పదహారో వారం చదువు ముచ్చట్లు జ్యోతక్కతో…

సాధారణం

తెలుగు బ్లాగావరణంలో ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని జ్యోతక్కతో ఈ వారం చదువు ముచ్చట్లు. ఆమె గృహిణిగా కర్తవ్యాలు నిర్వహిస్తూనే మరోవైపు దాదాపుగా తెలుగు బ్లాగులన్నీ చదువుతూ వాటి బాగోగులను చర్చిస్తూ, ప్రోత్సహిస్తూ, దాదాపుగా ఒక మోడరేటరుగా వున్నారంటే అతిశయోక్తి కాదు. ఇవేకాక తనపేరుతోనూ, షడ్రచులు పేరుతో మరో బ్లాగునూ నిర్వహిస్తున్నారు. మరి ఆమె చదువు ముచ్చట్లు వినండి…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి) 

బోర్ కొట్టించిన పుస్తకం అంటే.. అస్సలు నేను మొత్తం చదివితే కదా ఎందుకు చదివానురా అనుకోవడానికి. పది పేజీలు చదవగానే బోర్ కొట్టి, అర్థం కాకుంటే దాన్ని పక్కన పెట్టేస్తాను. ఇక దాని పేరెందుకు గుర్తుంటుంది. (క్లాసు పుస్తకాలైతే చచ్చినట్టు చదవాల్సిందే కదా బోర్ కొట్టినా. అవి గుర్తుంచుకోక తప్పదుగా.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది? 

కొన్న పుస్తకం, కృష్ణశాస్త్రి సాహిత్యం, ఆకులొ ఆకునై (వాడ్రేవు లక్ష్మిదేవి), చదవడం పూర్తి చేసింది “మునెమ్మ” (కేశవరెడ్డి) (ఈ మధ్య ఈ పుస్తకంపై గొడవ జరుగుతుందంటే, దానిసంగతేంటో చూద్దామని కొని, పట్టు (పుస్తకం) వదలకుండా చదివేశా)

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

300 వరకు ఉండేవి.. సుమారు 30 ఏళ్ల క్రితం నుండి సేకరించిన దాచుకున్న పుస్తకాలు. కాని గత ఏడాది అన్నీ ఇచ్చేసాను.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

ఈ బ్లాగులోకం లోకొచ్చిన తర్వాత తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవాలనుకుంటున్నాను. మంచి పుస్తకాలు కొనాలి. వయస్సుతో పాటు అభిరుచి కూడా మారుతుందేమో. అలాగే బ్లాగులలొ కొందరు మహానుభావులు అలవోకగా పద్యాలు రాసేస్తుంటె నా మాటలు అలా పద్యాలుగా మార్చాలి అని కుతూహలం కలుగుతోంది. తెలుగు వ్యాకరణానికి సంబంధించిన పుస్తకాలు కొనాలనుకుంటున్నాను.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి. 

నాకు చిన్నప్పటినుంది అంటే పుస్తకాలు చదివే వయసు నుండి.. యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి కౌసల్యాదెవి, యండమూరి రచనలంటె చాలా ఇష్టం. కుటుంబ కథలు, సస్పెన్స్ కథలంటే చాలా ఇష్టం.. ఎప్పుడు కూడా లావుగా ఉన్న నవలలే కొనేదాన్ని, అద్దెకు తెచ్చుకునేదాన్ని. ఎక్కువ సేపు చదవొచ్చనే దురాశ..

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు? 

ఎప్పుడూ ఇవ్వలేదు. అలానే తీసుకోలేదు కాని ఈమధ్యే నాకు డాక్టర్ తిరుమలరావుగారు కొన్ని మంచి పుస్తకాలు ఇచ్చారు. నేను కూడా ఒక శ్రేయోభిలాషికి కొన్ని పుస్తకాలు అతని అభిరుచికి తగ్గవి అనిపించి ఇచ్చాను.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

అంధ్రభూమి మాసపత్రిక ఇష్టం. మంచి కథలు, శీర్షికలు ఉంటాయి. మెచ్చనిదంటూ ఏమీ లేదు.

8. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

పోతన “భాగవతం”, కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన “గ్రాండ్ మాస్టర్”, మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన “తాడంకి ది థర్డ్”

9. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ఏవీ లేవని చెప్పవచ్చు. ఎందుకంటె నేను ఎక్కువగా నేర్చుకుంది జీవితం నుండే, పుస్తకాలనుండి కాదు. ప్రత్యక్షంగా ఎదుర్కొన్న సమస్యలు నాకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. ఏదైనా పుస్తకం, నవల, కథ చదివితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎంజాయ్ చేస్తాను కాని అందులొని అంశాలు నన్ను ప్రభావితం చేస్తాయని అనుకోలేదు ఎప్పుడూ.. కొన్ని కధలు బాగా నచ్చితే వాటిని మళ్లీ మళ్లీ ఎన్నిసార్లైనా చదువుతాను. కాని ఆ రాతలవల్ల మాత్రం ఎప్పుడూ ప్రభావితం కాలేదు. 

తాజాకలం: ఉన్న పుస్తకాలన్నీ పంచేసి ఇప్పుఢు మళ్లీ ఎమెస్కోలో చేరాను. మళ్లీ కొత్త లైబ్రరీ తయారు చేయాలనుకుంటున్నా. పట్టుచీరలకంటే ప్రాణంగా, జాగ్రత్తగా పుస్తకాలను చూసుకుంటాను..పుస్తకాల జాబితా తయారుచేయాలి…

ప్రకటనలు

2 responses »

  1. ఎదురు చూసినట్లే పరిచయం వచ్చింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది కూడాను. జ్యోతి గారు కొమ్మనాపల్లి గ్రాండ్ మాస్టర్ చదివిన తరువాత కొంచం దాని కథ సంగ్రహం రాయగలరా??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s