నాలుగో వారం సౌమ్యగారితో చదువు ముచ్చట్లు…

సాధారణం

ఇంజనీరింగ్ పూర్తిచేసిన సౌమ్య ప్రస్తుతం ట్రిపుల్ ఐటి (హైదరాబాద్)లో ఎమ్. ఎస్. (రిసెర్చ్) చేస్తున్నారు. తెలుగుపీపుల్ డాట్ కాం లో రచనలు చేయడంద్వారా ఈ వ్యాసంగం మెదలుపెట్టిన సౌమ్య ప్రస్తుతానికి నవతరంగానికి కూడా తన రచనలు అందించి నిండుతనాన్ని ఇస్తున్నారు. 200 పోస్టుల మైలురాయిని దిగ్విజయంగా ఇటీవల దాటిన ఈమె సొంత బ్లాగులో ఇప్పటికి అరలక్షకు పైగా (అతి త్వరలో లక్ష సందర్శకుల రికార్డును సౌమ్య అధిగమించబోతున్నారు) పాఠకులను తన ఇంటిమసీ నిండిన అక్షరాలు, భావాలతో అలరించారు. ఆమె రాసిన ఏ ఒక్క పోస్ట్ చదివినా ఆమె మంచి పాఠకురాలని ఇట్టే తెలిసిపోతుంది. మరి ఈ వారం ఫటాఫట్ అతిథి మాటలు చదవండి…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
– అలాంటిది ఇప్పటికైతే ఎదురుకాలేదు కానీ నిరాశపరిచిన పుస్తకాలైతే ఉన్నాయి. అటువంటి అనుభవాలు ఈ మధ్య జరిగినవి ఐతే – “తెలుగు కథకి జేజే” మరియు భరాగో-“సరదా కథలు”

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

 

 

 

– ఇంకా పూర్తి చేయలేదు కానీ, ప్రస్తుతం Richard Dawkins రాసిన The God Delusion చదువుతున్నాను.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

 

 

 

– ఇలా లెక్కపెట్టలేదు కానీ,  ఇంట్లో మా పేరెంట్స్ విద్యార్థులుగా ఉన్నప్పట్నుంచీ కొన్న పుస్తకాలు ఉన్నాయి కనుక చాలనే ఉన్నాయి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

 

 

 

– చాలా ఉన్నాయి. 

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

 

 

 

– అంటోన్ చెకోవ్, సత్యజిత్ రాయ్, ఆర్.కె.నారాయణ్, కుల్దీప్ నయ్యర్ …ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

 

 

 

– పుస్తకాలు బహుమతిగా నేనేమీ ఇచ్చినట్లు లేను. పుచ్చుకున్నవి మాత్రం మూణ్ణాలుగు ఉన్నాయి.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

 

 

 

-నేను అంత తరుచుగా ఏ పత్రికనూ చదవట్లేదు. విపుల అంటే ఇష్టం. ఇష్టం లేనిది… హుమ్….  అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతం

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

 

 

 

– అనుక్షణికం, వేయిపడగలు.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

 

 

 

– గుంటూరు శేషేంద్రశర్మ “రక్తరేఖ”, డాకిన్స్ – “గాడ్ డెల్యూజన్”
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
1. The Tao of Physics – by Fritjof Capra
2. The English Teacher – RK Narayan
3. The Future Shock – Alvin Toffler

మొదటిది నాలో శాస్త్రీయ దృక్పథాన్ని, కొంతవరకూ ప్రాచ్య పాశ్చాత్య ఆలోచనా విధానల్లోని  పోలికలనూ, తేడాలనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి తోడ్పడింది. ఈ పుస్తకం చదవకుంటే నా జీవితం మరోలా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలిగేంత ప్రభావితం చేసింది.
రెండవది ఎమోషనల్ గా ప్రభావితం చేసింది. కథలో నెరేటర్ బాధని నాలో కలిగించింది.
మూడవది – ఇన్నేళ్ళలో ఎప్పుడూ పూర్తిగా చదవలేదు. కానీ, ఈ పుస్తకం నాకు ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడింది అని మాత్రం చెప్పగలను.

ఇక లేవని కాదు కానీ, చటుక్కున ఇవే గుర్తు వచ్చాయి ఇప్పుడు.

ప్రకటనలు

2 responses »

  1. onceiam reading positive thinking by b.v.pattabiram
    iam very happy,why becausehow to develop the positive trhinking and iam reading so many books but some of the books is not clear .that means iam not understanding,so pl try to me.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s