ఐదోవారం చదువు ముచ్చట్లు పూర్ణిమతో…

సాధారణం

దాదాపుగా ప్రతి బ్లాగునూ చదివి ఎక్కడో ఓ చోట తన కామెంట్ ను రాయడం మాటలు కాదు. అలా కామెంటడమే కాక, ఎంతో సున్నితమైన భావుకతతో తన మదిలోని ఊహలను ఊసులుగా గుదిగుచ్చి తోటి బ్లాగరులకు అందిస్తున్న పూర్ణిమ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పుస్తకాలను, భావాలను ఎంతో అందంగా అక్షరాల మాలగా అల్లి బ్లాగులోకంలో ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నారు. పూర్ణిమ బ్లాగు చదవడమంటే వెన్నెలలో విహరించడమే. ఈ వారం ఆమె చెప్తున్న చదువు ముచ్చట్లు వినండి…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
పుస్తకం చదవటం అయ్యిపోగానే, “ఎందుకు చదివినట్టు నేనసలు” అని అనుకున్న పుస్తకం “మైదానం” – చలంది. ఓ రెండు గంటలు ఏకబిగిన ఈ పుస్తకానికి నా సమయాన్ని ఎందుకు వచ్చించానో తెలియని సమయమది. అలా అని మైదానం అన్నా, చలం అన్నా నాకెలాంటి అయిష్టత లేదు.

బాగా బోర్ కొట్టిన పుస్తకం మాత్రం, Richard Bach రాసిన  A Bridge Across Forever. Jonathan Livingston Seagull చదవిన ఊపులో కొన్నాను. “ప్రేమకథలూ” అనగానే వెంపర్లాకూడదని బుద్ధి చెప్పిన పుస్తకం. soulmates లాంటివి నా తలకెక్కవు అని తెలిసిందీ దీని వల్లే!

కిరణ్ దేశాయ్ Loss of Inheritance కూడా ఎక్కలేదు.

 

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

 

ఈ మధ్యకాలంలో  పుస్తకాలు కొనడానికెళ్తున్న ప్రతీసారి ఓ పేద్ద లిస్ట్ తయారు చేసుకుని వెళ్ళటం వల్ల, కొన్న చివరి పుస్తకం అంటే చెప్పటం కష్టం. వేటూరి గారి కొమ్మకొమ్మకో సన్నాయి తెప్పించుకుంటున్నాను.

చదవడం పూర్తి చేసింది అయితే, ఇంగ్లీషులో “catcher in the rye“. తెలుగులో ఛంఘిజ్ ఖాన్ నవల.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

 

కొన్ని లెక్కపెట్టకూడదు. పెట్టుకోనక్కరలేదు. 🙂

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

 

Salman Rushdie’s Midnight Children. ఇది ఇప్పుడే కాదులే అనుకుని ఓ ఆర్నెళ్ళ క్రితం పక్కకు పెట్టాను, ఇంకా పక్కనే ఉంది.
Pearl S Buck ఆత్మకథ, My several worlds పాత కాపీ కొన్నాను. అక్షరాలు చిన్నగా ఉండటం వల్ల కుదరటం లేదు. కానీ పూర్తి చేస్తాను, ఆ నమ్మకం ఉంది.
 

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

 

కొంచెం కష్టం చెప్పడం. రెండు భాషల్లో నేను explore చేయాల్సిన వాళ్ళు చాలానే ఉన్నారు. చదివిన వారిలో మాత్రం:

రవీంద్ర నాథ్ టాగోర్: నవలలు చదివాను, కథలూ కొన్ని చదివాను. Stray Birds ఎంతగా నచ్చేసిందో మాటల్లో చెప్పలేను. ఆయన ఉత్తరాల సంకలనం చదవాలి. సో.. టాగూర్ నాకు చాలా ఇష్టం అని వేరే చెప్పక్కరలేదు.

రస్కిన్ బాండ్: ఈ బాండ్ తో “బాండింగ్” గురింఛి చెప్పాలంటే కొన్ని టపాలవుతాయి. బడిలో పాఠ్యాంశంగా పరిచయమైన వీరు, పుస్తకాలు చదవలేని సమయాల్లో కూడా తోడుగా ఉన్నారు.

మార్క్వెజ్: Love in time of cholera ని నేను చదివిన తీరు చూస్తే, ఈ రచయిత నాకేమిటో తెలుస్తుంది. నా వేలుని తన చేతిలో పెట్టేసి, ఎక్కడికి తీసుకెళ్తున్నా ఆనందంగా వెళ్ళిపోగలను.  One hundred years of Solitude చదవాలి త్వరలో

సలింగర్:  ఈయన కథలూ, ఒక నవల చదివాను. He amazes me, amuses me!

త్రిపురనేని గోపిచంద్: మాకు తెలుగులో ఒక పాఠ్యాంశం ఉండేది, తుమ్మచెట్టు స్వగతం అది. గోపిచంద్, “మాకూ ఉన్నాయి స్వగతాలు” అన్న పుస్తకం నుండి సంగ్రహించబడింది. నేను తెలుగులో ఏదైనా “క్రియేటివ్”గా రాశాను అంటే, ఈ పాఠం తరువాతే. వీరి అసమర్థుని జీవయాత్ర కూడా చాలా ఇష్టం. ప్రస్తుతం “పోస్టు చెయ్యని ఉత్తరాలు” చదువుతున్నాను.

తిలక్ – కథకుడిగా, కవిగా ఒకేలా అభిమానం. శ్రీపాద, ముధురాంతకం రాజారాం, మల్లాది రామకృష్ణ శాస్త్రి, రావి శాస్త్రి, ముళ్ళపూడి అందరితో పరిచయాలు జరిగాయి. చూడాలవి ఏ ప్రణయాలకు దారితీస్తాయో! 😉

 

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

 

“వద్దు.. బాబోయ్.. వద్దు” అంటున్నా, “అయ్యో.. వద్దులే” అని మొహమాటలకి పోతున్నా కొన్ని పుస్తకాలు కొందరికి ఇచ్చాను. నాకో పుస్తకం వస్తుందని తెలిసింది. ఇంకెన్ని వస్తాయో చూడాలి.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

 

నేను పత్రికలు చదవను.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

 

Alchemist అంతగా నచ్చలేదు నాకు. తెలుగులో “చివరకి మిగిలేది?” మొదలెట్టి పక్కకు పెట్టేసా, ఇప్పుడప్పుడే తెరిచే ఉద్దేశ్యం లేదు. 

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

 

Walden – Henry David Thoreau
పుల్లంపేట జరీ చీర – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.
ప్రకటనలు

2 responses »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s