు. మరి ఆమె చదువు ముచ్చట్లు వినండి… Read the rest of this entry »

పదిహేనో వారం చదువు ముచ్చట్లు యాళ్ల అచ్యుతరామయ్యతో…

In చదువు ముచ్చట్లు on ఫిబ్రవరి 9, 2009 at 7:09 పూర్వాహ్నం

“రేవు” నవలా రచయిత జి.ఎస్. చలం పరిచయం చేసిన మంచి పుస్తకాలలో “ఆమె నవ్వు” కథల సంపుటి ఒకటి. ఆ పుస్తకం చదివి ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రానికి నేను రాసిన వ్యాసం చలానికి అంతగా నచ్చకపోయినా ఆయన మిత్రులు, ఆ కథల పుస్తక రచయిత అయిన యాళ్ల అచ్యుతరామయ్య అనే ఒక మంచి స్నేహితుని పరిచయం చేసింది. హైదరాబాదులోని కాలుష్య నియంత్రణ మండలిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అచ్యుతరామయ్య గొప్ప ప్రగతిశీల దృక్పథమున్న కథకుడు. మరో సంపుటానికి సరిపడా కథలు రాసిన ఆయన నుంచి త్వరలో మరో మంచి కథల పుస్తకాన్ని ఆశించవచ్చు. గొప్ప పాఠకుడు కూడా అయిన అచ్యుతరామయ్యగారితో చదువు ముచ్చట్లు ఈ వారం… Read the rest of this entry »

పద్నాలుగో వారం చదువు ముచ్చట్లు కొత్తపాళితో…

In చదువు ముచ్చట్లు on ఫిబ్రవరి 2, 2009 at 7:17 పూర్వాహ్నం

‘నాసి’ గా సాహితీ మిత్రులకు చిరపరిచితులైన నారాయణ స్వామి బ్లాగు పాఠకులకు మాత్రం కొత్తపాళి గా సుపరిచితులు. ఇదికాక బత్తీబంద్ , విన్నాకన్నా బ్లాగులు కూడా మెయింటెయిన్ చేస్తున్నారు. ఇదికాక “ఈమాట” పత్రికను కూడా నిర్వహిస్తున్న కొత్తపాళి ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. దాదాపుగా అన్ని బ్లాగులూ ఫాలో అవుతూ అందర్నీ ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో సాహితీ, ముఖ్యంగా తెలుగు భాషా పరివ్యాప్తికి కృషి చేస్తున్న కొత్తపాళి చదువు ముచ్చట్లు ఈ వారం మీకోసం… Read the rest of this entry »

పదమూడో వారం చదువు ముచ్చట్లు కెబిఎస్ కృష్ణతో…

In చదువు ముచ్చట్లు on జనవరి 26, 2009 at 7:30 పూర్వాహ్నం

నేను బాల్యంలో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి టెక్కలిలో బాబారావుగారి దగ్గరకు వెళ్లేవాడిని. అంధుడైన, నిరంతరం మంచం మీద వుండే అతనికి ఏం తెలుసని జనం అనుకునేవారు. కానీ అతని మనసొక మహాసాగరమని దగ్గరకు వెళ్లి చూస్తేనే తెలిసేది. (అప్పుడు రోణంకి అప్పలస్వామి మేష్టారి ఎదురింట్లో మా నివాసం) ఇంగ్లిషు భాషా సాహిత్యాల మీద ఆయనది సాధికారత. తరువాత చాలా కాలానికి పరిచయమైన కెబిఎస్ కృష్ణ ఆయన మనుమడే కావడం యాదృచ్ఛికం. కృష్ణ ప్రస్తుతం సీఫెల్ లో సిటీ ఇన్ క్రైంఫిక్షన్ అంశంపై పరిశోధన చేస్తున్నారు. అసాధారణ పాఠకుడైన కృష్ణ చదువును దగ్గరనుంచి చూస్తే ముచ్చట గొలుపుతుంది. ఈ వారం చదువు ముచ్చట్లు ఆయనతోనే. చదవండి మరి… Read the rest of this entry »

పన్నెండో వారం చదివి ముచ్చట్లు పప్పు అరుణగారితో…

In చదువు ముచ్చట్లు on జనవరి 19, 2009 at 6:17 పూర్వాహ్నం

మా శ్రీకాకుళమ్ వాస్తవ్యురాలైన పప్పు అరుణ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా బ్లాగులోకంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్-ఎడిటర్ గా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ తొలికథంటే నమ్మలేనట్టుగా రాసిన ‘ఎవరికి తెలియని కథలివిలే” మీరు చదివారా? ఆమె నిరంతర పఠనమే అంత మంచి రచనాశక్తిని అందించిందేమో! మరిన్ని విలువైన సాహిత్య ప్రయోగాలు ఆమెనుంచి తెలుగు పాఠకలోకం ఆశించవచ్చు. ఈ వారం ఆమె చదువు ముచ్చట్లు వినండి మరి… Read the rest of this entry »

పదకొండో వారం చదువు ముచ్చట్లు నిడదవోలు మాలతిగారితో…

In చదువు ముచ్చట్లు on జనవరి 12, 2009 at 7:06 పూర్వాహ్నం
నిడదవోలు మాలతి అంటే బహుముఖీనరాలైన వ్యక్తి. కథకురాలిగా, అనువాదకురాలిగా, ప్రచురణకర్తగా, బ్లాగరిగా, మంచి స్నేహితురాలిగా, అనేక పార్శ్వాలున్న మాలతిగారు ఇంటర్ నెట్లో తెతూలిక బ్లాగరిగా అందరికీ సుపరిచితులు. ఆ వృద్ధ బాలిక చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి… Read the rest of this entry »

పదో వారం చదువు ముచ్చట్లు చావా కిరణ్ కుమార్తో…

In చదువు ముచ్చట్లు on జనవరి 5, 2009 at 7:14 పూర్వాహ్నం
ఒరెమునా బ్లాగరిగా సుపరిచితులైన చావా కిరణ్ కుమార్ గారు బ్లాగు రాయడం ఆపేసి ‘ఒక అధ్యాయం ముగిసింది’ని స్థిరపరిచారు. ఆయన్ని బ్లాగు రాయడం మొదలుపెట్టమని దీనంగా అర్థిస్తున్న అనేకానేక మంది అభిమానుల్లో నేనూ ఒకడిని. ఈ వారం ఆయన చదువు అలవాట్లు తెలుసుకుందాం. Read the rest of this entry »

తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు దేవరపల్లి రాజేంద్రకుమార్తో…

In చదువు ముచ్చట్లు on డిసెంబరు 29, 2008 at 10:04 పూర్వాహ్నం

నేను బ్లాగావరణంలోకి ప్రవేశించిన తరువాత మొదట పరిచయమైన వ్యక్తి దేవపల్లి రాజేంద్రకుమార్. విశాఖపట్నంలో రిసెర్చ్ చేస్తున్న అతని స్నేహితుని కంప్యూటరులో కొన్ని కొత్త ఉపకరణాలు వేస్తూ చేగొడియాలు తింటూ… బ్లాగు హడావిడికి కాసులు రాలుతాయా.. అని చర్చించుకుంటూ… గడిపిన సాయంత్రం మర్చిపోలేనిది. విశాఖతీరాన… బ్లాగుతో, నవతరంగం నిర్వాహకునిగా.., దాదాపు అన్ని బ్లాగుల్లో సమాధానాలు రాస్తూ… అందరికీ మంచి మిత్రుడైన రాజేంద్రగారితో ఈ వారం చదువు ముచ్చట్లు… Read the rest of this entry »

ఎనిమిదో వారం చదువు ముచ్చట్లు వీవెన్ తో…

In చదువు ముచ్చట్లు on డిసెంబరు 22, 2008 at 1:02 అపరాహ్నం

వీవెన్ గారి గురించి నాలుగు పరిచయ వాక్యాలు రాయాలనుకోవడం దుస్సాహసం. ఒక్కటి చెప్పగలను వీవెన్ లేకపోతే ఇప్పటికి నా బ్లాగు వీక్షకుల సంఖ్య వందలోపే వుండేది. అలాంటి బ్లాగు ప్లాట్ ఫారం ప్రారంభించడమే కాకుండా వీవెనుడి టెక్నిక్ లతో విజ్ఞానవంతులను చేస్తున్న అత్యంత సౌమ్యులు వీవెన్. ఆయన చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి…. Read the rest of this entry »

ఏడోవారం చదువు సంగతులు రెడ్డిశాస్త్రిగారితో…

In చదువు ముచ్చట్లు on డిసెంబరు 15, 2008 at 11:21 పూర్వాహ్నం

తెలుగు సాహిత్య లోకంలో ఎ.వి. రెడ్డిశాస్త్రి తెలియని వారుండరు. ఇంగ్లిషు కథావాతావరణాన్ని తెలుగునేల మీద దించిన అతికొద్దిమంది ప్రతిభావంతులైన తెలుగు కథకుల్లో ఈయన ఒకరు. ఇప్పటిదాకా రెండు (“అసంగత సంగతాలు“, “ఈ మంటలు చల్లారవు“) కథాసంపుటాలు ప్రచురించారు. ఈ వారం ఆయన చదువు ఊసులు మనతో పంచుకుంటున్నారు. రెడ్డిశాస్త్రిగారు నా ప్రశ్నలకు స్పందించి సమాధానాలు పంపినందుకు నేను నిజంగా చాలా సంతోషపడ్దాను. ఏడు పదులు దాటిన వేళ కూడా ఇప్పటికీ రోజుకు కనీసం ఐదు గంటలు చదువుతూ, ఏదో ఒకటి రాసుకుంటూ యువతకు స్ఫూర్తిదాయకంగా సాహితీ కృషి సాగిస్తున్నారు. ఇక చదవండి. Read the rest of this entry »

ఆరోవారం చదువు ముచ్చట్లు కొల్లూరి సోమశంకర్ తో…

In చదువు ముచ్చట్లు on డిసెంబరు 8, 2008 at 4:26 పూర్వాహ్నం

తన గురించి చెప్పుకుంటూ ఎంతో వినయంగా అమెచ్యూర్ అని అన్నా, నిజానికి కథారచనలో, అనువాదంలో దిట్ట అనిపించుకున్న కొల్లూరి సోమశంకర్ తన దైనందిన జీవితంలో ఎంతో బిజీగా వున్నా, సాహిత్యానికి సముచితంగా సమయం కేటాయించడం పాఠకుల అదృష్టం. తనపేరుతోనే బ్లాగును ప్రారంభించి అనతికాలంలోనే బ్లాగు పాఠకుల అభిమానాన్ని పొందిన సోమశంకర్ సీరియస్ గా తన కలాన్ని ఝుళిపించే అతికొద్ది మంది బ్లాగర్లలో ఒకరు. ఈ వారం చదువు ముచ్చట్లు మన సోమశంకర్ గారితో…. Read the rest of this entry »

ఐదోవారం చదువు ముచ్చట్లు పూర్ణిమతో…

In చదువు ముచ్చట్లు on డిసెంబరు 1, 2008 at 6:02 పూర్వాహ్నం

దాదాపుగా ప్రతి బ్లాగునూ చదివి ఎక్కడో ఓ చోట తన కామెంట్ ను రాయడం మాటలు కాదు. అలా కామెంటడమే కాక, ఎంతో సున్నితమైన భావుకతతో తన మదిలోని ఊహలను ఊసులుగా గుదిగుచ్చి తోటి బ్లాగరులకు అందిస్తున్న పూర్ణిమ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పుస్తకాలను, భావాలను ఎంతో అందంగా అక్షరాల మాలగా అల్లి బ్లాగులోకంలో ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నారు. పూర్ణిమ బ్లాగు చదవడమంటే వెన్నెలలో విహరించడమే. ఈ వారం ఆమె చెప్తున్న చదువు ముచ్చట్లు వినండి… Read the rest of this entry »

నాలుగో వారం సౌమ్యగారితో చదువు ముచ్చట్లు…

In చదువు ముచ్చట్లు on నవంబరు 24, 2008 at 5:41 పూర్వాహ్నం

ఇంజనీరింగ్ పూర్తిచేసిన సౌమ్య ప్రస్తుతం ట్రిపుల్ ఐటి (హైదరాబాద్)లో ఎమ్. ఎస్. (రిసెర్చ్) చేస్తున్నారు. తెలుగుపీపుల్ డాట్ కాం లో రచనలు చేయడంద్వారా ఈ వ్యాసంగం మెదలుపెట్టిన సౌమ్య ప్రస్తుతానికి నవతరంగానికి కూడా తన రచనలు అందించి నిండుతనాన్ని ఇస్తున్నారు. 200 పోస్టుల మైలురాయిని దిగ్విజయంగా ఇటీవల దాటిన ఈమె సొంత బ్లాగులో ఇప్పటికి అరలక్షకు పైగా (అతి త్వరలో లక్ష సందర్శకుల రికార్డును సౌమ్య అధిగమించబోతున్నారు) పాఠకులను తన ఇంటిమసీ నిండిన అక్షరాలు, భావాలతో అలరించారు. ఆమె రాసిన ఏ ఒక్క పోస్ట్ చదివినా ఆమె మంచి పాఠకురాలని ఇట్టే తెలిసిపోతుంది. మరి ఈ వారం ఫటాఫట్ అతిథి మాటలు చదవండి… Read the rest of this entry »

మూడో వారం ఫటాఫట్ సుజాతగారితో…

In చదువు ముచ్చట్లు on నవంబరు 17, 2008 at 10:35 పూర్వాహ్నం

మనసులో మాట బ్లాగరిగా సుజాతగారు బ్లాగు పాఠకులందరికీ సుపరిచితులు. వార్త దినపత్రికలో సబ్బు (sub-editor)గా పని చేసి, తర్వాత అస్త్ర సన్యాసం చేసినా, ప్రస్తుతం తన పదునైన కలాన్ని మరోమారు ఝుళిపించి బ్లాగుద్వారా పదిమందితో ఆ హాస్య, వ్యంగ్య వైభవాన్ని పంచుకుంటున్నారు. ఆ బ్లాగును చదవడం మొదలుపెట్టాక ఆమె కుటుంబ సభ్యులంతా మనకు పరిచయమైపోతారు. (ఇదే లక్షణం నామిని కథల్లో వుంటుంది, అంచేత నామిని స్కూలన్న మాట!). సాహిత్యం, సంగీతం ఆమె నేస్తాలు. టీవీని తిడుతూనే చూస్తుంటారు. ఈ వారం పఠనానికి సంబంధించిన ఇంటర్వ్యూ సుజాతగారితో చదవండి. Read the rest of this entry »

ఈ సారి ఫటాఫట్ కొణతం దిలీప్ తో

In చదువు ముచ్చట్లు on నవంబరు 10, 2008 at 3:32 పూర్వాహ్నం

కొణతం దిలీప్ పేరు బ్లాగావరణానికి సుపరిచితం. “ఒక దళారీ పశ్చాత్తాపం” అనువాదకునిగా తెలుగు పాఠకలోకానికి పరిచయం కాకమునుపే యాహూ రచ్చబండలో సాహిత్యంపై సునిశిత విమర్శా చర్చలు సాగించారు. గుండెచప్పుడు బ్లాగరిగా బుద్ధిజీవుల మన్నన పొందారు. పోలేపల్లి బాధితులకు సహానుభూతిగా నిర్వహిస్తున్న పోలేపల్లి బ్లాగు నిర్వాహకుల్లో ఒకరు. తెలుగు పుస్తకం బ్లాగును కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నింటితో పాటు గొప్ప స్నేహశీలి అయిన దిలీప్ యువ పాఠకులతో తన పుస్తక అభిలాషను ఇక్కడ మనతో పంచుకుంటున్నారు. Read the rest of this entry »

మొదటి ఫటాఫట్ దుప్పల రవికుమార్ తో…

In చదువు ముచ్చట్లు on నవంబరు 3, 2008 at 10:16 పూర్వాహ్నం

(దుప్పల రవికుమార్ అంటే ఈ బ్లాగరిగా నేనే. ముందు ఎలాంటి ప్రశ్నలు ఉండాలని ఆలోచించి ఈ ప్రశ్నలు తయారుచేశాను. కేవలం పుస్తక ప్రియులకు కిక్ ఇచ్చేవే ఈ బ్లాగులో ఉంటాయన్న సంగతి మీకు తెలిసిందే. పుస్తక పఠానాభిలాషను రెచ్చగొట్టడానికి, నోరూరించడానికి మరో చిన్న ప్రయత్నమిది. మరిన్ని ప్రశ్నలు, రచయితల, బ్లాగరుల, పాఠకుల మెయిల్ ఐడిలు నాకు  duppalaraviATgmail.com పంపించండి. ఈ శీర్షిక విజయానికి సహకరించండి. ) Read the rest of this entry »