ఏడోవారం చదువు సంగతులు రెడ్డిశాస్త్రిగారితో…

సాధారణం

తెలుగు సాహిత్య లోకంలో ఎ.వి. రెడ్డిశాస్త్రి తెలియని వారుండరు. ఇంగ్లిషు కథావాతావరణాన్ని తెలుగునేల మీద దించిన అతికొద్దిమంది ప్రతిభావంతులైన తెలుగు కథకుల్లో ఈయన ఒకరు. ఇప్పటిదాకా రెండు (“అసంగత సంగతాలు“, “ఈ మంటలు చల్లారవు“) కథాసంపుటాలు ప్రచురించారు. ఈ వారం ఆయన చదువు ఊసులు మనతో పంచుకుంటున్నారు. రెడ్డిశాస్త్రిగారు నా ప్రశ్నలకు స్పందించి సమాధానాలు పంపినందుకు నేను నిజంగా చాలా సంతోషపడ్దాను. ఏడు పదులు దాటిన వేళ కూడా ఇప్పటికీ రోజుకు కనీసం ఐదు గంటలు చదువుతూ, ఏదో ఒకటి రాసుకుంటూ యువతకు స్ఫూర్తిదాయకంగా సాహితీ కృషి సాగిస్తున్నారు. ఇక చదవండి.

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
నేను ఎంపిక చేసుకున్న పుస్తకాలే చదువుతాను కాబట్టి ఆ సమస్య లేదు. ముందుగా ఆ పుస్తకం గురించి బాగా వినాలి. అలాగే కె. బి. ఎస్. కృష్ణ సూచించడం వల్లనే హ్యారీపోటర్ ను చదవగలిగాను. ముందంత ఆసక్తి చూపించకపోయినప్పటికీ, తర్వాత క్రిష్ణ స్వయంగా పుస్తకం ఇచ్చాక చదివినప్పుడు క్రమక్రమంగా ఆ పుస్తకంపై ప్రేమలో పడ్డాననుకోవాలి. ఆ తర్వాతా సిరీస్ అంతా చెన్నయిలో కొని చదివి, జె. కె. రౌలింగ్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అయితే చివరి భాగం మాత్రం కొద్దిగా విసిగించింది. దాంతో అది ఇంకా పూర్తికాలేదు.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఈ మధ్య చాలా పుస్తకాలు కొన్నాను. చాలా ప్రసిద్ధ రచయితలైన రాబ్-గ్రిల్లెట్, బోర్జెస్, అలెజో కార్పెంటీర్, కిరణ్ దేశాయ్, అరవింద్ ఆడిగ, క్లీన్త్ బ్రూక్స్, ఎంప్సన్ తదితర రచయితల రచనలు ఇటీవల కొన్నాను. మిచ్ ఆల్బం రాసిన ట్యూజ్ డేస్ విత్ మోరీ నాకు బాగా నచ్చింది. అందులో విషయం కంటే రాసిన పద్ధతి బాగుంది. Craftsmanship, more than the content, dominates the book. Sermonization is served on a delicious platter.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

ఏమో, మొత్తం ఎన్ని పుస్తకాలు వున్నాయో నేనెప్పుడూ లెక్క పెట్టలేదు. కానీ చాలా మంచి పుస్తకాలే నా దగ్గర వున్నాయనుకుంటాను.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

నేను ఎంతో ఇదిగా చదవాలనుకుని చదవలేకపోతున్న పుస్తకాలు ఎన్నో వున్నాయి. మహాభారతం, భాగవతం, ఉపనిషత్తులు సంపుటాలన్నీ నాకోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ నా షెల్ఫ్ లో కొలువుతీరాయి. నాకు వాటిని చదవడానికి ఎప్పుడు సమయం దొరుకుతుందో! ప్రస్తుతానికి హెన్రీ జేమ్స్ పట్ల, డిహెచ్ లారెన్స్ పట్ల నా ప్రేమను పక్కన పెడితే, నా దగ్గర వాళ్ల పుస్తకాలన్నీ వున్నాయి. కానీ వాటినెప్పుడు తిరగేయగలను. టైమేదీ? I have with me all the books I want to read, but I am not able discipline myself to sit and read them.

5. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఈ మధ్య కాలంలో పుస్తకాలు ఎవరికీ గిఫ్టుగా ఇచ్చిన జ్ఞాపకం లేదు. నాకూ …వూహూ…ప్చ్.

6. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

All Indian News papers are becoming increasingly shrill these days. They try to champion most unworthy causes most of the time. My beloved paper The Hindu also is losing its reputation for balanced reporting and non partisan approach. No paper is above board, I feel

7. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ఒకటి కాక ఎన్నో చదువుతున్నాను. “కాచర్ ఇన్ ది రై” (జె. డి. సాలింజర్), అప్రోచెస్ టు లిటరరీ క్రిటిసిజమ్ సంక్షిప్త పాఠం తదితరాలు చదువుతున్నా.

8. మీకు బాగా నచ్చిన రచయిత ఎవరు?

తెలుగులోనా? ఇంగ్లిషులోనా? మరేదైనా ఇతర భాషల్లోనా? ఇంగ్లిషులో చాలామందంటే నాకిష్టం. తెలుగులో కూడా అనుకోండి. Henry James is a very tough writer. Perhaps nobody can say with confidence that he/she has understood Henry James. He is so complicated. He expects a refinement of the highest order to understand his ideas on refinement. I love him passionately not withstanding the fact that I have understood him so little. కాళింది చరణ్ పాణిగ్రాహి రాసిన “మట్టి మనుషులు” నవల అంటే నాకు చాలా ఇష్టం. అంతటి మహారచయితకు నోబెల్ రాకపోవడం ఘోరం.

ప్రకటనలు

3 responses »

  1. Thank you. Very valuable.
    శ్రీకాకుళంలో నివాసమున్న ఇతర సాహితీ వేత్తల్ని కూడా ఈ శీర్షికలో పరిచయం చెయ్యాలని కోరుతున్నాం. కవి ఛాయారాజ్, కథానిలయం అధ్యక్షులుగా చేశారు ఒక బోటనీ మేష్టారు .. పేరు … నాయుడుగారు (సరిగ్గా గుర్తు రావడం లేదు), మంచి అభిరుచి కలిగిన శ్రీమంతులు యగళ్ళ రామకృష్ణ గారు, ఇటీవలే కథా నవలా రచయిత వివిన మూర్తిగారు కూడా అక్కడ చేరిన వినికిడి.

  2. కొత్తపాళీ గారూ, శ్రీకాకుళం సాహితీవేత్తలపై మీకున్న అభిమానానికి నెనర్లు. ఆ బోటనీ మేష్టారి పేరు బివిఏ రామారావు నాయుడు. ఆయన రాసిన ఒక వ్యాసపు పొత్తంపై నేనో సమీక్ష (https://chaduvu.wordpress.com/2008/06/13/mandasa/ )గురిపెట్టాను. మీరు తప్పక చదవాలి. మీరు చెప్పిన రచయితలంటా ఇంటర్ నెట్ కు బహుదూరం. అయినా ఈ ప్రశ్నలు పంపి జవాబులు రాబట్టడానికి తప్పక ప్రయత్నిస్తాను. మీ అభిమానానికి మరోసారి నమస్తే.

    -రవి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s