మట్టివాసనకు ఆనవాళ్లు నామిని కథలు

సాధారణం

naminiబాల్యంలో ఎంతో శ్రమించి అధోజగత్తు సహోదరులతో సహజీవనం గావించి అనంత జీవిత పరమపద సోపానపటంలో గబగబా నిచ్చెన మెట్లెక్కి సుఖపడేవారు కొందరుంటారు. వారిలో కొందరు ఆనాటి తమ బాల్యపు మధుర స్మృతులను సాహితీ రూపాలలో రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియనే డయాస్పోరా లేదా నోస్టాల్జియా సాహిత్యం అని పిలుస్తున్నాం. డయాస్పోరా సాహిత్యంలో ఆఫ్ బీట్ సాహిత్యమనదగ్గ గొప్ప కథలను రాసింది నామిని సుబ్రమన్యం నాయుడు. ఆ శైలీ శిల్పాలతో ఏకంగా నామిని స్కూలు ఒరవడినే ప్రారంభమైంది. ఆయన రాసిన “మిట్టూరోడి కతలు” పుస్తకాన్ని ఈ వ్యాసం పరిచయం చేస్తుంది.

చిత్తూరు జిల్లాలో తిరుపతికి దగ్గరగా వున్న మిట్టూరు అనే కుగ్రామంలో – ఈ ప్రపంచంలో గల లక్షలాది గ్రామాల మాదిరిగానే – జీవితాలు గడుస్తున్నాయి. గ్రామీణ భారతపు జీవితం మందకొడిగా, కనాకష్టంగా, శ్రమతో, సంతృప్తితో నాగరకత, సంస్కృతులను మోసుకుంటూ పోతుంటుంది. అలాంటి గ్రామ జీవితాన్ని నామిని అక్షరబద్దం చేయడంతో తెలుగు కథా సాహిత్య చరిత్రలో ఓ కొత్త విభాగానికి తెర తీసినట్టయ్యింది. నామిని అత్యంత గడుసుదనంతో, సాహితీ విలువలకు ఎక్కడా లోటురాకుండా, పూర్తిగా నేలమీద నడుస్తూ (గాలిలో సాముగారడీలు చేయకుండా), అటు మాండలికంలోనూ, ఇటు కథల వస్తువుల ఎంపికలోనూ, హాస్యం ఏరులై పారుతూవుంటే, చిక్కటి జీవితపు వాసనతో కథలన్నీ చెప్పడం విశేషం.

ఈ కథలన్నీ రాశాక బొమ్మలు, ముఖచిత్రం గీయమని ప్రముఖ చిత్రకారుడు బాపు వద్దకు పంపిస్తే ఆయన ఇలా స్పందించారు. “రోజూ చూసే బతుకులో మీకు ఇంతటి అందం, చమత్కారం కనబడుతోందంటే అది దేవుడిచ్చిన వరం. మీరు ఎంత సాధారణ విషయమైనా అసాధారణంగా రాస్తారని తెలుసు” అంటూ తెగ పొగిడేస్తారు. నామిని ఊర్లో అతడి ఇంటి చుట్టుపక్కల వున్న అమ్మలక్కలు, అయ్యవార్లు జీవితసారమంతా బోధిస్తుంటారు వివిధ సందర్భాలలో. ఆ సందర్భాలే ఈ చిన్న చిన్న కతలు. అంతేకాదు. అక్కడక్కడా తల్లులు పిల్లలకు, మరికొన్ని చోట్ల పిల్లలు తల్లులకు, మొత్తంగా ప్రతిచోటా వారంతా కలిసి మనకు పాఠాలు నేర్పిస్తూనే వుంటారు. పోరంకి దక్షిణామూర్తి గారన్నట్టు ప్రతి పదిహేను ఇరవై కిలోమీటర్లకు భాషలో మాండలికాలు మారిపోతుంటాయి. అయినా తెలుగు తెలుగే. చిత్తూరి జిల్లా మిట్టూరి ప్రాంతపు భాష చదవడానికి మనకే మాత్రం ఇబ్బంది కలిగించదు.

ఇరవై రూపాయల అప్పుకని తల్లి దగ్గరకి సొంత కూతురుపోతే, అన్ని మాటలు పడుతుందే కాని కూతురికి అప్పివ్వని తల్లి, మనవరాలికి వెండిగొలుసులు కొనడానికి బయల్దేరడం బతుకు తమాషా. కూతురికి పాఠం చెప్పడమే ‘బతుకుగోరే తల్లి‘ పరమోద్దేశం. నామిని వాకిట్లో చింత చెట్టుంది. అదే ఆ వీధి ఆడవారికి మీటింగ్ ప్లేస్. ఏ కూడల్లోనైనా లేని వ్యక్తి గురించి అక్కడ సమావేశమైన వారు మాట్లాడుకోవడం మానవ నైజం. అందుకే నామిని భార్య ప్రభావతి పిలిచినా ఆ చోటునుంచి కదలడు. “నువ్వు నన్ను తన్నను గూడ తన్ను. తన్నులన్నా తింటాగాని నేను మాత్రం ఈడనుంచి అచ్చిరమంటే కదల్ను. ఎందుకంటావా – మాలోనుంచి ఇంతకుముందు నీలావతి పొయ్యింది. ఆయమ్మి మింద సరైన కత జెప్పుకున్నాం. మళ్ల బక్కత్త పొయ్యింది. ఆమెను గురించి గూడా చెప్పుకున్న కతను ఇప్పుడే ముగించినం. ఇంగ నేను గూడ ఇక్కణ్నుంచి నువ్వు పిలిచినావు గదాని కదిల్తే పెళ్లానికి బయపడి బతికే ఈడూ ఒక మొగోడేనా? అని కడుపత్తా, కర్రెక్కా నాగురిచ్చి కత మొదలుబెట్టరా? నేన్రాన్ సామీ నేన్ రాన్” అని వూరెత్తకపొయ్యేటట్టు గెట్టంగా అరిచినా” అని ‘కుచ్చుంటే కత, లేస్తే కత‘లో రచయిత అన్నాడంటే అనడూ మరి.

“నా బట్టారేయ్, కొంచేపు మాటలు జెప్పరా! నవ్వుకోని బోతాను” అంటూ వొచ్చింది ఒకాడది (ఆవిడ పేరేమిటో నామిని చెప్పలేదు, ఎందుకంటే భయమట?). సడే వుండు” అని నేను ఇంట్లో (గుడ్లు పెడతా) వుండిన నా పెళ్లాన్ని “ప్రభావతీ!” అని పిలిచినా. దానికినపళ్లా. “యశోదమ్మకూతురా!” అని మళ్లీ పిలిచినా. అది చవల్లో యేస్కోలా! మరేదకిది కాలం గాదన్జెప్పి “ఏమే లంజా” అనే కొద్దికి, “అగ్గో వస్తుండానుండబ్బో!” అంటూ అది ఈదిలోకొచ్చింది”  అని ‘రెయ్యి స్కూల్లో తినమరిగి‘ అనే కథలో అంటే మనకు కోపం రాదు. తరువాత చెప్పబోయే జీవిత సూత్రంలో మునిగిపోతాం. ఇక మిట్టూరులో అతిపెద్ద తిట్టు జెంటిలుమేన్. “వొసే నేనుగాదే జెంటిలుమేను. నీయమ్మ జెంటిలుమేను. నీ పిన్నం జెంటిలుమేను. నీ పెద్దం జెంటిలుమేను. నీ వొంగిసమంతా జెంటిలుమేన్ల వొంగిసం!” అంటా అక్కసుతో దనలచ్చి నీలావతి పైబడవొచ్చింది. “నువ్వు నన్ను లచ్చిసార్లు జెంటిలుమేనంటే నేన్నిన్ను కోటిసార్లు జెంటిలుమేనంటా. జెంటిలుమాన్ తనం మాలో లా. మీరింగా పుట్టకతోనే జెంటిలుమేన్లు” అంటా నీలావతి రంయ్ మని దనలచ్చింకల్లా ఎగబడింది. ‘నువ్వు లంజ’ అని లచ్చిసార్లు అన్నా మావూరాడోల్లు పడతారు గాని ‘నువ్వు జెంటిలుమేను’ అని గొణిగినా అగుమానంతో అల్లాడిపోతారు” అంటాడు నామిని ‘జెంటిలుమేన్ల చేత’ అన్న కథలో. ‘బాసకత బక్కమ్మకు తెలుసు‘, ‘అలిమేలు మంగమ్మకొక దండం‘, ‘రంగరంగ నిన్ను నమ్మితి‘ మొదలైన కథలు చదివి తీరాల్సిందే.

నామిని స్కూల్లో అయన తర్వాత ఇంతే అద్భుతంగా కతలు చెప్తున్నది మహమ్మద్ ఖదీర్ బాబు. నెల్లూరు జిల్లా మాండలికంలో ఇదే తరహా కథలు చెప్తాడు. మట్టివాసన వినాలనుకునేవారు తప్పనిసరిగా చదవాల్సిన కథల పుస్తకం నామిని సుబ్రమన్యం నాయుడి “మిట్టూరోడి కతలు”.

నవోదయ పబ్లిషర్స్ ప్రచురించిన ఈ “మిట్టూరోడి కతలు” పుస్తకం ఖరీదు ఇరవై రూపాయలు మాత్రమే. ఒకవేళ ఈ కాపీలు దొరక్కపోతే మీరు బాధ పడక్కర్లేదు. నామిని మూడు కథాసంపుటాలు కలిపి ఒక పుస్తకంగా (టాంసాయర్ ప్రచురణలనుకుంటా!) వచ్చాయి. తప్పక సంపాదించి చదవండి.

ప్రకటనలు

10 responses »

 1. నామిని నాకు మంచి స్నేహితులు. ఈ పుస్తకాన్ని ఆయన “మా సుజాత కు సారెగా ..” అని రాసిన ముందు పేజీ మాటతో సహా నామిని చేతిమీదుగా అనుకుని మరీ చదివాను.ఆయన చేతిమీదుగా ఇలా తన ప్రతి పుస్తకాన్నీ ఇలా “సారెగా”(ఈ మాటకు ఎలా రుణం తీర్చుకోవాలో తెలీదు నాకు) అందుకోవడం నాకు, ఇవ్వడం నామినికి అలవాటే! (కొంచెం గొప్పలు ఎక్కువైనట్టున్నాయి)

  ప్రతి కథా ఒక్కో ఆణిముత్యం! ఇంతకంటే ఏమీ చెప్పలేను. ఆయన మనం లాక్కెళ్ళినా ఇంటర్నెట్ కెఫేలకు రారు. అందువల్ల నామిని గురించి, ఆయన రచనల గురించి బ్లాగుల్లో ఏమి వచ్చినా ప్రింట్ తీసి పంపుతుంటాను. ఇంతకు ముందు రానారె రాసిన సమీక్ష పంపాను. ఈ సమీక్ష కూడా తీసి పంపాలి.

  మీ సమీక్ష చదివాక మళ్ళీ ఆ పుస్తకాన్ని ఒకసారి దులిపి చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు.

 2. naami ni kalavaDaM kOsamE, haidaraabaadu nuMchee nEnuu, baMgaarraajuu, beMgaLuuru nuMchee maavagaaDuu tirupateLLEM. yeMkaTravaNamuurtini kaaDakeLLalEdu.
  “….gabagabaa nichchena meTlekki…” laaMTi manishi kaadu naamini. dayachEsi aa vyaakhya ni teeseyyaMDi. adi naamini ni avamaaniMchaDamE avutuMdi.

 3. okka kESava reDDi gaari kathala meeda naamini abhipraayaMtO EkeebhaviMchalEkapOyEnu gaanee, dhanyuDu naamini. aayana saahityaanni chadivi aanaMdiMcheevaaLLani dhanyulni chEstaaDu kaabaTTi. “pachcha naaku saakshigaa” pustakaanni meerevarainaa siTee bassulO kuuchuni “DisTrab” avakuMDaa chadivEraa? appaTidaakaa yaMDamuuri tappa marohaLu teliyani maa vivEkki chadavamani istE, kOThee nuMchee paThaan cheruvu chEree sariki “punah punah” chadivi “kaMThataa peTTavalsina pustakaM guruu” annaaDu.

 4. ‘నీ వొంగిసమంతా జెంటిలుమేన్ల వొంగిసం!’ పేరా చదివి ఒక నవ్వొచ్చింది… నేనీమధ్య ఇంత గట్టిగా నవ్విందిలేదు. వెంటనే ఆ కతను కూడా మళ్లీ చదివాను. ఒక కత ఏం సరిపోతుంది! ఇంకా చదువుతూ వున్నాను. మీకు చాలా చాలా ధాంక్స్. :-)) సుజాతగారికి కూడా.

 5. మంచి పుస్తకం పరిచయం చేసారండీ… నేను ఖదిర్ గారి దర్గా మిట్ట కధలు, పోలెరమ్మ బండ కధలు చదివాను కానీ మిట్టూరోడి కధలు దొరకలేదు. మీరు చెప్పిన కధల సంపుటి కోసం ప్రయత్నిస్తాను.

 6. naami katalu caduvutunte edo pustakamu cadivinattundadu. accamga aavuurlo vaarikedurugaa nilabadi vaari maatalnu pootlaatnu sustunnatte untundi.oorlo vyaharaalu enta sahajanga akshara ruupamiccado naamini.caduvutunnavaadini kavi leeda racayeta tana mundu nilabettagaligaadante atani bhaashaloo enta balamundaali? greaat naamini

 7. నామిని గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఉన్నపుడే సోమరాజు సుశీల గారి చేత “ఇల్లేరమ్మ కతలు” రాయించారు. ఖదీర్ దర్గా మిట్ట కతలు రాసింది కూడా అప్పుడే!

  వేణూ శ్రీకాంత్,
  మిట్టూరోడి కతలు ఇప్పుడు దొరకదు. నామిని తన రచనలన్నె కలిపి మిట్టూరోడి పుస్తకం అని ఒక ఎడిషన్ వేసారు. దాంట్లో కొత్తగా(ఇదివరకటి వాటితో కలిపి) “పాల పొదుగు” అనే పెద్ద కథ కూడా ఉంటుంది. త్వరలో ఏదో రాయడానికో అచ్చెయ్యడానికో ప్రయత్నిస్తున్నట్టు మొన్న ఏప్రిల్లో చెప్పారు గానీ

 8. @ బాబ్జీలూ, ఎంచక్కా ఇప్పుడు రాసిందే తీసుకెళ్లి http://lekhini.org లో పైబాక్స్ లో పెడితే కింది బాక్స్ లో తెలుగులో వచ్చేస్తుంది. వెంటనే దాన్ని కాపీ చేసి నా అభిప్రాయాల డబ్బాలో పడేయకూడదూ!

  @ మహేష్, రానారే, వేణూ, భాస్కరనాయుడు గార్లకు నెనర్లు. ‘గాబరాగా నిచ్చెన మెట్లెక్కి…’ అదలా ఫ్లోగా వ్యాసంలో వచ్చిందంతే.

  @ నామినికి మంచి స్నేహితురాలు సుజాతగారికి, అవునండీ మీరు అదృష్టవంతులు. ఆంధ్రజ్యోతిలో నామిని వున్నపుడు యాసీన్ తో కలిసివెళ్లి పలకరించాం. అది మధురస్మృతి. దయచేసి నా వ్యాసం కాపీ ఒకటి ఆయనకు పంపండి. మీరు నా కానుకగా “రక్తాశ్రువులు” అందుకోండి. (మీ పోస్టల్ చిరునామా తెలియజేయగలరు). మీరు పంపిస్తానంటే మరి నాలుగు సమీక్షావ్యాసాలు నామిని పుస్తకాలమీదే రాసేస్తాను. నాకు నామిని అంటే చాలా ఇష్టం. థాంక్యూ సుజాత గారూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s