పన్నెండో వారం చదివి ముచ్చట్లు పప్పు అరుణగారితో…

సాధారణం

మా శ్రీకాకుళమ్ వాస్తవ్యురాలైన పప్పు అరుణ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా బ్లాగులోకంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్-ఎడిటర్ గా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ తొలికథంటే నమ్మలేనట్టుగా రాసిన ‘ఎవరికి తెలియని కథలివిలే” మీరు చదివారా? ఆమె నిరంతర పఠనమే అంత మంచి రచనాశక్తిని అందించిందేమో! మరిన్ని విలువైన సాహిత్య ప్రయోగాలు ఆమెనుంచి తెలుగు పాఠకలోకం ఆశించవచ్చు. ఈ వారం ఆమె చదువు ముచ్చట్లు వినండి మరి…

 

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

  విసుగు పుట్టించిన పుస్తకం నిజం చెప్పాలంటే గాంధీగారి సత్యశోధన. చాలా సమయం పట్టింది కేవలం బోర్ వల్ల. ఎందుకనో మరి. ఈమధ్య విసుగుపుట్టించిన పుస్తకం డి. కామేశ్వరి కవితలు. కథలు చక్కగా రాసే సీనియర్ రచయిత్రి కవితలెందుకు రాయలేనని పంతానికి రాశానని ఆవిడే ముందుమాటలో చెప్పుకున్నారు. అందేవ్ కథలు.. అంటూ కథా సంకలనం ఒకటి వచ్చింది. 70ల్లో వచ్చిన కథల్ని ఇప్పుడు పుస్తకంగా ఎందుకు తెచ్చారో అనిపించింది. అలాంటివి కొన్ని తారసపడుతుంటాయి. అయినా ఉద్యోగ బాధ్యతల వల్ల తప్పక.. చివరికంటా చదవాల్సి వస్తుంది.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇటీవల హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో చాలా కొన్నాను. విజయవాడలో సమయాభావం వల్ల ఏమీ కొనలేదు. మొత్తమ్మీద ఓ నాలుగైదు వేల ఖర్చు. వాటన్నిటి జాబితా ఇక్కడివ్వడానికి కుదురుతుందా? చదవడం పూర్తి చేసిన పుస్తకం ‘మంచి ముత్యం’. దీని ఆంగ్ల మూలం ‘ద పర్ల్’.  దీన్ని రాసింది అమెరికన్ నవలా రచయిత జాన్ ఎర్నెస్ట్  స్టెయిన్ బెక్. ఆయన సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత. దీన్ని తెలుగులోకి దేవరాజు మహారాజు తీసుకొచ్చారు. ఒక జానపదంలోని జీవితాన్ని నగరం పోకడలు ఎలా వెంటాడాయో చెప్పే కథనం ఆకట్టుకుంటుంది.. అందులోని తాత్విక చింతన ఆలోచింపజేస్తుంది.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

నా లైబ్రరీలో.. పుస్తకాలు వందల్లోనే ఉంటాయి. మార్క్ ట్వెయిన్ చెప్పినట్టు నాకెవరైనా మంచి ర్యాకులో, బీరువాలో ఇస్తే బాగుండు..!  🙂

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

ఎన్నో! ఒక పెద్దాయన చెప్పినట్టు ఇంకా సముద్రపుటొడ్డున కూర్చుని గులకరాళ్లను లెక్కపెడుతున్నదాన్నే. సముద్రగర్భంలోనికి వెళ్లి అపారమైన మణిమౌక్తికాలను గ్రహించడానికి ఈ జీవితకాలం సరిపోతుందో లేదో! చదవాల్సినవి, చదవాలనుకుంటున్నవి చాలానే.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

మరీ చిన్నపిల్లలను ‘నీకు అమ్మ ఇష్టమా.. నాన్న ఇష్టమా..’ అనడుగుతుంటారు కొందరు. ఏం చెబుతాం? ఆలోచింపజేసే రచయితలందరూ, పుస్తకాలన్నీ ఇష్టమే.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

బహుమతులుగా పుస్తకాలు.. చాలానే ఇస్తుంటా.. నాక్కూడా బోలెడన్ని వస్తుంటాయి.

 7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

ప్రింట్, ఇంటర్నెట్లో కనిపించే అనేక పత్రికల్లో చాలా వరకూ మంచివే. దేని ఉద్దేశం, లక్ష్యం దానివి. నాకు పనికొచ్చేవి, పనికిరానివి అని మాత్రమే విభజించుకుంటాను. సినిమా వార్తలు చదవను.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

జనం సీనివ్వడం.. వాళ్ల స్థాయి మీద,  అప్పుడున్న పరిస్థితుల మీద, ప్రభావాలననుసరించి ఉంటుంది. నాకు ఎవరు చెప్పారు అన్నదాన్నిబట్టి నేను పుస్తకాల్ని చదువుతాను కనుక, చాలావరకూ నిరాశ కలగదు.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ఇందిరా గోస్వామి రాసిన ‘విషాద కామరూప’. ఎస్సెల్ భైరప్ప రాసిన ‘దాటు’.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న శిల అందమైన శిల్పంగా రూపొందుతుంది. ఎన్నో పుస్తకాలు వేసే ముద్రలన్నీ కలిసి ఒక నిండైన వ్యక్తిత్వం రూపొందుతుంది. మరీ ప్రవచనాలు చెబుతున్నానని  అనుకోకండిగానీ, ప్రభావితం చేసిన పుస్తకాలు చాలానే!

ప్రకటనలు

7 responses »

  1. నేను కూడా ఇలాంటి ఉద్యోగం లో చేరి వుండాల్సింది, నా స్వభావానికి బాగా సరిపొయ్యేది.

    “ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న శిల అందమైన శిల్పంగా రూపొందుతుంది. ఎన్నో పుస్తకాలు వేసే ముద్రలన్నీ కలిసి ఒక నిండైన వ్యక్తిత్వం రూపొందుతుంది.”

    You are right.

  2. “ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న శిల అందమైన శిల్పంగా రూపొందుతుంది.”

    సెబాష్. మీరు సీనియర్ రచయిత్రి అయ్యేదాకా ఆగక్కర్లేదు. ఇప్పుడే కవిత్వం రాయొచ్చు! 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s