పదో వారం చదువు ముచ్చట్లు చావా కిరణ్ కుమార్తో…

సాధారణం
ఒరెమునా బ్లాగరిగా సుపరిచితులైన చావా కిరణ్ కుమార్ గారు బ్లాగు రాయడం ఆపేసి ‘ఒక అధ్యాయం ముగిసింది’ని స్థిరపరిచారు. ఆయన్ని బ్లాగు రాయడం మొదలుపెట్టమని దీనంగా అర్థిస్తున్న అనేకానేక మంది అభిమానుల్లో నేనూ ఒకడిని. ఈ వారం ఆయన చదువు అలవాట్లు తెలుసుకుందాం.
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
గుర్తులేదు.
ఏమన్నా బోర్ కొడితే నేను ఆ పుస్తకాన్ని పక్కన పెడతాను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

 

 

 

చానా కొన్నాను. అత్తగారి కథలు పూర్తి చేశాను.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

 

 

 

లెక్క వెయ్యలేదు, వందల్లో ఉంటాయి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

 

 

 

అదేదో ఫిజిక్స పుస్తకం. చాలా లావుంది. చదవాలి.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

 

 

 

అసిమోవ్ – ఫౌండేషన్ సీరీస్ , మధుబాబు – షాడో

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

 

 

 

సున్నా – సున్నా , బ్లాగుల్లో కొత్త మిత్రులు వచ్చే వరకు నా స్నేహితుల్లో పుస్తకాల పురుగులు లేరు.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

 

 

 

స్వాతి – మధుబాబు సీరియల్ వస్తుంది కదా. మెచ్చనివంటూ లేవు – చిత్తుకాగుతాలు కూడా శ్రద్దగా చదివే వాణ్ని కదా.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

 

 

 

ఏదో ఉంది. గుర్తు రావటం లేదు. అది చదివాక ఓ కవిత కూడా వ్రాసినట్టు గుర్తు.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

 

 

 

ఒక్కటంటూ లేదు, ఇంట్లో రూం కొక పుస్తకం పెట్టుకొని టైం దొరికినప్పుడు చదువుతుంటాను. రాబ్ షార్పియో ఫ్యూచర్ కాస్ట్ 2020 వాటిల్లో ఒకటి.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

 

 

 

విజయానికి 5 మెట్లు, ఒక యోగి ఆత్మ కథ, భాగవతం, ఫౌండేషన్ సీరీస్
ప్రకటనలు

5 responses »

  1. వందల్లో ఉన్నాయా పుస్తకాలు? అయితే ఒకసారి మీ ఇంటికి కన్నం వెయ్యాల్సిందే! ఏ ఫ్లోర్లో ఉంటారో చెప్పండి? కొంచెం ఈజీగా ఉంటుంది మాకు.

  2. బాగుంది!

    అదేదో ఫిజిక్స పుస్తకం. చాలా లావుంది. చదవాలి. :-))

    ఏదో ఉంది. గుర్తు రావటం లేదు. అది చదివాక ఓ కవిత కూడా వ్రాసినట్టు గుర్తు. :-)) :-))

    ఒక్కటంటూ లేదు, ఇంట్లో రూం కొక పుస్తకం పెట్టుకొని టైం దొరికినప్పుడు చదువుతుంటాను. – నేనూ అంతే! 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s