అన్ని ఉద్యమాలు మనిషిగా బతకడానికే

సాధారణం

rights01చాలా రోజుల కిందట మానవ హక్కుల వేదిక తన ఏడవ బులెటినును ప్రచురించింది. మళ్లీ ఆ విలువైన ఆ పుస్తకాన్ని ఒక మీటింగ్ కోసం రెండు వారాల కిందట చదివాను. ఆ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను. పుస్తకం పేరు మానవ హక్కులు – 2005 (7వ బులెటిన్). మరి చదవండి.

ఇది నా హక్కని ఒకరు మరొకరితో అంటే అక్కడ నీకంటే నేనేమీ తక్కువ కాననే ధ్వని తప్పనిసరిగా ఉంటుంది. హక్కుల భావనలో సమాన భావన ఇమిడి ఉంటుంది. మన నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థలో కిందనుండే వాడు సమానత్వం కోసం దేబరించడమూ, పైనుండే వాడు సమానత్వ స్పృహ ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ గంగవెర్రులెత్తిపోవడమూ మామూలే. హక్కు అంటే ఒక్కమాటలో చెప్పాలంటే మనిషికి మనిషిగా విలువనివ్వడం. హక్కుల కోసం పోరాడుతూ ఉద్యమాల్లో పనిచేసేవారు సాధారణంగా రాజ్యం లేదా రాజ్య యంత్రాంగం కల్పించే అవరోధాలను, అడ్డంకులను, దాడులను, హత్యాప్రయత్నాలను ఎదుర్కొని, ఎదుర్కొనీ విసిగిపోతుంటారు. అయితే హక్కుల పోరాటానికి బాట ఇప్పుడు ఎవరో తాజాగా వేస్తున్నది కాదు. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఈ రహదారి సిద్ధమైంది. అటు గ్రీసు దేశంలో సోక్రటీసు వేదాంతాన్ని విశ్లేషిస్తూ విషం స్వీకరిస్తున్న వేళ, ఇటు చైనాలో కన్ ఫ్యూషియస్ లౌకిక పరిమళాలు వెదజల్లుతున్న వేళ, అప్పటికే ప్రబలిన అసమ వర్ణ ధర్మాన్ని నిరసిస్తూ భారతదేశంలో గౌతమ బుద్ధుడు గళం విప్పాడు. వర్ణ వివక్షను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏ కులపువారైనా భిక్షకులు కావచ్చని చెప్తూ సమాన భావనకు భువిపై తెరలేపాడు. అంతెత్తు లేచిన బౌద్ధ తరంగాన్ని సైతం మన వర్ణ ధర్మం తూట్లు పొడిచింది. (ఈ క్రమంలోనే పాశ్చాత్యంలో చర్చి, రాజరికంతో మిలాఖత్ అవ్వడాన్ని జోన్ ఆఫ్ ఆర్క్ సినిమాలో చూస్తాం). కౌటిల్యుడు, మనువుల రాకతో బుద్ధుడు ఎగవేసిన మంటలు చల్లారిపోయాయి. ఆ తరువాత భారతం, భగవద్గీత, ముఖ్యంగా రామాయణం వర్ణ ధర్మం అవిచ్చిన్నమయేలా చూసాయి.

మళ్లీ క్రీ.శ. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు శైవమతంతో సమానతా విలువలకు పట్టం కట్టడానికి ప్రయత్నించాడు. ముస్లిం పాలనలో 12-13 శతాబ్దాలలో అమిర్ ఖుస్రోతో మొదలైన సూఫీ ఉద్యమం, 15-17 శతాబ్దాలలో కొనసాగిన భక్తి ఉద్యమం ప్రజలలో ఎంతగానో హక్కుల స్పృహను పెంచడానికి తోడ్పడ్డాయి. కబీర్, మీరా, రవిదాస్, తుకారాములు మానవ హక్కుల భావనకు ఒక రూపు తీసుకొచ్చినవారు. దేశంలో ప్రబలిన అన్ని రుగ్మతలమీదా విభిన్న వేదికలపై పోరాటం 19వ శతాశతాబ్దంలో ప్రారభమైందనాలి. జ్యోతీరావు ఫులె, రాయ్, తిలక్, గాంధీ, అంబేడ్కరులు సలిపిన విశిష్ట కృషి చిరస్మరణీయం. దీనికి కొనసాగింపుగా 1936లో నెహ్రూ భారత పౌర హక్కుల సంఘం (ఐసిఎల్ యు) స్థాపించారు. దురదృష్టవశాత్తూ స్వతంత్ర భారతంలో పరిస్థితులు భిన్నంగా పరిణమించాయి. మనిషిగా పుట్టినందుకు మనిషికి ఉండాల్సిన కనీస హక్కులనే రాజ్యం నిరోధించి, నిరాకరించి, నిర్మూలించ చూస్తోంది. అభివృద్ధి మోసుకొచ్చిన పేదరికం, అసమానతలు, అవమానాలు, అన్యాయాలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, నిరాధారత, పర్యావరణ విపరిణామాలు హక్కుల అనుభవానికి నిరోధకాలవుతున్నాయి.

rights02ఈ నేపథ్యంలో హక్కుల స్పృహ ప్రజల్లో విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ అవసరాన్ని తీర్చడంలో ఏటేటా మానవ హక్కుల వేదిక ప్రచురిస్తోన్న బులెటిన్లు చాలా సహకరిస్తాయి. ఏడో బులెటిన్లలో ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. అసలు పంచడానికి భూమి ఎక్కదుందన్న ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల తర్వాత జనవరి 26, 2005 నాడు 1.55 లక్షల ఎకరాలకు పట్టాలిస్తూనే, ఆగస్టు 15 నాడు మరో లక్ష ఎకరాలు పంచింది. ఈ భూమంతా ఎక్కడిది? అసలు మనకున్న భూమెంత? ఎలా పంచుతున్నాం? మొదలైన వివరాలు ‘ప్రజాభూమి కమిషన్ ‘వ్యాసంలో చదవొచ్చు. గడచిన అర్థ శతాబ్దిలో కమ్యూనిస్ట్ చైనా కేవలం 43 శాతపు సాగు భూమినే పేదలకు పంచితే, సంస్కరణల బాట పట్టిన జపాన్ 33 శాతం భూమిని ప్రజలకు పంచిందని తెలిసినప్పుడు ఓస్, ఇంతేనా అనిపిస్తుంది. కానీ మనదేశంలో కేవలం 1.5శాతం భూమి మాత్రమే పేదలకు పంపిణీ జరిగిందనేది నమ్మలేని నిజం. ఇలా పోల్చితేనే మనం చేయాల్సింది ఎంతో ఉందికదా అనిపిస్తుంది.

జన్యు విత్తనాల వల్ల ఇబ్బందులు, గిర్ గ్లాని కమిషన్, ఆదివాసీ స్త్రీల హక్కులు, ఆకలి చావులు, ఎస్సీ వర్గీకరణలపై చక్కటి విశ్లేషణాత్మక వ్యాసాలున్నాయి. ఇటీవల సయ్యద్ నశీర్ అహమ్మద్ భారతీయ ముస్లిములు దేశ స్వతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర నిర్వహించారో వివరిస్తూ వరసగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఆ గ్రంథాలపై సమీక్షా వ్యాసం కూడా ఈ బులెటిన్లో చదవొచ్చు. సమస్య ఉన్న చోటుకు మానవ హక్కుల వేదిక కార్యకర్తలు నేరుగాపోయి, పరిశీలించి, అధ్యనం చేసి అందించిన రిపోర్టులే గాక ఆయా అంశాలపై ప్రజలను చైతన్యపరుస్తూ ఏడాది మొత్తంలో పంపిణీ చేసిన కరపత్రాలు కూడా ఇందులో చేర్చారు. చాలా సీరియస్ గా సాగే ఈ కరపత్రాలలో బాలక్రిష్ణ కాల్పుల కేసు గొప్ప వ్యంగ్యాస్త్రం.

హక్కుల ఉద్యమాల పట్ల అనురక్తి ఉన్న పాఠకులు చదవాల్సిన మంచి పుస్తకం.

ప్రకటనలు

5 responses »

  1. hakkula udyamaalu antu, adavulalo unde tribals nu exploit cheyakudadu. praja udyamaalu santhi yuthanga enduku nirmincha kudadu? champukuntua poyi na china ippudu emi chesthundi? indian communists baaga sampadisthu enjoy chesthunnaru, russia lo ade jarigindi, china lo ade jarugu thunnadi, maanava hakkulu ante maanavu la andari hakkulu ani ardham kaadaa?

  2. పింగుబ్యాకు: ఇవీ తల్లీ నిరుడు కురిసిన పరిచయ వ్యాసమ్ములు! « మీరు చదివారా?

  3. ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, … మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని . ఋషులూ తెలుసుకున్నారు అయితే, ‘నిజమైన ఆనందాన్ని’ మనిషి ఎందుకు తెలుసుకోలేక పోతున్నాడు? ఎందుకు ఎక్కువుగా దుఃఖ పడుతున్నాడు? అన్న ప్రశ్నలకు, నాకు తోచిన సమాధానాల్ని మీతోకూడా చెప్పాలనుకున్నాను. ఆలకించండి:- అందులోని సారాన్ని గ్రహించగలిగితే, నిజమైన నిత్యానందానికి హద్దేలేదు. తను పొందేదీ, పొందినది, అనుభవించేది తన పరిధిలో, తన పరిమితిలో, తనకు లభించినదాంట్లో కొంత తన తోటివారికి పంచగలిగే ఏ సంపద అయినా తనకు ప్రకృతి లేదా ఈశ్వరుడు ఇచ్చిందేనన్న భావన కలిగినప్పుడు, మనిషికి నిత్యానందమే కలుగుతుంది. దీనినే “ ఈశ్వరీయం ” అంటారు. సృష్టి అంతా “విశ్వచైతన్యశక్తి”చే ఆవిష్కరింపబడింది. చైతన్యశక్తి కంటికి కనపడనది. కానీ, ఇది భౌతికరూపంలోకూడా, అనేక విధాలుగా కనిపిస్తుంది. దీనినే ప్రకృతి అని అంటారు. చైతన్యశక్తి, ప్రకృతి రూపంలో, అనేక సంపదలను సృష్టిస్తుంది. ఉదాహరణకు: చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు, భూమి, నీరు, సూర్య, చంద్రులు మొదలైనవెన్నో. ఈ సంపదలను, తన ఇష్టానుసారంగా వాడుకొని, మనిషి, ప్రకృతి వినాశకానికి కారణమవుతూ, తన నాశనాన్నికూడా కొనితెచ్చుకుంటున్నాడు. మనిషి మినహ, మిగిలిన చర ప్రాణులు, అంటే, పక్షులు, జంతువులు ప్రకృతిలోని సంపదలను పరిమితంగానే వాడుకుంటాయి. అచరములైన చెట్ట్లు, చేమలు, కొండలు, ప్రకృతి సంపదలను విఛ్చిన్నం కాకుండా కాపాడుతుంటాయి. ఒక్క మనిషి విషయానికి వచ్చేసరికి, మనిషి, ప్రకృతిలో కనిపించే ప్రతి సంపదను తన స్వార్ధానికి బలితీసుకుంటూనే వుంటాడు.

  4. ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?పూర్వ జన్మ లలోని కర్మ వలన.కర్మ ఎందుకు జరుగుతుంది?రాగం (కోరిక) వలన.రాగాదులు ఎందుకు కలుగుతాయి?అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.అభిమానం ఎందుకు కలుగుతుంది?అవివేకం వలన.. కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయిమానవులు ఆత్మ చింతనతో మానవజీవిత పరమ గమ్యమైన పరమేశ్వర సాన్నిధ్యాన్ని చేరుకోవాలని అనేకమైన సాధనలు చేస్తూ ఉంటారు. సంపద ఉన్నవాడు, సాగుబాటు ఉన్నవాడు, అవకాశం కూడా కలిసి వస్తే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త క్షేత్రాలను, తీర్ఠాలను సేవించి వస్తాడు. అనేకమైన పవిత్రనదులలో స్నానాలు చేసి వస్తాడు. ఒకడు ముక్కు పట్టుకొని నియమంగా సంధ్యవారుస్తాడు. ఒకడు ఒడుపుగా జపమాల త్రిప్పుతాడు. ఒకడు వేదాలను పుక్కిట పట్టి పదాలను విఱిచిమరీ విశేషార్థాలు చెప్తాడు. మరొకడు శ్రేష్ఠమైన యజ్ఞయాగాలు చేస్తాడు. ఒకడు ఉదార బుద్ధితో లక్షల, కోట్ల రూపాయలు దానం చేస్తాడు. ఒకడు పరమ నిష్ఠతో ఆచార వ్యవహారాలు పాటిస్తాడు. నిజానికి ఈ పనులన్నీ కూడా గొప్పవే. అయితే – వీటన్నిటికంటే ముఖ్యమైనది మనస్సును ఎటూ చెదరిపోనీయకుండా పరమేశ్వర పాదపద్మాలయందు మాత్రమే నిలుపగలగటం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s