పదమూడో వారం చదువు ముచ్చట్లు కెబిఎస్ కృష్ణతో…

సాధారణం

నేను బాల్యంలో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి టెక్కలిలో బాబారావుగారి దగ్గరకు వెళ్లేవాడిని. అంధుడైన, నిరంతరం మంచం మీద వుండే అతనికి ఏం తెలుసని జనం అనుకునేవారు. కానీ అతని మనసొక మహాసాగరమని దగ్గరకు వెళ్లి చూస్తేనే తెలిసేది. (అప్పుడు రోణంకి అప్పలస్వామి మేష్టారి ఎదురింట్లో మా నివాసం) ఇంగ్లిషు భాషా సాహిత్యాల మీద ఆయనది సాధికారత. తరువాత చాలా కాలానికి పరిచయమైన కెబిఎస్ కృష్ణ ఆయన మనుమడే కావడం యాదృచ్ఛికం. కృష్ణ ప్రస్తుతం సీఫెల్ లో సిటీ ఇన్ క్రైంఫిక్షన్ అంశంపై పరిశోధన చేస్తున్నారు. అసాధారణ పాఠకుడైన కృష్ణ చదువును దగ్గరనుంచి చూస్తే ముచ్చట గొలుపుతుంది. ఈ వారం చదువు ముచ్చట్లు ఆయనతోనే. చదవండి మరి…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

ఏదైనా పుస్తకంలో ఒక వంద పేజీలు చదివి, ఇక ముందుకెళ్లలేక, వదిలేసిన పుస్తకాల గురించి మీరు అడగట్లేదు అనుకుంటున్నా. భయంకరంగా బోర్ కొట్టించి సగంలోనే చదవడం విరమించుకున్న పుస్తకాల జాబితా మీప్రశ్నకు కుదరదు. నేను పదో తరగతి చదువుతున్నపుడు పూర్తిచేసిన “ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ” (ఎర్నెస్ట్ హెమింగ్ వే)ని దీనికి జవాబుగా చెప్పాలి. ఆ తరువాత ఎమ్.ఏ.లో వున్నపుడు రెండోసారి చదివాక, చాలా నయమనిపించింది. దానికి కారణం బహుశా దానిలోని సూక్ష్మ విషయాలను (finer nuances) అభినందిందగలగడం వల్ల కావచ్చు. లేదంటే ముందటి చేదు అనుభవం వల్ల ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా చదవడం వల్లనూ కావచ్చు. దాని తరువాత “కాంతాపుర” (రాజారావు)ను చెప్పుకోవాలి. తరువాత్తరువాత కాలం గడిచేకొద్దీ, పఠనం పెరిగిన కొద్దీ ఈ నవల కూడా నచ్చసాగిందనుకోండి. ఐదు సార్లకుపైగా చదివిన తరువాత ఇప్పుడీ నవలను ఇష్టపడుతున్నాను. బహుశా దీనినే acquired taste అంటారేమో కదా!

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇటీవల పూర్తిచేసిన పుస్తకం “ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” (చేతన్ భగత్). ఇక, ఇటీవలే కొన్న పుస్తకం “బయోగ్రఫీ ఆఫ్ డేషీయెల్ హేమెట్ (Dashiell Hammett )” (లిలియన్ హెల్మన్- Lillian Helman ).

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

నిజంగా, నాకు తెలీదు.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

అయ్యో! “స్టీవ్ మిల్ హౌజర్ : ది స్టోరీ ఆఫ్ ఏన్ అమెరికన్ డ్రీమర్ (స్టీవ్ మిల్ హౌజర్), “పాస్టీక్ ఆఫ్ హూండ్ ఆఫ్ బాస్కరవిల్లిస్” (స్పైక్ మిల్లిగాన్) వెంటనే గుర్తుకొచ్చినవి. కారణాలేవైనా, పుస్తకాలు కొని దాచినా “స్కార్లెట్ అండ్ బ్లాక్” (స్టెంధాల్), “నికొలస్ నికెల్ బి (ఛార్లెస్ డికెన్స్) లాంటి మరికొన్ని కూడా….

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

నేను అమితంగా ఆరాధించే నవలారచయితలు విల్కీ కాలిన్స్, కార్నెల్ వూల్రిచ్, జాన్ స్టీన్ బెక్. ఇక నా అభిమాన నవలల విషయానికొస్తే “ది స్ట్రేంజర్ / అవుట్ సైడర్” (ఆల్బర్ట్ కేమూ), “ది వుమన్ ఇన్ వైట్” (విల్కీ కాలిన్స్), “టు కిల్ ఏ మాకింగ్ బర్డ్” (హార్పర్ లీ), “ది కేచర్ ఇన్ ది రై” (జె.డి. శాలింజర్), “ఈస్ట్ ఆఫ్ ది ఈడెన్” (జాన్ స్టీన్ బెక్), “ట్యూజ్డేస్ విత్ మోరీ” (మిచ్ ఆల్బమ్), “నైట్ మేర్” (కార్నెల్ వూల్ రిచ్), “దిస్ స్వీట్ సిక్ నెస్” (పాట్రీసియా హైస్మిత్), “ది స్టోరీ ఆఫ్ పిలాసఫీ” (విల్ డ్యూరాంట్), “ఈజ్ హీత్ క్లిఫ్ ఏ మర్డరర్?” (జాన్ సూదర్ లాండ్), … ఈ జాబితా ఇలా అనంతంగా సాగిపోతూనే వుంటుంది.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఒక్కటిచ్చి మరోటి పుచ్చుకున్నాను. “టు కిల్ ఏ మాకింగ్ బర్డ్” (హార్పర్ లీ) ఒక స్నేహితుడికిచ్చాను. “దిస్ స్వీట్ సిక్ నెస్” (పాట్రిసియా హైస్మిత్) పుస్తకాన్ని ఎ.వి. రెడ్డిశాస్త్రిగారు నాకిచ్చారు. దీనిని చాలాచాలా రోజులుగా చదవాలని అనుకుంటుండగా – ఇది కేవలం నవలగానే ఆసక్తి గొలిపేది కాదు, ఇంకా నా పరిశోధనలో కూడా కీలకమైనది – నాకీ పుస్తకం అందించిన సార్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

అవుట్ లుక్. సినీ పత్రికలేవీ నాకు నచ్చవు. ఎందుకంటే సమాచారం గానీ, విశ్లేషణ గానీ వాటిల్లో దొరకదు – కేవలం గాసిప్స్ తప్ప.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

మళ్లీ “ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ” నే చెప్పి వుండేవాడిని, కానీ నా స్నేహితులు, సహ విద్యార్థులు చాలామందికి ఇవే రకమైన సమస్యలు ఈ నవల విషయంలో ఎదురవుతున్నాయి కనుక దీనిని విడిచిపెట్టేయ వచ్చనుకుంటా. అంచేత “డావిన్సీ కోడ్” (డాన్ బ్రౌన్), “ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్” (అరుంధతీ రాయ్) లను ప్రస్తావిస్తాను. I positively hated Roy’s novel. The imagery that she uses is disgusting, and generally I don’t like books with a political agenda. ఇక మొదటి మొదటి నవలంటారా అది మరీ  predictable, silly దానిని intelligent suspense thriller అని కితాబివ్వడం నవ్వు తెప్పించే విషయం. 

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

నేనిప్పుడు “ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్” (స్కాట్ టరో-Scott Turrow)ను చదువుతున్నా.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ఆహా! నా ఫేవరిట్ పుస్తకాల జాబితాలో చెప్పినవన్నీ నన్ను ప్రభావితం చేసినవే. వాటికితోడు “ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ మర్డర్” (జేడ్ రూబెన్ ఫెల్డ్), “టెస్ ఆఫ్ ది డెర్బర్ విల్స్” (థామస్ హార్డీ), “ది ట్రయల్” (ఫ్రాంజ్ కాఫ్కా), “ఏన్ ఇన్ స్టెన్స్ ఆఫ్ ది ఫింగర్ పోస్ట్” (లయన్ పియర్స్), “ది క్రానికల్ ఆఫ్ ఏ దెత్ ఫోర్ టోల్డ్” (గాబ్రియా గార్షియెల్ మార్క్వెజ్) రచనలు కూడా.

ప్రకటనలు

4 responses »

  1. అయ్యో మీకు గాడాఫ్ స్మాల్ థింగ్స్ నచ్చలేదా? ఐతే మీతో భేటీ వేసుకోవలసిందే. 🙂
    అవునూ, మీ రీసెర్చిలో Randor Guy నవల్లు కథలు ఏమన్నా పరిశీలిస్తున్నారా?

  2. పైన చెప్పిన పుస్తకాల్లో ఒక్క పేరు తెలిస్తే ఒట్టు!

    అన్నట్టు గాడాఫ్ స్మాల్ థింగ్స్ నన్నూ అంతగా ఆకట్టుకోలేదు, రెండు సార్లు చదివినా కూడా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s