నవ్వు – నవ్వించు – కాని, …

సాధారణం

హాస్యం మానవ జీవితానికి అనేక విధాలా శోభనిస్తుంది. చిరునవ్వుతో ముఖంలోని దాదాపు నూటా ఏభై కండరాలు కదిలించగలమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎదుటివారి మాటలకు, చేతలకు, మనమాడే పలుకులకు, మనకే తోచే భావనలకు ఎందుకు నవ్వు వస్తుందో ఇంకా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. రేడియో తరంగాలు మన చుట్టూ ఉన్నప్పటికీ మనకు కనిపించట్లేదన్న ఏకైక కారణంతో రేడియో తరంగాల ఉనికిని ఎలా కాదనలేమో, హ్యూమరసం శరీరంలో ప్రయాణించే తీరును  శాస్త్రవేత్తలు గుర్తించకపోయినంత మాత్రాన మనం నవ్వకుండా ఉండలేం. నవ్వొస్తే నవ్వి తీరాల్సిందే.

ప్రస్తుతమున్న మన అకడమిక్ విద్యా ప్రాంగణంలో, కార్పొరేట్ ఉద్యోగ ప్రాంగణంలో మనమంతా అనుభవిస్తున్న ఒత్తిడి మనమెరిగిందే. ఈ ఒత్తిడిని దూరం చేయగల ఏకైక మందు హాస్యం. ఇది ఒకటి కొంటే ఫ్రీగా వచ్చే మరో సరుకు కాదు. డిస్కౌంట్ ప్రైస్ అసలే లేదు. ఎలాంటి ఆఫర్లు లేకుండా పూర్తి ఉచితంగా మనకు మనమే పొందగల ఈ మందు జీవితంలో నూతనోత్తేజం ఇవ్వగలదంటే మీరు నమ్మాలి. మనకు మనమే పొందడం కాకుండా మన చుట్టూ దట్టమైన చిరునవ్వులు వెదజల్లించ గలుగుతూ వాతావరణాన్నంతా మార్చివేయగల గొప్ప హీ-మేన్లం కావాలంటే హాస్యం విలువ మరింత మనం తెలుసుకోవలసిందే.

మనమన్న ఒక్కమాట, మనం ప్రదర్శించే ఒక్క చేష్ట హృదయంలోకో, మనసులోకో, బుద్ధిలోకో, లేదా మరో చోటుకో చేరి మనలో నవ్వుల పువ్వులు పూయిస్తే ముఖం అందంతో ఇంపుగా కనిపించడమొక్కటే ప్రజలు బాహ్యంగా చూసేది. కాని లోపల్లోపల అనేక మార్పులు యాదృచ్చికంగా జరిగిపోతాయి. నవ్వు ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసు మల్లెపూవవుతుంది. దానితో గుండెనిండా గాలి పీల్చుకుంటాం. మెదడుకు కావల్సినంత ఆక్సిజన్ చేరుతుంది. అందువల్లనే సమస్యలను కొండంత ధైర్యంతో ఢీకొనగలుగుతాం. అడ్రినలిన్ ప్రమేయం లేకుండా సమస్యను సమస్యనుంచి కాకుండా సమస్యవెలుపలికి వచ్చి చూడగలగడం వల్ల విభిన్న కోణాలలో సమస్యా పరిష్కారాలు స్ఫురిస్తాయి. అంతే. దానికి ఎడ్వర్డ్ డీ బానో లాంటి పెద్దలంతా “లేటరల్ థింకింగ్” అని పేరు పెడతారు. నేను మాత్రం దానిని హ్యూమర్ ఎఫెక్ట్ అనే అంటాను.

ఒక్క మాట చెప్పి ఆపేస్తాను.

నవ్వు – నవ్వించు – కాని, నవ్వులపాలు కాకు.”

ప్రకటనలు

One response »

  1. బాగు బాగు.. ఎదో చెప్పినట్లు.. నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. కానీ నవ్వలేక పోవడం ఒక రోగం..

    అన్నింటికీ మించి .. మీ ఆఖరి విషయం బహు బాగుంది. “.. నవ్వులు పాలు కాకు”, ఇలాగే తలచుకుంటూ ఎక్కువమంది ముందు చెప్పిన రెండు పనులను చెయ్యడం మానేసారు.. అదేనండీ.. నవ్వడం .. నవ్వించడం

    ఆఖరుగా.. ఫాంటుని ఇటాలిక్ తీసేయ్యండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s