ఎనిమిదో వారం చదువు ముచ్చట్లు వీవెన్ తో…

సాధారణం

వీవెన్ గారి గురించి నాలుగు పరిచయ వాక్యాలు రాయాలనుకోవడం దుస్సాహసం. ఒక్కటి చెప్పగలను వీవెన్ లేకపోతే ఇప్పటికి నా బ్లాగు వీక్షకుల సంఖ్య వందలోపే వుండేది. అలాంటి బ్లాగు ప్లాట్ ఫారం ప్రారంభించడమే కాకుండా వీవెనుడి టెక్నిక్ లతో విజ్ఞానవంతులను చేస్తున్న అత్యంత సౌమ్యులు వీవెన్. ఆయన చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి….

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

లేదు. ఏ పుస్తకాన్నీ బోరు కొట్టించేంతవరకూ చదవలేదు.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

గత సంవత్సరంలో ఏమీ లేవు.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
ఐదో, ఆరో.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
Free Culture. సగం వరకూ చదివా.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

యండమూరి. Steven Covey. పుస్తకాల పేర్లకి 10 ప్రశ్నకి జవాబు చూడండి.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

సున్నా. సున్నా.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

ఏమీ లేవు. ఏమీ లేవు.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
ప్చ్.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ఏమీ చదవడం లేదు.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

విజయానికి ఐదు మెట్లు, తప్పు చేద్దాం రండి, The 7 Habits of Highly Effective People, Fountain Head, Rich Dad Poor Dad.

11. మీరెందుకు చదువుతారు.

కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కాలక్షేపానికి.

ప్రకటనలు

11 responses »

 1. మృదుభాషి, మితభాషి అని తెలుసు. మితచదువరి కూడానన్నమాట! (సమాధానాల కంటే ప్రశ్నలెంత పెద్దవో చూడండి)
  పోన్లెండి.., పనికొచ్చే పనులు చేసే విషయంలో మితం లేదు – మన అదృష్టం కొద్దీ!

 2. వీవెన్ గారి లైబ్రరీలో వున్న ఆ ఐదారు అరుదైన పుస్తకాల పేర్లేమిటో తెలుసుకోవాలని వుంది.

 3. @చదువరి, ఫటాఫట్ అన్నందుకే చిన్ని సమాధానాలు!

  అన్నట్టు, ఇప్పుడు జరుగుతున్న పుస్తక ప్రదర్శన తర్వాతైతే, కొన్ని ప్రశ్నలకైనా అవును అని సమాధానం వచ్చుండేది.

 4. మితభాషి…మిత చదువరి…హహహ! చాలా వెరైటీగా ఉన్నాయి వీవెన్ గారి జవాబులు! కనీసం టెక్నికల్ పుస్తకాల పేర్లన్నా ఉంటాయని చివరి దాకా చదివాను. ఉహూ!

 5. చదువరి, హ హ హ.
  వీవెన్ మితభాషిత్వం ఒక మిథ్య. కావాలంటే అతని రేడియో ఇంటర్వ్యూ వినండి. ఎన్నో కబుర్లు (సాంకేతికం కానివి కూడా) ఎంత చక్కగా చెప్పారో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s