పద్నాలుగో వారం చదువు ముచ్చట్లు కొత్తపాళితో…

సాధారణం

‘నాసి’ గా సాహితీ మిత్రులకు చిరపరిచితులైన నారాయణ స్వామి బ్లాగు పాఠకులకు మాత్రం కొత్తపాళి గా సుపరిచితులు. ఇదికాక బత్తీబంద్ , విన్నాకన్నా బ్లాగులు కూడా మెయింటెయిన్ చేస్తున్నారు. ఇదికాక “ఈమాట” పత్రికను కూడా నిర్వహిస్తున్న కొత్తపాళి ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. దాదాపుగా అన్ని బ్లాగులూ ఫాలో అవుతూ అందర్నీ ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో సాహితీ, ముఖ్యంగా తెలుగు భాషా పరివ్యాప్తికి కృషి చేస్తున్న కొత్తపాళి చదువు ముచ్చట్లు ఈ వారం మీకోసం…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
నాతో అలా అనిపించడం చాలా కష్టం. ఎందుకంటే .. కథ అని పేరు పెట్టి ఏం చెత్త రాసినా చదివేస్తాను. బాగుంటే అది ఒకరకమైన ఎంజాయ్‌మెంటు. బాలేకపోతే ఇంకో రకమైన ఎంజాయ్‌మెంటు.
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

కొని చదవడం పూర్తిచేసిన పుస్తకం కుషియెల్స్ డార్ట్ (Kushiel’s Dart) అనే ఫేంటసీ నవల. కొని ఆరారగా చదువుతున్న పుస్తకం పాల్ క్రుగ్మాన్‌ (Paul Krugman, most recent nobel prize winner for Economics) రాసిన వ్యాస సంకలనం The Accidental Theorist and Other Dispatches from the Dismal Science

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

ఈ మధ్య లెక్కపెట్టలేదు. వెయ్యి రెండు వేల మధ్య ఉండొచ్చు. తెలుగు ఆంగ్లం సగం సగం ఉంటాయి. ఎక్కువగా ఫిక్షను. కొంత కవిత్వం, వివిధ విషయాల పైన వ్యాసాల సంకలనాలు, ఇత్యాది. ప్రపంచ భాషల సాహిత్యన్నించి అనువాదాలు కూడా బాగానే ఉన్నాయి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

చాలా ఉన్నాయి. మధురాంతకం రాజారాం గారి కథల సంపుటాలు తెప్పించాను. హేరీ పాటర్ తరవాత అమెరికాలో ఇంచుమించు అలాంటి సంచలనం సృష్టించిన ట్వైలైట్ సిరీస్ చదవాలని ఉంది కానీ సమయం కుదరడం లేదు.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

క్లాసిక్ తెలుగు కథలకి శ్రీపాద, కొకు, చాసో
కొంచెం సమకాలికుల్లో పి.సత్యవతి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, డా. వి. చంద్రశేఖరరావు, వివినమూర్తి
నవలా రచనలో ఇంప్రెస్ చేసిన వారెవరూ లేరు. కొన్ని నవలలు చాలా ఇంప్రెస్ చేశాయి .. కొన్ని రేండం పేర్లు .. మాలపల్లి, నారాయణరావు, మూడు కథల బంగారం, మీనా, అనుక్షణికం , విధివిన్యాసాలు
ఒక ప్రక్రియ అని కాక, మంచి రుచి కలిగిన తెలుగు వచనం కోసం .. చలం, రంగనాయకమ్మ, చేరా, బేతవోలు రామబ్రహ్మం
కవిత్వంలో కూడా ఫలానా కవి అనేకంటే కొన్నికొన్ని పద్యాలు చాలా నచ్చాయి. తిలక్ కవిత్వం అంటే మటుకు ఛాలా ఇష్టం. ఆ తరవాత అలాంటి ఇష్టం నా మిత్రుడు విన్నకోట రవిశంకర్ కవిత్వం మీద.
ఆంగ్లంలో ఇదివరలో క్లాసిక్స్ బాగా చదివినా ఇప్పుడు ఎక్కువగా సమకాలీన రచనల్నే ఇష్టపడుతున్నాను. సామాజిక నవలల్లో బుకర్ ప్రైజు గెలిచే నవల్లు నాకు బాగా నచ్చుతాయి అలనాడు Salman Rushdie’s Midnights Children to more recent Yann Martel’s Life of Pi. అట్లాంటిక్ మంత్లీ అనే పత్రికలో పడే అమెరికన్‌ కథానికలు బావుంటాయి. జంపా లాహిరి కథానికల సంపుటి interpreter of maladies చాలా నచ్చింది.
ఇంకా అంతర్జాతీయ రచనల్ని కూడా బాగా యిష్టంగా చదువుతాను.
ఇండియాలో కాలేజిలో చదివే రోజుల్లో రష్యను రచయితలంటే మోజుండేది. ఇప్పుడు ఎక్కువగా జపనీసు, ఆఫ్రికను, దక్షిణమెరికా రచయితలంటే ఆసక్తి.
http://en.wikipedia.org/wiki/Yukio_Mishima
http://en.wikipedia.org/wiki/Gabriel_Garc%C3%ADa_M%C3%A1rquez
http://en.wikipedia.org/wiki/Gordimer
http://en.wikipedia.org/wiki/Achebe,_Chinua

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఒక స్నేహితురాలికి నాలుగో ఐదో పుస్తకాలిచ్చాను. ఆ స్నేహితురాలు నాకు ఒక పుస్తకం ఇచ్చింది. మా పిల్లలకి మిత్రుల పిల్లలకి చాలానే ఇచ్చాను. డబుల్స్ ఉన్న తెలుగు పుస్తకాలన్నీ ఆ మధ్య జరిగిన మా క్లబ్బు పదో వార్షికోత్సవ సమావేశంలో అమ్మేసి ఆ డబ్బులు క్లబ్బుకి విరాళం ఇచ్చాను.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నేను సంపాదకుడిగా ఉన్న పత్రికని కూడా చెప్పుకోవచ్చా? 🙂

అంధ దేశంలో నడిచే అచ్చు పత్రికల సంగతి నాకంతగా తెలీదు. తెలిసిన పత్రికలేవీ నన్ను ఇంప్రెస్ చెయ్యలేదు.
జాలపత్రికల్లో ఈమాట, కౌముది, పొద్దు మంచి క్వాలిటీ మేంటేన్‌ చేస్తున్నారు.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

See answer to 1 .. I basically don’t subscribe to the concept of “like and dislike”.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

The Closers, a murder mystery by Michael Collins.
ఇతనివి మూణ్ణాలుగు నవల్లు ఇంతకు ముందు చదివాను. చాలా బాగా రాస్తాడు.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ప్రభావితం అంటే .. నా ప్రవర్తన మార్చుకోవడం అయితే .. Ray Kurtzweil రాసిన Fantastic voyage   ఆలోచనలు రేకెత్తించడం వరకు ఐతే .. నేను చదివే ప్రతి పుస్తకమూ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తూనే ఉంది.

11. ఒకసారి చదవడంతో తనివి తీరని పుస్తకం ఏదన్నా ఉందా?

ఒకటి కాదు, నాలుగున్నాయి. శ్రీపాద ఆత్మకథ .. అనుభవాలూ జ్ఞాపకాలూనూ; చలం మ్యూజింగ్స్; అడివి బాపిరాజు నారాయణరావు; సత్యం శంకరమంచి అమరావతి కథలు. ఈ నాలుగు పుస్తకాల్లో ఏదో ఒకటి ఎల్లప్పుడూ నాతో ఉంటుంది. రేండంగా ఏదో ఒక పేజీ తెరిచి కాసేపు చదువుకుంటాను. చాలా ఆహ్లా్దంగా ఉంటుంది.

ఒక స్పందన »

  1. నాకు నచ్చిన కొన్ని పుస్తకాలు (అమరావతి కథలు, మ్యూజింగ్స్, అనుక్షణికం) కొత్తపాళీ గారి list లో ఉన్నందుకు… నా అభిరుచిని నేనే మెచ్చుకుంటున్నాను.

  2. కొత్తపాళి గారు ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయన రచనల్లో తెలుస్తుంది. అలాగే ఆయనలో ఉన్నopenmindedness నాకు చాలా నచ్చుతుంది. ఆయన బహుముఖ ప్రగ్నాశాలి. సున్నిత హాస్యప్రియత్వం, ప్రోత్సహించే గుణం ఆయన నైజం. he is a fantastic blogger. తెలుగు బ్లాగ్ లోకానికే ఆయన మహరాజు. ఎందుకో నా మనసులో మాట చెప్పాలనిపించింది. thanks కొత్తపాళీ గారు. we look up to you.

  3. పద్మ గారూ, ధన్యవాదాలు! 🙂
    కానెల్లీ యె .. రాస్తున్నప్పుడు గుర్తించుకోలేదు గానీ, మళ్ళి తిరిగి చదువుకున్నప్పుడు ఈ పేరేంటో సజావుగే లేదే అని కొంచెం అనుమానం వచ్చింది. తర్వాతి రెండు నవల్లూ??

    చరిత్రలో నాకు ఇద్దరు ప్రముఖ వ్యక్తులున్నారు మైకెల్ కాలిన్స్ పేరుతో.
    ఒకాయన ఐరిష్ నాయకుడు.
    రెండో ఆయన వ్యోమగామి అపోలో 11 చోదకుడు.

    తెలుగు అభిమానికి .. మీ అభిమానానికి ధన్యుణ్ణి.

Leave a reply to Purnima స్పందనను రద్దుచేయి