తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు దేవరపల్లి రాజేంద్రకుమార్తో…

సాధారణం

నేను బ్లాగావరణంలోకి ప్రవేశించిన తరువాత మొదట పరిచయమైన వ్యక్తి దేవపల్లి రాజేంద్రకుమార్. విశాఖపట్నంలో రిసెర్చ్ చేస్తున్న అతని స్నేహితుని కంప్యూటరులో కొన్ని కొత్త ఉపకరణాలు వేస్తూ చేగొడియాలు తింటూ… బ్లాగు హడావిడికి కాసులు రాలుతాయా.. అని చర్చించుకుంటూ… గడిపిన సాయంత్రం మర్చిపోలేనిది. విశాఖతీరాన… బ్లాగుతో, నవతరంగం నిర్వాహకునిగా.., దాదాపు అన్ని బ్లాగుల్లో సమాధానాలు రాస్తూ… అందరికీ మంచి మిత్రుడైన రాజేంద్రగారితో ఈ వారం చదువు ముచ్చట్లు…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

ఈ ప్రశ్నకు నిర్దిష్టంగా సమాధానం చెప్పటం కష్టం,ఎందుకంటే గొప్ప పుస్తకరచయితలు అన్న బరువుమోస్తున్న చాలా మంది పుస్తకాలు కొన్ని ఇలాగే అనిపించాయి,కొన్ని సార్లు

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

కొన్న్ పుస్తకం ఈ మధ్య ఏమీ లేదు,కొన్నాళ్ళ క్రితం విశాలాంధ్రలో ఒక పది దాకా కొన్నాను,చదవటం పూర్తి చేసినవి,శ్రీపాద’ కధలు-గాధలు’ ‘చాసో కధలు,చిక్కవీర రాజేంద్ర(మాస్తి వెంకటేశ అయ్యంగారు) (మరో సారి) మాలపల్లి, వంశీ పసలపూడి కధలు,చక్రపాణీయం,ఇలా చాలా ఉన్నాయి

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

ఇదీ చెప్పలేను,కానీ ఇ-బుక్స్ మాత్రం తెలుగు-ఇంగ్లీషు కలసి వందలుంటాయి

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

chasing the monk’s shadow-Mishi Saran,Enivironmentalism-A Global History-Ramachandra Guha

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

మపాసా అందరికన్నా ముందుంటారు,హెమ్మింగ్ వే,చెకోవ్,మామ్, కొకు,శ్రీపాద,చాసో ఇది అనంతం(జాబితా)

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

నేను పుస్తకాలు బహుమతిగా ఎవరికీ ఇవ్వలేదు,ఫలానా పుస్తకం చదవమని మాత్రం సలహాలు ఇచ్చా,ఒక నాలుగైదు నాకు వచ్చాయి

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

పత్రికల్లో నచ్చని అంశాలుంటాయి,పత్రిక అచ్చంగా నచ్చక పోవటం లేదు,అన్ని పత్రికలూ చదువుతాను

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

నా చదువుకీ జనాభిప్రాయానకీ సంబంధం లేదు,ఆమాటకొస్తే సూపర్ రచనలు అని హోరెత్తించినవి చాలా చదవలేదు నేను

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

మహాయాత్రికులు-డాక్టర్.యం.ఆదినారాయణ,ఆంధ్రవిశ్వకళా పరిషత్,

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

హెమ్మింగ్ వే ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ,ఆ ముసలాయన లాగా ధైర్యంగా ఉండలేను కానీ మొండితనం మాత్రం కాస్త అలవర్చుకున్నా 🙂

ప్రకటనలు

7 responses »

  1. రాజేంద్ర మరో పార్శ్వం సినిమాలు గురించిన ప్రశ్నలేవి? విశాఖతీరాన నడపటంలో అనుభవాలు గురించిన ప్రశ్న ఏది? వ్యక్తిని బట్టి ప్రశ్నలలో వైవిధ్యం చూపాలి.

  2. రావు గారూ, నన్ను మన్నించాలి. వెంటనే మారుస్తున్నాను. మీరన్నట్టు ఇకపై ప్రశ్నలు కాస్త శ్రద్ధ తీసుకుని సంధిస్తాను. ఏదిఏమైనా పుస్తకాలను అభిమానించే వాళ్లను కాస్త రెచ్చగొట్టడానికే ఈ శీర్షిక. మీ ఆదరాభిమానానికి ధన్యవాదాలు.

  3. రాజేంద్ర గారి బ్లాగునే కాక, వారి ఆలోచనా ధోరణిని, వారిలోని కవిని అభిమానించే వారిలో నేనున్నా! మపాసా, చాసో ల రచనలను అభిమానిస్తారంటేనే ఆయనేమిటో తెలుస్తుంది.

    బాగుంది ఫటాఫట్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s