రాయలసీమ నెత్తుటి బతుకు చిత్రం

సాధారణం

వివేకానందుడు తన సోదర శిష్యుడికి రాసిన ఓ ఉత్తరంలో ఈ భూమ్మీద దేవుడి పేరుమీద జరిగినంత రక్తపాతం మరింక దేనిమీదా జరగలేదంటాడు. ఈ వేళ ప్రపంచమంతటా, ప్రత్యేకంగా భారతదేశంలోనూ హింస రాజ్యమేలుతోంది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రజల జీవితాల్లో రేపుతున్న అల్లకల్లోలం ముందు ఏ ఉగ్రవాద దుశ్చర్యలూ సరితూగవు. అందుకే ప్రభుత్వ చర్యలను ఇప్పుడు మనం డెవలప్ మెంట్ టెర్రరిజం అని పిలుస్తున్నాం. వీటికి తోడుగా రాజకీయ పార్టీలు స్వయంగా స్వలాభం కోసం పెద్ద ఎత్తున హింసను ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలనదగ్గ హిదుత్వ సంఘాలు కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాలలో జరుపుతున్న తీవ్ర దుశ్చర్యలు మానవత్వమున్న వారికి ఆందోళన కలిగించకమానవు.

హిందువులు అసలే కాని గిరిజనులను, హిందుత్వంతో విసిగి వేసారి క్రైస్తవం స్వీకరించిన బహుజనులను తిరిగి హైందవంలోకి రాబట్టే ‘ఘన కార్యాన్నిఘిందుత్వ సంస్థలు నిస్సిగ్గుగా నెరవేరుస్తున్న తీరును మన అగ్రకుల దురహంకార మీడియా స్వార్ధ ప్రయోజనాలతో అంతగా ఫోకస్ చేయట్లేదు గాని, జరుగుతున్న దురాగతాలు ప్రజలకు చేరుతునే ఉన్నాయి. తమ ఉనికిని, స్వార్ధ ప్రయోజనాలను కాపాదుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ ను బూచిగా చూపించే తీవ్ర గుంజాటనలో ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి తెలుగు పత్రికలు తలమునకలై వుంటే, దీన్ని తిప్పికొట్టే విఫలయత్నంలో సాక్షి, ఆంధ్రప్రభ లాంటి పత్రికలు నానాపాట్లు పదుతున్నాయి. అందుకే నాలుగు దినపత్రికలు కలిపి చదివినా నిజంలో నాలుగో వంతు ప్రజలకు తెలియడంలేదని మనం ఆందోళన పడుతున్నది. గుజరాత్ ను ఓ ప్రయోగశాలగా భావించి చేసిన ప్రయోగాలు ఘన విజయాలు సాధించిన తర్వాత అవే ప్రయోగాలను విస్తరించే ఉద్దేశంతో కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలను హిందుత్వ సంస్థలు ఎంచుకున్నాయా అని అందరూ అనుమానిస్తున్నారు. మతమంటేనే సామాన్యుడు ఆమడదూరం పారిపోయేలా చేస్తున్నాయి మన రాజకీయాలు.

ఇక దేవుడి పేరుమీద జరిగిన ఈ హింస తర్వాత స్థానాన్ని అక్రమించేది మనిషి స్వార్థంతో, మూర్ఖత్వంతో చేపడుతున్న దుర్మార్గం. దాని పేరు మన తెలుగునేలపై ఫ్యాక్షనిజం. రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా రాయలసీమ గడ్డపై ఈ నెత్తుటి చరిత రక్తాక్షరలతో లిఖించబడడానికి కారణమేమిటనేది అలోచనపరులకు ఆసక్తి కలిగిమ్చే అంశం. 29 ఏళ్ల యువకుడు వేంపల్లి గంగాధర్ ఈ అంశంపై లోతుగా దృష్టి సారించి తన ఆలోచనలను “హిరణ్య రాజ్యం” పేరున మనతో పంచుకున్నారు.

హిరణ్యమంటే బంగారమని అర్థం. చరిత్రపుటల్లో రాయలసీమను హిరణ్య రాజ్యమని కీర్తించారు. ఈ హిరణ్య రాజ్యంలో పరిస్థితి ఇప్పుడెలా వుంది? ఈ నేల ఎందుకిలా తయారయింది? మానవ వైరానికి అంతేలేదా? వాముకు వాము, పంటకు పంట, పశువుకు పశువు, మనిషికి మనిషి తెగ నరుక్కునే తీవ్ర హింస-ప్రతిహింసలకు కారణాలేమిటి? ఈ నిరంతర నరమేధం రావణకాష్టంలా రగులుకునే ఉండడానికి ఆజ్యం పోస్తున్నదెవరు? ఈ పగలకు, శత్రుత్వానికి, వైమనస్యానికి అనుక్షణం బితుకు బితుకుమంటూ గడిపే రాయలసీమ ప్రజల హృదయల్లో స్వేచ్ఛాకుసుమలు విరిసేదెన్నడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానలు వెతుకుతూ, మరెన్నో ఆలోచనలను మనకు అందించేందుకు వేంపల్లి గంగాధర్ చేసిన ప్రయత్నమే ఈ “హిరణ్య రాజ్యం”.

అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు (1970 ఫిబ్రవరి 2 నాడు కర్నూలు నుండి విడివడి కొత్తగా ఏర్పడిన) ప్రజాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం తాలూకాలతో కలిపిన ప్రాంతమే రాయలసీమ. 1800కు ముందు వీటిని సీడెడ్ జిల్లాలని, దత్తమండలాలని పిలిచేవారు. ప్రబంధ కాలంలోవున్న రాయలసీమ పేరును శ్రీకాకుళ జిల్లావాసి చిలుకూరి నారాయణరావు 1928లో ఖాయంచేసి స్థిరపరిచారు. ఘన చరిత్ర కలిగిన రాయలసీమ స్వాతంత్ర్యం వచ్చేనాటికే మనుషుల స్వార్థపరత్వపు తీవ్రతను భరిస్తోంది. కొన్ని గ్రామాలను ఒక సముదాయంగా చేసి దానికి ఒక పాలెగాణ్ణి నియమించే సంప్రదాయం నాయక రాజుల కాలంనాడే మొదలైంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ పాలెగాళ్లకు లభించిన మరిన్ని అధికారాలు, రాజులు మారుతున్న కొద్దీ అపరిమితంగా పెరిగాయే గాని తగ్గలేదు. బ్రిటిషు పాలనకు వచ్చేసరికి ఈ పాలెగాళ్ల వ్యవస్థ ప్రబల రాజ్యేంగతర శక్తిగా ఎదిగిందంటే వారెంత విశృంఖలంగా ఇటు ప్రజలను, అటు ప్రభువులను లొంగదీసుకున్నారో తెలుస్తుంది. గమ్మత్తుగా వీరిపట్ల జానపద సాహిత్యంలో ప్రేమ ద్వేషపు కలగలుపు మిశ్రమ భావాలను మనం గమనిస్తాం. శిస్తులు వసూలు చేయడంలో అత్యంత పాశవికంగా ప్రవర్తించిన వీరే తమ స్వతంత్రానికి ముప్పు వస్తుందనుకున్నపుడు అంతే కిరాతకంగా తమ శత్రువులను ఎదుర్కొన్నారు.

1800లో నిజాం పాలననుంచి పూర్తిగా బ్రిటిషు పాలనకు రాయలసీమ చేరుకుంది. అదే ఏడాది థామస్ మన్రోను దత్త మండలాలకు ప్రిన్సిపల్ కలెక్టరుగా ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించింది. అక్కడి పరిస్థితులను అవలోకనం చేసుకున్న మన్రో పాలెగాళ్ల వల్ల పాలన వ్యవస్థ దుర్భరంగా తయారైందని గమనించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదాయాన్ని పెంచాలనుకున్నాడు. వెంటనే పాలెగాళ్లపై ఉక్కుపాదం మోపాడు. రైత్వారీ శిస్తు పద్ధతి ప్రవేశపెట్టాడు. పాలెగాళ్లను తరమడం మొదలుపెట్టాడు. ఈ దశలో పాలెగాళ్లు జనాన్ని సమీకరించి బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా నడిపారు. అందులో ప్రముఖంగా వినిపించే పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిని ఉరితీసింది. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో విడివిడిగా, సమష్టిగా పాలయగాళ్ల స్వతంత్ర పోరాటాలు జరిగాయి. దీనిని రెండు విధాలుగా చూడడం అవసరం. ఇదే పాలెయగాళ్ల దురాగతాలు భరించలేక పొలాలను, గ్రామాలను సైతం విడిచిపెట్టి ప్రజలు పారిపోయిన సంగతి మరవకూడదు. వారు కూర్చున్న చోట కిందకు నీరొచ్చేసరికి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, వారిలో దేశభక్తి నూరిపోయడమే కాకుండా తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడం మరవకూడదు.

మొత్తానికి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత అంతరించి పోవాల్సిన పాలెగాళ్ల వ్యవస్థ రూపు మార్చుకుని ఫ్యాక్షన్ వ్యవస్థగా వేళ్లూనుకోవడం విషాద వాస్తవం. దానికి మన రాజకీయ వ్యవస్థ మరింత జవజీవాలను అందివ్వడం మన దురదృష్టం. అసమ అభివృద్ధి క్రమంలో ఈ వెర్రికి మరింత ఊతం లభించడం మనమందరం గుర్తించాల్సిన, గర్హించాల్సిన అంశం.

వర్గ ఆధిపత్యపోరులో తమ వర్గం నాయకుడికి రాజకీయ హోదా కూడా కట్టబెట్టాలనే తలంపుతో వున్నప్పుడే పల్లెల్లోని వర్గాల్లోకి రాజకీయ పార్టీలు ప్రవేశం చేసాయి. ఒక్కో వర్గం ఒక్కో రాజకీయ పార్టీని ఆశ్రయించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పదింది. ఒక్కొక్కరు తమ చుట్టూ మందీ మార్బలాన్ని పెంచి పోషించుకోవాల్సిందే. మొదట లావు కట్టెలతో తిరిగే ఈ అనుచర గణం, క్రమంగా వేట కొడవళ్లు, కత్తుల నుమ్చి పొడుగు గొట్టపు తుపాకుల మీదుగా ఇప్పుడు ఖరీదైన పిస్టల్, తుపాకులతో తిరగడం వరకు ఎదిగారు. పల్లెల్లో జరిగే చిన్న చిన్న తగాదాలు, పంచాయతీలు నెరవేర్చే ఫ్యాక్షన్ పెద్ద మనుషులు క్రమంగా భూముల సెటిల్మెంట్ల నుంచి భూముల, ఆస్తుల ఆక్రమణలు, సారా కాంట్రాక్టుల స్థాయినుంచి చట్టసభల్లోకి వెళ్లడం వరకు అవన్నీ మన కళ్లముందే జరిగిపోతున్నాయి.

రాయలసీమలో ఒక జిల్లా అయిన అనంతపురం రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా. రానున్న వంద సంవత్సరాల లోపే అనంతపురం ఒక ఎడారిగా మారనున్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 150 ఏళ్లలో 60 ఏళ్లకు పైబడి కరువు పీడిత ప్రాంతంగా విలవిల్లాడుతున్న అనంతపురంతో పాటు, నీటి వసతులు లేక పొలాలు బీళ్లుగా మారిన దృశ్యాలు కడప, కర్నూలులో ఎక్కడపడితే అక్కడే దర్శనమిస్తాయి. చోద్యం చూస్తున్న ప్రభుత్వం ఇందుకు చేస్తున్నదీ ఏమీ లేదు. ఇలా అసమ అభివృద్ధి పుణ్యమా అని ఒకప్పటి రతనాల సీమ ఇప్పుడు రాయలసీమగా మారింది. సీమ ప్రధానమ్గా కరువు ప్రాంతం. ఆర్థిక వెనుకవాటుతనం వల్ల అవిద్య, అనారోగ్యం సహజ లక్షణాలుగా వచ్చాయి. దాంతో వచ్చిన నిరుద్యోగ సమస్య సహజంగానే యువతను ఫ్యాక్షన్ నీడను ఆశ్రయించేట్టు చేస్తోంది.

నెత్తుటి సీమలో జరుగుతున్న హింస ప్రతిహింసల గొలుసు చర్య మూలాన్నీ, క్రమాన్నీ అర్థం చేసుకోకుండా దాన్ని ఛేదించడం, పరిష్కరించడం సాధ్యం కాదనే అంశం మనం గుర్తించాలి. దీనికి విరుగుడుగా మనం ఆలోచనలు జరిపినప్పుడు సహజంగానే అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాలను చూసి మనకు అసహనం, ఈర్ష్యలు కలిగి మనకూ ప్రత్యేక రాష్ట్రం వస్తే మన సమస్యలు పరిష్కరించుకుంటామ్ కదా అనిపిస్తుంది. కానీ, ఫ్యాక్షన్ సమస్యకు అది పరిష్కారం కాదు. ప్రజల్లో ఎరుక కలిగించాలి. నిరుద్యోగాన్ని రూపుమాపాలి. ఫ్యాక్టరీలను స్థాపించాలి. విద్యావంతులను చేయాలి. నీటి వసతులను సమకూర్చాలి. పంటలు పండేలా, అవి రైతులకందేలా, వాటికి గిట్టుబాటు ధర లభించేలా చూడాలి. ఇవన్నీ ప్రభుత్వం స్వయంగా పూనుకుంటేనే గాని సాధ్యం కాని పనులు.

ఇలాంటి మరెన్నో ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో అందించిన వేపల్లి గంగాధర్ నిజంగా అభినందనీయులు. ఈ పుస్తక రచనలో కొన్ని తప్పులుండవచ్చు గాక్, వాటన్నింటిని మనం మన్నించి ఇలాంటి భావాలను విస్తృతంగా ఆహ్వానించాలి. ఇంకొంచె శ్రద్ధ వహిస్తే మరింతగా ఎడిట్ చేసి మరిన్ని తక్కువ పేజీల్లోనే ఈ విలువైన సమాచారాన్ని అందించే వీలయ్యేది. ఒక్కో విషయాన్ని రెండు మూడు మార్లు చెప్పడం కూడా అభ్యంతరకరంగా భావించవచ్చు. తన నేలతల్లిపై ప్రేమను పెంచుకుంటూ, సమాజహితాన్ని కోరే క్రమంలో వున్న యువ రచయిత చరిత్ర రచన శాస్త్రపు అధ్యయనంపై దృష్టి సారించాలి. పాలెగాళ్ల ఎదుగుదల క్రమాన్ని ఒకే పుస్తకంలో నాలుగైదు సార్లు వివరించినప్పుడు మనకు ఆవులింతలు రాకుండా వుండడానికైనా రచయిత హిస్టరియోగ్రఫీని అధ్యయనం చేయాలి. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ఫ్యాక్షన్ జీవితం ఆరంభమైందెప్పుడు? పేజీ 80లో 1970 అని, పేజి 84లో 1975 అనీ రాశారు. పుస్తకం పూర్తయ్యాక రచయిత పాలెగాళ్లను ఆరాధిస్తున్నారో, అసహ్యించుకుంటున్నారో అంతు చిక్కదు. సమర్ధవంతంగా, శక్తివంతంగా అని రాశారు. సమర్థంగా, శక్తిమంతంగా అనడం సబబేమో. ఇవనీ భూతద్దంలో చూసిన సంగతులు. ఇలాంటి తప్పుగా పరిమితంగా ఈ పుస్తకంలో వున్నాయి. ఒకవేళ వేలాదిగా వున్నాసరే, ఈ పుస్తకాలను ఆహ్వానించాల్సిందే. అది తక్షణ చారిత్రాకవసరం.

ఇక ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన మాసీమ రాజగోపాల రెడ్డి అనివార్యంగా ‘ప్రత్యేక’ ఆలోచనల్లోకి వెళ్లారు. రాష్ట్ర వైశాల్యంలో తెలంగాణ 41.80 శాతం, రాయలసీమ 26.36 శాతం, కోస్తా 23.94 శాతం ఆక్రమించినా అభివృద్ధి విషయంలో అంతా రివర్స్ గా వుందని వాపోతారు. విస్తీర్ణం, నదులు, నీటి లభ్యత, ఖనిజాలు, ఇతర వనరులు గురించి ప్రస్తావించిన పరిచయ కర్త ఈ వాక్యంతో వ్యాసం ముగిస్తారు. “కావున అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి, పరిగణనలోనికి తీసుకుని, మన సంగతేమిటో తేల్చుకోవలసిన అవసరమెంతైనా వున్నది”. బహుశా ఆయన ఏం చెప్తున్నారో అర్థమైందనే అనుకుంటున్నాను. అసమ అభివృద్ధి క్రమంలో మన మన స్థానాలేమిటి, మన బతుకు తీరులేమిటి? మన భవిష్యత్తులు ఏమిటి? వంటి ప్రశ్నలు మనలో తలెత్తుతాయి.

తేలికైన మాటలతో, సూటిగా, స్పష్టంగా రాయలసీమ ఫ్యాక్షనిజం చారిత్రాత్మక నేపథ్యం, పరిణామ క్రమం – విశ్లేషణను “హిరణ్య రాజ్యం”గా అందించిన వేంపల్లి గంగాధర్ పుస్తకం మనం చదవడమే కాక, మన మిత్రులచేతా చదివించాలి. మానవీయ ఆలోచనలను వ్యాప్తం చేయాలి.

50 రూపాయలు విలువ చేసే ఈ పుస్తకం కావాలనుకున్నవారు డా. పి. ఆదర్శరెడ్డి, చైర్మన్, శ్రీ పి.టి.వీరారెడ్డి ఫౌండేషన్, 21-460, పి.పి. స్ట్రీట్, ఏడు రోడ్లు, కడప – 516001 చిరునామాకు సొమ్ము పంపి తెప్పించుకోవచ్చు. లేదా రచయితకు ఫోన్ (9440074893) చేయవచ్చు.

(వీక్షణం మాసపత్రిక ఫిబ్రవరి ’09లో ప్రచురితం)

ప్రకటనలు

3 responses »

  1. dear sir, ur review is good this book “hiranya rajyam” is nice.the new points that who are factionist and from where they are coming and how they become factionists i under stand by ur review,the information is good and i hope it is write,and the issue regarding separaton of rayalaseema as writer said it is not right

    and as usual u once again rocked by ur writing style by adding vivekanadas words those words really makes me to think, thanq for sucha a wonderfull words, and try to add somme more in ur further reviews

  2. A pusthakam matemo kani ikkada anavasaramuga hinduvulu kani dalithulo leka Gujarathlo prayogalanu nissiggu ga Andhralo karnatakalo no balavantham ga rudde hindu samsthalu ee bhoomi meeda ekkadunnayo naku theliyadu kani, gadachina 50 years lo hindu mathanni vadali christianity loniki conversions ayyayo leka christianity (Asalekkada puttindo mari?) nunchi hindu matham loniki conversions ayyayo vignulaina vari kandariki thelusu. Asalu agra kulalalanu pakkaki pedithe, Christianity loniki convert aina dhanavanthulu mari ee dalithulaku emi seva chesthunnaro evaraina cheppa galara? Agra kulalanu thidithe adoka fasion. Kulam lo emi ledu. Ippudu unnvi rende vargalu — dabbunnodu, dabbu lenodu. Evargam lo kuda dabbunnodu dabbu lenodini eppudu duram ga ne unchuthadu. Daniki matham ledu, kulam ledu. Hindu matham nijam gane ilanti dhorani tho unte ee desam lo ematham free ga brathikedi kadu. Okasari middle east ni chusi matladatam nerchukondi. Methakaga unde hinduvulananadam kadu. Gujarat charithra lo eroje kadu eroju christianityki sthanam ledu. Akkdai development ni chusi matladali. Akkada emi naramedhalu jaragatam ledu. Eppudo edo ayindani 12 years tharuvatha dani gurinchi matladithe vinataniki evaru pichi vallu kadu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s