ప్రత్యేక రాష్ట్ర పరిశీలన పాపమేమీ కాదు

సాధారణం

telengana.jpgtelengana.jpgtelengana1.jpgపొరిగింట్లో జామిచెట్టు కొమ్మ మన ఇంట్లోకి వాలిందనుకోండి. ఆ కొమ్మపై పళ్లు మనవా? వాళ్లవా? మనింట్లో జామిచెట్టు కొమ్మ పొరిగింటి పిట్టగోడ మీదుగా వెళ్లిందనుకోండి, అక్కడి పళ్లు మనవా? వాళ్లవా? ఎదురింటి వాళ్ల జామికొమ్మ వాల్ల పక్కింటిలోకి వాలితే ఆ పళ్లు ఎవరివి? చెప్పండి చూద్దాం. మొదటి రెండింటికి జవాబు మనవి. మూడో ప్రశ్నకు జవాబు ఆ రెండిళ్లలో మనకు దగ్గరి వాళ్లు ఎవరైతే వారివి. మన దేశంలో అంతర్ రాష్ట్ర వివాదాలు, నదీ జలాల వినియోగపు వివాదాలు, అంతర్జాతీయ సమంధాలు తదితర విషయాలు తరచిచూస్తే ఈ న్యాయమే కనిపిస్తుంటుంది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యమానికి సైద్ధాంతిక ఊపిరులూదుతున్న కొత్తపల్లి జయశంకర్ వెలువరించిన “తెలంగాణ రాష్ట్రం – ఒక డిమాండ్” పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

పరిచయానికి ముందర రెండు మాటలు. వేర్పాటువాదం వినకూడని, చదవకూడని, ఆలోచించకూడని విషయం కానే కాదు. ఇరవైమందికి పైగా సభ్యులతో అన్యోన్యంగా ఉండే కుటుంబాలనూ, అదే సమయంలో నిరంతరమూ మనస్పర్థలతో గడిపే కుటుంబాలనూ చూస్తున్నాం. వేరుకుంపట్లు పెట్టి వృద్ధి చెందినవారినీ, పతనమైనవారినీ చూశాం. కళింగాంధ్ర వాసులమనో, రాయలసీమ వాసులమనో కాసేపు మరిచి విశాల భారత భావనలో మునిగి ఈ పుస్తకాన్ని చదవగలగాలి. అప్పుడే వివక్ష రూపం బట్టబయలవుతుంది. అటు రాజకీయం, ఇటు వ్యాపార సామ్రాజ్యం ఎవరి చెప్పుచేతల్లో ఉన్నాయో ఆలోచిస్తే తెలంగాణ వెనుకబాటుతనమే కాదు, కళింగాంధ్ర వెనుకబాటుతనమూ (ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వట్టి డొల్లగా ఎలా మారిందో) తెలుస్తుంది. అధికారపు గంతలు కళ్లకు కట్టుకుని నడిచే రాజకీయ రాబందులు ఎలా భారతదేశ పతనానికి దారులు వెతుక్కుంటున్నారో బోధపడుతుంది.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ముందు వెనుకడుగేసిన నెహ్రూ తర్వాత ముందుకు వచ్చినా విశాలాంధ్ర ఏర్పాటులో తుదివరకూ గుంజాటన పడ్డారనేది చారిత్రక సత్యం. పొట్టి శ్రీరాముల ఆత్మ పరిత్యాగం తర్వాత, వి.కె.కృష్ణమీనన్ హితబోధల తర్వాతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దారి సుగమమైంది. ఈ దారిలో మనకు నిర్మించతలపెట్టిన పెద్ద మనుషుల ఒప్పందం, అఖిలపక్ష ఒప్పందం, ఒకటేమిటి అన్నింటి స్పూర్తిని తూట్లు పొడవడమే జరిగింది. తెలంగాణ ప్రాంతానికి ఏ రకంగానైనా చేయూతనిద్దామని తలచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం, ఆరుసూత్రాల పథకం… అన్నీ నీరుగారిపోయాయి.

ముఖ్యంగా నీటి పారుదల రంగంలో విశాల దృష్టి లేకపొవడంవల్ల సంకుచిత దృష్టి ఏర్పరచుకోవడం వల్ల మనకు మనమే చాలా అన్యాయం చేసుకున్నామనిపిస్తోంది. ఆంధ్ర ప్రాంతంలో (దీంతో కళింగాంధ్ర ప్రాంతాన్ని కలపకండి) పలుకుబడి కలిగిన వ్యక్తులు, వాళ్ల భూములున్న కొన్ని జిల్లాలకే అదనపు నీటిని పొందే ప్రయత్నంలో తెలంగాణ రైతాంగానికి జరిపిన ద్రోహం ప్రభుత్వమే వెలువరించిన గణాంకాల సాక్ష్యాలతో జయశంకర్ బయటపెట్టారు. ఇది అది అని కాదు అన్ని రంగాలలో తెలంగాణ వాటాను ఆంధ్రకు తరలించడాన్ని రచయిత వర్ణించిన తీరు మనకు కంట తడిపెట్టిస్తుంది. చెరువులలో పూడికలు తీయక, తెగిపోయిన చెరువు కట్టలను మరమ్మతులు చేయక, చెరువులను ఉద్దేశపూర్వకంగా శిథిలపరచి చిన్నకారు, సన్నకారు రైతులు నిస్సహాయులై తమ భూములను కారుచౌక ధరకు కోస్తా ఆంధ్రానుంచి వచ్చిన సంపన్నులకు అమ్మివేసే పరిస్థితులను కల్పించడం…అంటూ జరిపే వర్ణణ చుస్తే నాకు శ్రీకాకుళం జిల్లా రైతాంగపు ముఖచిత్రం ఎదలో దుఖం తన్నుకొచ్చేలా మెదులుతోంది.

మరే జిల్లాకు లేని రీతిలో పదమూడు నదులు ఈ జిల్లాగుండా పారుతున్నాయి. పెట్టని కోట తూర్పు కనుమలు, విస్తారంగా దొరికే గ్రానైట్, నల్లరాయి నిక్షేపాలు… ఒకటేమిటి అపార వనరులు. కాని మన రైతు పొట్ట చేత పట్టుకుని విశాఖ నుంచి అండమాన్ దీవుల వరకు వలస పోవడం చేత పల్లెలకు పల్లెలే ఖాళీ అయ్యాయి. పొరుగు రాష్ట్రాలవారు ఖనిజ సంపద తరలించుకుపోతుంటే, గోదావరి జిల్లాల వడ్డీ వ్యాపారులు రైతాంగపు, చిన్న వ్యాపారుల రక్తం పీల్చుకుంటున్నారు. మరింత విషాదకరమైన కోణం ఏమిటంటే మన గిరిజన ప్రాంతాల అటవీ ఫలసాయాన్ని వారి శ్రమను మన అధికారులు, మన మైదాన ప్రాంత వాసులే దోచుకోవడం. దోపిడీ ఒక మానవ నైజమైపోయింది.

అందరికీ అర్థమయ్యే చక్కటి ఆంధ్ర తెలుగులో (నా ఉద్దేశం తెలంగాణ మాండలికంలో కాకుండా) వివక్ష బహుముఖ రూపాలను అందంగా చిత్రించారు. కొత్తపల్లి జయశంకర్ విద్యాధికుడైన రచయిత. అరటిపండు ఒలిచిన రీతిలో ఎవరికైనా బోధపడేలా విషయాన్ని వివరించడంలో సఫలమయ్యారు. కనీసం ఒక్క అచ్చు తప్పయినా లేని ఈ పుస్తకంలో రాజోలి బండ మళ్లింపు పథకంలొ మెంట్ గేట్లను బాంబ్లతో పేల్చివేసి ఆ నీటిని తరలించుకుపోతుండే ఇప్పటి పలక పక్ష ఎం.ఎల్.ఏ. (ఈ పుస్తకం మార్చ్ 2004లో వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ అయిఉండాలి) పేరు చెప్పడానికి భయమెందుకు? 1971లో తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమవడం ఒక రాజకీయ ద్రోహం. అలా చెప్పకుండా సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగించిన తెలంగాణ ప్రజలు ‘అలసిపోవడం’ చేత ఉద్యమతీవ్రత కొంత తగ్గిందన్నారు. ఇది పెలుసుమాట. ఉద్యమంలో పాల్గొనే ప్రజలెప్పుడూ అలసిపోరు. విజేతలయ్యేవరకూ ప్రజా ఉద్యమాలు అలుపెరగవు. నాయకులు వారి స్వప్రయోజనాల కోసమే ప్రజలను నిస్తేజం చేయడమో, ఆవేశపరూలను చేయడమో జరుగుతుంటుంది.

తెలంగాణ రణన్నినాదాన్ని స్పష్టంగా వినిపించిన “తెలంగాణ రాష్ట్రం – ఒక డిమాండ్” పుస్తకం మన అన్ని ఇగోల, భ్రమల ముసుగూల్ను పక్కన పెట్తి చదవగలిగితే చాలా ఆలోచనలు రేకెత్తించే పుస్తకం. మరి మీరు చదివారా?

ప్రకటనలు

8 responses »

 1. 1971 LO TELANGANA PRAJA SAMITHI CONGREESS PARTYLO VILINAMAVADAM OKA RAJAKEEYA DROHAM…. KADU… VILINAMAVADAM KADU… AMMUDUBOVADAM… ENTHA DABBU CHETULU MARINDO…. OKKO M.P KI ENTHA VACCHINDO… AMMINAVARIKI ENTA VACCHINDO… CHALA MANDIKI TELUSU

 2. can anyone assure that poor will not get poorer if there are two states. Geographical division is not going to make things happen. Andhra is almost a feudalistic, casteist society where middle class life has changed dramatically. I dont think whether it is one state or two states; the corruption will be same.
  By bringing these type of things;rich have become richer.
  For educated people, hardly it will make a difference. For uneducated and poor the times will get worse.

 3. చక్కని పరిచయం రవి.

  చాలా అరుదుగా జరుగుతుందేమో ఇలా. ఒక ఆంధ్ర ప్రాంత యువకుడు తెలంగాణ ఆకాంక్ష పట్ల ఇంత సహ అనుభూతిని వ్యక్తపరచడం. అటు కళింగాంధ్రదీ, ఇటు తెలంగాణది ఒకే విధమైన నేపధ్యం. వివక్ష, దోపిడీ బాధితులకే వాటిని అర్థం చేసుకోవడం సుళువవుతుందనుకుంటాను. ఈ కాలం యువకులు నీలా Open Mindతో అలోచించాలని నేను కోరుకుంటున్నాను.

 4. బాబోయ్ రవి గారు … మీరు కళింగాంద్ర ఉద్యమం తెచ్చెట్టున్నారండి… మీ వ్యాసం లో పదె పదె కళింగాంద్ర అంటుంటె … అదొరకంగా ఉంది అండి…
  చరిత్ర తీపి జ్ఞాపకం లా ఉండాలి కానీ ఇలా వెరుకుంపటి అయితె ఎలా అండి.

  ఇక పొతే….తెలంగాణ…
  ఎదొ తెలంగాణాని కాలరాయటానికె ఆంద్రాలొ ప్రతి తల్లి బిడ్డని కంటుంది అన్నట్టు చెప్తె ఎలా అండి.

  అంత దుయ్య బడుతున్నారె.. అప్పుడు వువ్వెగసిన తెలంగాణా ఉద్యమం ని నీరుగార్చటానికి ముడుపులు తీసుకున్న ఆ ప్రభుద్దులు తెలంగాణా వాళ్ళా లేక ? ఆంద్ర వాళ్ళ అండి ? మరి అంత పెద్ద ఉద్యమం నీరు గార్చిన ఘనులు …డబ్బు ఆశతొ వాళ్ళ ఆశలు కూల్చిన వారు రాష్రమ్ వస్తె మాత్రమ్ డబ్బు తినరా ఎంటీ ..?
  ప్రజా అభ్యుదయం కొసమ్ చెప్పె మాటలు అనిపించటం లేదు అండి అవి…. మొన్న మొన్నటీ వరకు పదవుల్లొ వ్వున్నవాళ్ళు … ఎంత చేశారు వాళ్ళకొసం… ఆ …

  అస్సలు దీనిమీద పెద్ద వ్యాఖ్యరాశాను … నా అజాగ్రర్త వల్ల విండొ పొయింది తెలుగు typing window ..

 5. బాబోయ్ రవి గారు, చూడబోతే మేర్రు కళింగాంద్ర ఉద్యమం తెచ్చెట్టు ఉన్నారండి … పదే పదే అలా విడదీసి రాసారు ఏంటి అండి.చరిత్ర మనకు ఒక మంచి జ్ఞాపకం అవ్వాలికనీ… ఇప్పటికే కులవర్గ,మతవర్గ, రాజకీయ, సినిమా, రంగాలు అంటూ ఎవరిచుట్టూ వాళ్ళు గీతాలు గీసుకుని ఐకమత్యానికి ఆరని మంటలు పెడుతుంటే మళ్ళి కొత్తగా చరిత్ర మంట పెట్టడం మరీ దారుణం అండి …

  వయసులో విజ్ఞానం లో అన్నిటిలో మీకన్నా చిన్నవాడిని (౨౨ యేఅర్స్ ) కానీ అలా అంటుంటే మీ అనుజుడు చెప్పాడు అన్నట్లు తలుస్తారని ఇలా చెబుతున్నాను …. మిము భాదించిన ఎడల మన్నించగలరు ….. ఇక పొతే పుస్తకానికి వద్దాం …

  మరీ తెలంగాణా ని కాల రాయటం కోసం ఆంధ్రాలో తల్లులు పిల్లల్ని కంటారు అన్నటు ఉంది అండి. అయిన మీరు చెప్పిన పక్కింటి జామచెట్టు కాయలు తినే వాళ్ళు కేవలం ఆంధ్రాలోనే వుంటారా ఏంటి …తెలంగాణా లో మీరే చెప్పే ఆ ముక్కలో రాయలసీమలో ఉండర అండి ?… నిజమే రవి గారు … ప్రత్యేక రాష్ట్ర పరిశీలనా అవసరమే కానీ నిప్పు ఎర్రగా ఉంది నాకు కావాలి అని ఎడ్చినంతమాత్రాన పిల్లల్ని నిప్పు పట్టుకోనిస్తామా ?. మీరు చెప్పండి అక్కడ ఉద్యమ నేతల్లో ఎంతమంది నేతలు తమ ట్రాక్ రికార్డు క్లియర్ గా వున్నవాళ్ళు వున్నారు… పోనే …అందరూ తీసేసేయ్యండి పింక్ పార్టి నాదుడు పదవి దక్కలేదని తెలంగాణా ఉద్యమాన్ని నిద్రలేపాడు అని తెలుసు కదండీ.. అలాంటి అవకాస వాదులకా అండి ఇచేది రాష్ట్రం, ….

  మీరు ఒక్కసారి నా బ్లాగ్ చూడండి http://www.bhuvanavijayam.wordpress.com ఇందులో అసలు దొంగ గురించి ఎవరు మాట్లాడరెంటి చెప్మా అని ఒక కధనం వుంటుంది ఆ పుస్తకానికి నా సమాధానం లాంటిది …

 6. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » మార్చి పోస్టుల మార్చిపాస్టు

 7. పింగుబ్యాకు: ఇవీ తల్లీ నిరుడు కురిసిన పరిచయ వ్యాసమ్ములు! « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s