పదకొండో వారం చదువు ముచ్చట్లు నిడదవోలు మాలతిగారితో…

సాధారణం
నిడదవోలు మాలతి అంటే బహుముఖీనరాలైన వ్యక్తి. కథకురాలిగా, అనువాదకురాలిగా, ప్రచురణకర్తగా, బ్లాగరిగా, మంచి స్నేహితురాలిగా, అనేక పార్శ్వాలున్న మాలతిగారు ఇంటర్ నెట్లో తెతూలిక బ్లాగరిగా అందరికీ సుపరిచితులు. ఆ వృద్ధ బాలిక చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి…
1. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

కొన్నవి – ఆరుద్ర “సమగ్రాంధ్ర సాహిత్యం,” పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారి పుస్తకం “కనుపర్తి వరలక్ష్మమ్మ”

2. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

మాఇంట్లో అట్టే పుస్తకాలు లేవు. మహా వుంటే 400 వుంటాయోమో. దాదాపు అన్నీ వాళ్లూ వీళ్లూ ఇచ్చినవే తూలిక దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. నేను నా పాలసీ పరిధిలో పనికొస్తాయనుకున్నవి వుపయోగించుకుంటాను.

3. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

ఎలాటి పుస్తకాలు చదువుతానంటే –
మంచి నుడికారం, జాతీయాలూ, చక్కని పదలాలిత్యం వున్న తెలుగు కథలు చదవడం నాకు ఆనందదాయకం. గతించిపోతున్న తెలుగు సంస్కృతిని, మానవతావిలువల్ని ఆవిష్కరిస్తూ రాసిన కథలు నన్ను ఆకట్టుకుంటాయి.
ఏ ఒక్క రచయితవీ అన్ని రచనలన్నీ నేను చదవలేదు. ముఖ్యంగా మన ప్రముఖ రచయితలు ఏదో ఒక సిద్ధాంతాన్ని వరించి చేసిన రచనలు నాకు అభిమతం కాదు కనక చదవడం లేదు..

4. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఇచ్చినవి ఏమీ లేవు. ఎవరైనా పుచ్చుకుంటాం అంటే నేను ఇచ్చేయగల పుస్తకాలు వున్నాయి.

5. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

జనాలు సీనిచ్చినా నాకు నచ్చని పుస్తకాలు – ఆనుభవాలూ, జ్ఞాపకాలు (శ్రీపాద), మట్టిమనిషి (సీతాదేవి)..
మొదటి పుస్తకానికి స్పందించలేకపోవడానికి కారణం అందులో విషయాలు నాకు పనికిరావు అనిపించడంచేత. చదివినంతలో వారాలు చేసుకునే ఆచారంగురించిన వివరణ అద్భుతంగా వుంది.
రెండో పుస్తకం – అది నిజంగా మట్టిమనిషి గురించి కాదు. అందులో రైతుల జీవితంగురించి వున్నది చాలాతక్కువ.

6. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

నన్ను ప్రభావితం చేసిన పుస్తకము అంటూ ఏమీ లేదు.
నాచిన్నతనంలో బాగానే చదివేను. ఇప్పుడు మాత్రం తూలికలో అనువాదాలూ, వ్యాసాలూ రాయడానికి ఉపయోగపడేవి మాత్రమే చదువుతున్నాను. ప్రస్తుతం కనుపర్తి వరలక్ష్మమ్మగారి రచనలూ వారిమీద రచనలూ చదువుతున్నాను.
ఇంతవరకూ చదివినవీ, నా అనుభవంలో నాకు తెలుసుకున్నవీ, తెలుసుననుకున్నవీ ప్రాతిపదికగా రాయడంలోనే నా శేష జీవితం గడపడం నాధ్యేయం.

ప్రకటనలు

10 responses »

 1. మీరు చదువరి ఇంటర్వూ లో చెప్పినట్లుగా మీ వద్ద ఉన్న పుస్తకాలు ఇచ్చే మాటా అయితే నేను మిమ్మల్ని
  సంప్రదిస్తాను.నేను ప్రతి పుస్తకం కొనే చదువుతాను.

 2. హయ్యో మీకు శ్రీపాద అనుభవాలూ జ్ఞాపకాలూ నచ్చలేదా? ఈ సారి నా కళ్ళు పెట్టుకుని చదవండి.
  మనలో మాట, కొన్ని కొన్ని పనికి రావు కాబట్టే అంత రుచిగా ఉంటాయి! 🙂

 3. MATTI MANISHI mattini nammu kunna vaari santhanam enda mavulu laanti patna vaasam pothe jarige vishadaantala gurinchi daadaapu 50 naati Guntur zilla lo jarigina kadha ane nepadhyam tho chadvandi maro saari, please.

 4. రవిగారికి నన్ను ఈకోవలోకి చేర్చినందుకూ, సుజాత, అరుణ, సిరిసిరిమువ్వ – చదివినందుకూ ధన్యవాదాలు.
  మగవాడు, ప్చ్. సారీ.
  ఫణిబాబూ, ఇంటికొచ్చి మీకు కావలసినవి తీసుకోండి. అమ్మకానికేం లేవు.

  కొత్తపాళీ, శ్రీపాదవారికి నామీద దయలేదండీ. మూడుసార్లు మొదలెట్టి వందపేజీలు దాటి పోలేక పోయాను. ఏమోలెండీ మీలాటి వారి స్నేహంలో ఎప్పుడయినా పూర్తి చెయ్యగలనేమో భవిష్యత్తులో
  పనికిరావు అన్నమాట తప్పే. నామనసుకి హత్తుకోలేదు ఎంచేతో. అంతే.

 5. Dr. Mythli Nalam, సారీ, మీ వ్యాఖ్య ఇప్పుడే చూశాను. మట్టిని నమ్ముకున్న వారి సంతానం వెంకటపతికి అసలు ఏ ఇష్టాయిష్టాలూ వున్నట్టు కనిపించదు. నాకు అర్థమయనంతవరకూ, సాంబయ్య కొడుకుని పొలం పనిలో పెట్టలేదు. సాంబయ్య కొడుకు వ్యామోహం భార్య వరూధినిమీద, పట్నవాసానికి వెళ్లింది ఆమె కారణంగా. నిజంగా జరిగివుండవచ్చు. నేను కాదనడంలేదు. బహుశా, నవలకి మట్టిమనిషి అని పేరు పెట్టకుండా వుంటే నాకు ఈ అభ్యంతరం వుండేది కాదేమో.

 6. పింగుబ్యాకు: ఊసుపోక – నా అజ్నానమే ఇదంతా! « తెలుగు తూలిక

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s