నా రెండో కవిత ‘వందనం’…

సాధారణం

చాలారోజుల కిందట నా మొదటి కవిత (ఇసుక దొంగలు) ను మీకు వినిపిస్తే, పరవాలేదన్నారు. కిందటేడాది ఉగాది సందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వినిపించిన కవిత అది. తరువాత ఆ కవితలను “సర్వజిత్ సంకల్పం” పేరుతో పుస్తకంగా ప్రచురించారు. నా రెండో కవితను “తూరుపు” కళింగాంధ్ర కవితా సంకలనం కోసం సంపాదకులు రాయమంటే రాశాను. అదే ‘వందనం’. ఇవ్వాళ దానినే మీ పైకి వదులుతున్నాను. మరి చదవండి…

వందనం!

దేవుడి దెయ్యం ఇద్దరూ శక్తిమంతులే

పైగా సమానంగా

అన్ని రంగాలలో లక్షలాది ఉద్యోగాలు

వెల్లువలాగా విదేశీ కంపెనీలు

అప్పులుగా కోట్లకొద్దీ డబ్బులు

పేదరికాన్ని మాడ్చి మసి చేసెయ్యాలనే తాపత్రయం

ఓహో…ఓహొహో…

గ్లోబలైజేషన్ దేవుడూ నీకు వందనం!

దేవుడి దెయ్యం ఇద్దరూ శక్తిమంతులే

పైగా సమానంగా

ఢిల్లీనుంచి గల్లీదాకా ఒకటే సమాచార వెల్లువ

నాలుగు లైన్ల రోడ్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు,

ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యుత్తూ

చదువుకొనడానికీ చదువుకోడానికీ లెక్కలేనన్ని పథకాలు

అందరినీ అన్ని రంగాల్లో సమానం చేసెయ్యడానికి

సమగ్ర వ్యూహాలూ అభివృద్ధి ప్రణాళికలూ

ఓహో… ఓహొహో…

గ్లోబలైజేషన్ దేవుడూ నీకు వందనం!

దేవుడి దెయ్యం ఇద్దరూ శక్తిమంతులే

పైగా సమానంగా

మూతపడిన దేశీయ పరిశ్రమ

అదృశ్యమైన ప్రాంతీయ మార్కెట్

రోడ్డునపడ్డ కార్మికుడు

ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు

పేరుకుపోయిన అప్పులూ వాటికి వడ్డీలు

అయ్యో… అయ్యయ్యో…

గ్లోబలైజేషన్ దెయ్యమా నీకు వందనం!

దేవుడి దెయ్యం ఇద్దరూ శక్తిమంతులే

పైగా సమానంగా

ఊదిన గాలిబూరలా భీతిగొలిపే షేర్ మార్కెట్

జీవనదుల్లాంటి గంగిగోవుల్లాంటి ప్రభుత్వ సంస్థలు ఖాయిలాలు

ప్రైవేటు మోహినివైపు ప్రజా ప్రభుత్వాల గుడ్డిపరుగులు

ఛిన్నభిన్నమైన కుటుంబ వ్యవస్థ

ఛిద్రమైన మానవ సంబంధాలు

అయ్యో… అయ్యయ్యో…

గ్లోబలైజేషన్ దెయ్యమా నీకు వందనం!

 దేవుడనే దెయ్యమా – దెయ్యమనే దేవుడా

నీకు వందనమెందుకో తెలుసా! 

కులాలు మతాలు దేశాలు రంగులు ఆదర్శాలు ఆశయాలు

ఎన్నో అన్నింటి కోసమూ

మరిన్ని సంకుచిత గోడలు మొలిపించుకుని

ముక్కలు ముక్కలై చెక్కలు చెక్కలై

మహా మానవ సమూహాన్నంతా

నువ్వే… నిజంగా నువ్వే

ఏకం చేస్తున్నావు.

సిడ్నీ బీజింగ్ ఢిల్లీ శ్రీకాకుళం చెచెన్యా

క్యూబా మెక్సికో అర్జెంటీనా ఇథియోపియా

నికరాగువా… ఇంకా ఇంకా…

ఇప్పుడన్నింటా అన్నిచోట్లా

మనిషి బాధలొక్కటే, వెతలొక్కటే, కతలొక్కటే

 

గ్లోబల్ మనుషుల్ని, గ్లోబల్ని గాథల్ని చేశావు

అందర్నీ ఒక్కటి చేశావు, ఏకం చేశావు

అందుకే నీకు వందనం.

ప్రకటనలు

2 responses »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s