అరవింద్ ఆడిగ తో ఈ వారం చదువు ముచ్చట్లు…

సాధారణం

అవున్నిజమే. తాజా బుకర్ బహుమతి విజేత అరవింద్ ఆడిగతో ఈ వారం చదువు ముచ్చట్లు. ‘అసాసిన్స్…’ ముందే రాసినా, మొదట ప్రచురణ పొందిన నవల “ది వైట్ టైగర్”. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఈ రచనకు మన దేశంలో మాత్రం తిట్లు తప్పలేదు. (ప్రస్తుతం ‘స్లమ్ డాగ్ మిలియనీరు’కు లాగా) జర్నలిజం వృత్తిగా మొదట ఎంచుకున్నా ప్రస్తుతం రచనే ఫుల్ టైం జాబ్ గా ఎంచుకుందామనుకుంటున్నఅరవింద్ ఆడిగ చదువు ముచ్చట్లు వినండి మరి…

 మీకు బాగా ప్రేరణనిచ్చిన పుస్తకం?

ఆర్ కె నారాయణ్ రాసిన ‘ది బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’. ఎప్పుడో అదృశ్యమైపోయిన దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న నాగరకమైన, విరామమైన కుగ్రామానికి, నా మంగళూరు బాల్యానికి తీసుకుపోతుంది. నిజమే, ఆ గ్రామ సౌందర్యం ఇప్పుడు లేదు. 

మీకు నచ్చే రచనా ప్రక్రియ?

నాకు బోర్ కొట్టనిదేదయినా చదువుతాను.

మీ దగ్గర ఎన్ని పుస్తకాలు వున్నాయి?

ఏమో చెప్పలేను, ఎందుకంటే చాలా పుస్తకాలు నావి ఇప్పుడు నా దగ్గర లేవు. నేను ఢిల్లీకి వచ్చినాక అక్కడి ఫ్రెండ్స్ దగ్గర చాలా వుంచేశా. చెన్నయ్ లో వున్న కజిన్ దగ్గర కొన్ని వుండిపోయాయి. ఆక్స్ఫర్డ్ లోనే మరో పెట్టెనిండా పుస్తకలు ఎక్కడో వుండిపోయాయి. ఏదో ఒకరోజు అన్ని ప్లేసులూ తిరిగి వాటిని వెనక్కి తెచ్చుకుంటాను. ఏమో!

జనం ఎక్కువ సీనిచ్చేసిన పుస్తకం?

ఈ ప్రపంచంలోని మత గ్రంథాలన్నీ.

అస్సలు సీన్ పొందని పుస్తకం?

కన్నడ మహాకవి బసవన్న రచనలు. భారతదేశంలోని మిగతా ప్రాంతాలలో వాటికి దొరకవలసినంత ప్రాచుర్యం దొరకలేదు. దానికి ఏకె రామానుజన్ చేసిన అద్భుతమైన అనువాదం కూడా వుంది.

తాజాగా చదవడం పూర్తిచేసిన పుస్తకం?

“పాస్ట్ కంటిన్యఅస్” (నీల్ ముఖర్జీ)

మీరు రాస్తే బాగుండుననుకున్న పుస్తకం?

వాల్ట్ విట్మన్ రాసిన ” ” గుర్తుంచుకోవడానికి ఎన్ని అవస్తలు పడుతంటానో. నేనేగాని ఆ డామ్ పొయెమ్ రాసివుంటే ఎంతో సులువుగా గుర్తుంచుకునేలా రాసేవాడిని. 

ఇటీవల కొన్న పుస్తకం?

ది కలెక్టెడ్ స్టోరీస్ ఆఫ్ గై డి మొపాసా. నా బాల్యంనుంచి నేను కొనిపెట్టుకున్న ఏడోదో, ఎనిమిదోదో ఇది.

మీకు బాగా నచ్చిన పాత్ర?

సాల్ బెలో రాసిన అత్యద్భుతమైన పుస్తకం “సీజ్ ది డే” లోని టామీ విల్హెల్మ్. నా జీవితం కంటే వాడి జీవితం మరీ దరిద్రం. ఆ పుస్తకం ఎప్పుడు చదివినా నన్ను నేను కుదుటపరుచుకుంటూ వుంటాను.

(గాబరా పడకండి. ఈ ఇంటర్వ్యూ తెహెల్కా తాజా సంచిక (28.02.2009)లో వచ్చిన దానికి అనువాదం.)

ప్రకటనలు

6 responses »

  1. నిజమా నిజమా అని ఆశ్చర్యపడుతూ చదివి చివరికొచ్చాను. అయినా సరే, మీ ప్రశ్నలే తెహెల్కా వాళ్ళూ వేసినదుకు అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s