మూడో వారం ఫటాఫట్ సుజాతగారితో…

సాధారణం

మనసులో మాట బ్లాగరిగా సుజాతగారు బ్లాగు పాఠకులందరికీ సుపరిచితులు. వార్త దినపత్రికలో సబ్బు (sub-editor)గా పని చేసి, తర్వాత అస్త్ర సన్యాసం చేసినా, ప్రస్తుతం తన పదునైన కలాన్ని మరోమారు ఝుళిపించి బ్లాగుద్వారా పదిమందితో ఆ హాస్య, వ్యంగ్య వైభవాన్ని పంచుకుంటున్నారు. ఆ బ్లాగును చదవడం మొదలుపెట్టాక ఆమె కుటుంబ సభ్యులంతా మనకు పరిచయమైపోతారు. (ఇదే లక్షణం నామిని కథల్లో వుంటుంది, అంచేత నామిని స్కూలన్న మాట!). సాహిత్యం, సంగీతం ఆమె నేస్తాలు. టీవీని తిడుతూనే చూస్తుంటారు. ఈ వారం పఠనానికి సంబంధించిన ఇంటర్వ్యూ సుజాతగారితో చదవండి.

మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
రుగ్వేద ఆర్యులు-రచయిత రాహుల్ సాంకృత్యాయన్

ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇన్ క్రెడిబుల్ గాడెస్-రచయిత డాక్టర్ కేశవ రెడ్డి గారు

మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

వెయ్యికి తక్కువే అనుకుంటా(ఈ మాత్రం దానికి ఎవరూ దిష్టి పెట్టరు లెండి)

చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

రక్తాశ్రువులు, ఎమిల్ జోలా రాసిన The earth కి సహవాసి గారి అనువాదం “భూమి”. ఈ రెండూ ఇక దొరికే చాన్స్ లేదని తెలిసిపోయింది.

మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

రంగనాయకమ్మ – (దాదాపు అన్నీ) ,నామిని-(అన్నీ) , కేశవరెడ్డి-(అతడు అడవిని జయించాడు, మునెమ్మ), డాక్టర్  శ్రీదేవి-(కాలాతీత వ్యక్తులు).

మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

నేను 3 పుస్తకాలను స్నేహితులకు బహుమతి గా ఇచ్చాను. నాకొక్క పుస్తకమూ బహుమతి గా రాలేదు.

ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

పత్రికలూ ఏవీ నచ్చకపోవడం వల్ల చదవడం లేదు. 

జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

జనం ఎంతో సీనిచ్చినా నాకు నచ్చని పుస్తకం “తిలక్ కథలు”.

ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ప్రస్తుతం చదువుతున్న పుస్తకం..”అతడు-ఆమె” డాక్టర్ ఉప్పల లక్ష్మణ రావు గారి రచన. మరియు, అనంతమూర్తి గారి “సంస్కార” కన్నడ నవలకు అనువాదం(పదో సారి) .

ప్రకటనలు

8 responses »

  1. @చైపా, నెనర్లు.

    @భాస్కర్, మీరు మరీనూ, ఇందులోనూ ప్రాంతీయాభిమనమేనా?, సుజాతగారి రచనలు అందరివీనూ!

    @కృష్ణ, మహేష్ గార్లకు నెనర్లు. సుజాతగారు పెద్ద జవాబులు రాస్తారని నేనూ ఆశించాను. కాని, ఆమె కట్టె..కొట్టె..కు పరిమితమయ్యారు. కానీ చాలా విలువైన పుస్తకాల పేర్లే చెప్పారు కదా.

  2. మనసు బ్లాగరి సుజాతకు పుస్తకాలు అంటే ఆసక్తి అనే విషయం ఆశ్చర్యం కలిగించదు. పుస్తకాలు చదివే సమయముందంటే ఆశ్చర్యమే.

  3. సుజాత గారు,
    మీరు అయాన్ రాండ్ ఫాన్ అని, ఆమె పుస్తకాలు బాగా చదువుతారని తెలిసింది. ఆమె గురించి చెప్పలేదేం ఇక్కడ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s