పదిహేనో వారం చదువు ముచ్చట్లు యాళ్ల అచ్యుతరామయ్యతో…

సాధారణం

“రేవు” నవలా రచయిత జి.ఎస్. చలం పరిచయం చేసిన మంచి పుస్తకాలలో “ఆమె నవ్వు” కథల సంపుటి ఒకటి. ఆ పుస్తకం చదివి ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రానికి నేను రాసిన వ్యాసం చలానికి అంతగా నచ్చకపోయినా ఆయన మిత్రులు, ఆ కథల పుస్తక రచయిత అయిన యాళ్ల అచ్యుతరామయ్య అనే ఒక మంచి స్నేహితుని పరిచయం చేసింది. హైదరాబాదులోని కాలుష్య నియంత్రణ మండలిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అచ్యుతరామయ్య గొప్ప ప్రగతిశీల దృక్పథమున్న కథకుడు. మరో సంపుటానికి సరిపడా కథలు రాసిన ఆయన నుంచి త్వరలో మరో మంచి కథల పుస్తకాన్ని ఆశించవచ్చు. గొప్ప పాఠకుడు కూడా అయిన అచ్యుతరామయ్యగారితో చదువు ముచ్చట్లు ఈ వారం…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

సమస్య లేదు. అలాంటి పుస్తకాన్ని వెంటనే విసిరి పారేస్తాను.
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఓషో రాసిన “జోయ్”. ఎన్. సూర్యకుమారి చక్కటి తెలుగులో అనువాదం చేశారు.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

దాదాపుగా నాలుగు వేల దాకా (దుప్పల రవికుమార్ దగ్గరున్న పుస్తకాలతో కలిపి)

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

కిరణ్ బేడీ రాసిన “ఐ డేర్”, స్టీఫెన్ కోవే రాసిన “సెవెన్ హేబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్”.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

కొకు, చలం, రంగనాయకమ్మ, ఓల్గా, పతంజలి, నామినిలంటే చాలా ఇష్టం. “రామాయణ విషవృక్షం” (రంగనాయకమ్మ), “ప్రయోగం” (ఓల్గా) పుస్తకాలన్నా ఇష్టమే.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

మూడిచ్చి రెండు పుచ్చుకున్నా.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

ప్రస్థానం. రెండో భాగానికి జవాబు జెప్ప.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

జెడి శాలింజర్ రాసిన “నైన్ స్టోరీస్”.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి? 

“మంచులోయ” (ఒమ్మి రమేష్ బాబు), “సంవిధానం” (గుడిపాటి), “సెలెక్టెడ్ స్టోరీస్” (సదాత్ హసన్ మాంటో).

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

“రామాయణ విషవృక్షం” (రంగనాయకమ్మ), “యువర్ ఎర్రానస్ జోన్స్ (Your Erroneous Zones)” (డా. వేయాన్ డయర్ Dr. Wayne W. Dyer).

ప్రకటనలు

One response »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s