ఈ సారి ఫటాఫట్ కొణతం దిలీప్ తో

సాధారణం

కొణతం దిలీప్ పేరు బ్లాగావరణానికి సుపరిచితం. “ఒక దళారీ పశ్చాత్తాపం” అనువాదకునిగా తెలుగు పాఠకలోకానికి పరిచయం కాకమునుపే యాహూ రచ్చబండలో సాహిత్యంపై సునిశిత విమర్శా చర్చలు సాగించారు. గుండెచప్పుడు బ్లాగరిగా బుద్ధిజీవుల మన్నన పొందారు. పోలేపల్లి బాధితులకు సహానుభూతిగా నిర్వహిస్తున్న పోలేపల్లి బ్లాగు నిర్వాహకుల్లో ఒకరు. తెలుగు పుస్తకం బ్లాగును కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నింటితో పాటు గొప్ప స్నేహశీలి అయిన దిలీప్ యువ పాఠకులతో తన పుస్తక అభిలాషను ఇక్కడ మనతో పంచుకుంటున్నారు.

మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

 • పుస్తకాల విషయంలో కానీ, సినిమాల విషయంలో కానీ నేను పెద్దగా ప్రయోగాలు చేయను. అంటే ఎవరో మిత్రులు చదివి బాగుందన్న పుస్తకాలో లేకపోతే ఫలనా వాళ్లు రాస్తే తప్పకుండా చదవొచ్చు అనుకున్న పుస్తకాలే చదువుతాను. కాబట్టి ఎందుకు చదివానురా! అనిపించే పుస్తకాలు ఇంకా తగలలేదు నాకు.

ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

 • White Tiger. నిన్ననే కొన్నాను. ఇంకా చదవడం పూర్తి కాలేదు

మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

 • ఈ విషయంలో నేను మీ కన్నా వెనకే ఉన్నాను!

చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

 • పాల్ ఖొయిలో రాసిన ఆల్కెమిస్ట్, దాని తెలుగు అనువాదం – పరుసవేది

మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి. 

నచ్చిన ఇటీవలి కథా రచయితలు:

– సుంకోజి దేవేంద్రా చారి (అన్నం గుడ్డ)

– స.వెం రమేశ్ (ప్రళయ కావేరి కథలు)

– ఖదీర్ బాబు (దర్గా మిట్ట కథలు)

కథ సిరీస్ (కథా సాహితి) లో వచ్చిన ప్రతి పుస్తకమూ ఒక ఆణిముత్యమే.

నచ్చిన అనువాదాలు:

– ఏడు తరాలు – సహవాసి 

– చీకటి పాట & రైలు బడి -ఎన్. వేణు గోపాల్

నచ్చిన రాజకీయార్థిక రచనలు:

– అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్ – ఎన్. వేణు గోపాల్

– మనకు తెలియని మన చరిత్ర

(నేను కవిత్వం పెద్దగా చదవను )

మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

 • స్నేహితులకు, బంధువులకు కలిపి 5 పుస్తకాలు బహుమతిగా ఇచ్చాను. నాకు వచ్చినవి 4 పుస్తకాలు.  

ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

 • ఇప్పుడున్న తెలుగు పత్రికలు ఏవీ నాకు పెద్దగా నచ్చవు.

జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

 • వి. చంద్రశేఖరరావు రాసిన అయిదు హంసలు నవల. అసలు చైతన్య స్రవంతి రచనా పద్ధతి పైనే నాకెందుకో సదభిప్రాయం లేదు. బహుశా ఆ పుస్తకాలు చదివి అర్థం చేసుకునేంతగా నేను పరిణతి చెందలేదేమో.

ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

 • From Autocracy to Integration By Lucien D. Benichou
ప్రకటనలు

6 responses »

 1. ఓవర్ త్రో అనే పుస్తకం అనువాదం త్వరలో అన్నారు. అని చాలా నెలలవుతోంది. మరా కొత్త పుస్తకం ఎప్పుడు? మళ్లీ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూపేదెప్పుడు దిలీప్ గారూ?

 2. ప్రియ మిత్రమా
  నేను రాసిన పుస్తకాన్నే మిమ్మల్ని చదవమని చెప్పడం కొంత మొహమాటంగా ఉన్నా చెబుతున్నాను.
  టైటిల్: ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  దాని సంగ్రహము నా పేరు లింకులో ఉంది.

  నాకు బాగా నచ్చిన పుస్తకము: చెంఘీజ్ ఖాన్

 3. good effort.
  One suggestion .. ఇలా పద్దు లెక్కన పుస్తకాలు పేర్లు ఏకరువు పెట్టడం కాకుండా .. ఏవో కొద్ది పుస్తకాల మీద (మంచికో చెడుకో) కొద్దిగానైనా లోతైన ఆలోచన పంచుకుంటే చదివేవారికి ఉపయోగంగా ఉంటుంది.

 4. నేను కూడా “ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకం చదివాను. చాల బాగా రాసారు. ఇప్పటికి ఒక నాలుగు సార్లు చదివుంటాను. అంత బాగా నచ్చింది.
  మరో ఇద్దరు మిత్రులకు బహుమతి గ కొని ఇచ్చాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s