పౌరశిక్షణతోనే పరిష్కారాలు

సాధారణం

ఒక కేస్ట్ సర్టిఫికేట్టుకోసమో, ఇన్ కమ్ సర్టిఫికేట్టుకోసమో మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్తాము. చిన్నచిన్న సాకులు చూపించి జాప్యం చేస్తుంటారు. కుళాయి కనెక్షన్ కోసం మున్సిపాలిటీ ఆఫీసుకు వెళ్తాము. వెళ్లిన చోటుకే పదేపదే వెళ్లవలసిన అవసరం కల్పిస్తారు. ఉత్సాహంగా ప్రాజెక్టు రిపోర్ట్ తయారుచేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు వెళ్తాం. ఆన్ ది స్పాట్ లోన్ అంటుంటే నోరూరిపోతుంది. ఇంతలో రాజకీయ గద్ద అన్నీ తన్నుకుపోతుంది. అలవిమాలిన కోపం వస్తుంది. బొడ్డు దగ్గర తడిమితే ‘భారతీయుడి’ లాగా కత్తి దొరకదు. అక్కడున్న అధికారులందర్నీ ‘జంటిల్ మేన్’లాగా చితగ్గొట్టేద్దామా అనిపిస్తుందేగాని, శక్తి చాలదు. అవినీతిని ప్రక్షాళన చేసేద్దామని ‘అపరిచితుడు’లాగా తల విదిలించి కొట్టినా మన జులపాల జుట్టు భుజాలదాకా వేలాడదు. కోపంతో, అసహనంతో, నిర్వేదంతో, నిస్పృహతో లంచమిచ్చో, పైరవీ చూపించో పని జరిపించుకోవాలనే నిర్ణయానికొచ్చేస్తాం. ఎందుకలా జరుగుతుంది?

అజ్ఞానం వల్ల, భయం వల్ల. నిర్లక్ష్యపూరిత, అవినీతిమయమైన, ఇసుమంతైనా జవాబుదారీతనం లేని వ్యవస్థతో ఒంటరి పోరాటం చేయడమెలానో తెలియని అజ్ఞానం వల్ల. అలా ఒంటరి పోరాటం చేస్తే ఏం ప్రమాదం జరిగిపోతుందో, మునుముందు మరెన్ని కష్టాలు పడాల్సివస్తుందోనని భయం వల్ల. రుజాగ్రస్త వ్యవస్థ ప్రక్షాళన ఒంటరిగా చెయ్యలేమేమో కాని, అట్లాంటి ఒంటరి వ్యక్తులు లక్షలాదిమంది కలిస్తే అప్పుడొక ప్రబల, ప్రచండ శక్తిగా తయారవుతుందనడంలో ఎవరికైనా సందేహం వుంటుందా? ఉండకూడదు. అలా ఏర్పడిన విశాలవేదిక లోక్ సత్తా. లోక్ సత్తా సిద్ధాంతం, లక్ష్యాలు, యువత లోక్ సత్తాలో ఎలా పాల్గొనవచ్చు? నియమావళి, తదితర అంశాలన్నింటిని వివరంగా తెలిపే “రెండవ స్వతంత్ర పోరాటం” బులెటిన్ పరిచయం ఈ వ్యాసం.

ప్రజలే ప్రభువులు అనే నినాదంతో తన కృషి కొనసాగిస్తున్న లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ సీనియర్ ఐపిఎస్ ఢికారిగా వుంటూ ప్రక్షాళన కార్యక్రమానికి నడుం బిగించడానికి ఉద్యోగాన్ని వదులుకున్నారు. గ్రామాలనుంచి, పట్టణాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అదే ఆలోచనధోరణి కలిగిన వాళ్లందరూ చేయి చేయి కలిపి రూపొందించుకున్న లోక్ సత్తాకు ఇప్పుడు దాశవ్యాప్తంగా ఆదరణ లభించడం విశేషం. మౌలిక ప్రజాస్వామ్య విలువలను, స్ఫూర్తిని ప్రజలందరికీ పంచగలిగితే మనకున్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ట్రాఫిక్ పోలీసు ఉంటేనే ట్రాఫిక్ సిగ్నల్ ను పాటించడం పౌరులలో పౌరసత్వ బాధ్యత లేకపోవడానికి ఉదాహరణ. పోలీసు చూడకపోతే మోటారు సైకిల్ మీద ముగ్గురు పోవచ్చనే ధీమా, బ్లాక్ లో టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసే తత్వం, పది రూపాయలిచ్చి అయినా పని జరిపించాలనుకోవడం పౌర స్పృహ (చివిక్ సెన్స్) లేకపోవడానికి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.  వాడ్రేవు చినవీరభద్రుడు ఒక చోట అన్నట్టు ఉద్యమాలు తక్షణ ప్రయోజనాలను సాధిస్తాయని ఆశించకూడదు. సాధించవలసిన ప్రయోజనాల పట్ల ప్రజలలో చైతన్యం కలిగించడమే ఉద్యమాల ముఖ్య కర్తవ్యం. లోతుగాచూస్తే గాంధీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ దేశం యావత్తూ అన్ని శ్రేణుల ప్రజల్లోనూ స్వతంత్ర స్ఫూర్తిని రగిలించడమే, ఉద్యమ స్ఫూర్తిని వ్యాప్తి చేయడమే ముఖ్య లక్ష్యం అనిపిస్తుంది. బ్రిటిష్ పాలకులకు తద్వారా ఒక స్పష్టమైన సందేశం పంపించడమే అసలు ఉద్దేశం. ప్రజల ఇక్కట్లు తొలగించే ప్రతి సంస్కరణనూ వ్యక్తి స్వేచ్ఛ, స్వపరిపాలన, పౌరుల నిరంతర భాగస్వామ్యాధికారం, చట్టబద్దపాలన, రాజ్యవ్యవస్థలో స్వయం పరివర్తనాశక్తి అనే ఐదు ప్రమాణాల రీత్యా బేరీజు వేసుకోవాలని లోక్ సత్తా స్పష్టంగా చెప్తుంది. లోక్ సత్తా తన కృషిని కొన్ని మార్గాలద్వారా కొనసాగిస్తోంది. ప్రజల నిరంతర డేగ నిఘా, స్వరాజ్య ఉద్యమం, ఎన్నికల నిఘా ఉద్యమం, ప్రజాస్వామ్య సంస్కరణలపై మరింత సునిశిత, సమగ్ర కార్యాక్రమం తేవడం, ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం, సాగునీటి సంఘాల ఏర్పాటు, స్థానిక ప్రభుత్వాలకు అధికారాలిచ్చి తీరాలనే స్పృహ అందరిలో కలిగించడం, ఓటర్ల నమోదులో లోటుపాట్లు సరిచేయడం, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఆస్తి వివరాలతో పాటు నేరజాబితాను వెల్లడించడం, మొదలైన వాటిని సాధించిన విజయాలుగా పేర్కొనవచ్చు.

ఆసక్తి గలవారు లోక్ సత్తాలో చేరాలంటే ఏం చేయాలోకూడా ఈ చిన్న పుస్తకంలో వివరించారు. చాలా సమస్యలకు చక్కటి పరిష్కారం మన పౌరవిధులు మనం తెలుసుకుని ఆచరించడమే. ఇందులో భాగంగా లోక్ సత్తా తన సభ్యులకు ఉచిత జనశిక్షణ కార్యక్రమం చేపట్టింది. ఈ శిక్షణ పొందిన సభ్యులు ప్రజాసంఘాలుగా ఏర్పడి, సమష్టిగా ఎలా ఉద్యమించవచ్చునో, అలాగే రేషన్ షాపులు, ప్రజారోగ్యం వంటి అంశాలలో మౌలిక సమాచారం తెలుపుతూ, లోపాలు ఎలా గుర్తించాలో, ఎలా సవరింపజేయాలో వంటి వివరాలు కూడా ఉన్నాయి.

ప్రజాస్వామ్యంపట్ల అనురక్తి వున్న పాఠకులు “రెండవ స్వతంత్ర పోరాటం: లోక్ సత్తా పిలుపు” అనే 90 పేజీల పుస్తకాన్ని లోక్ సత్తా ప్రజాసంఘపు కార్యాలయాల్లో ఉచితంగానే (!) పొందవచ్చు.

(లోక్ సత్తా ప్రజాసంఘంగా వున్నప్పుడు (ఇప్పుడు కూడా వుందనుకుంటా!) మంచి అభిమానిని. శ్రీకాకుళంలో కార్యక్రమాలకు విరివిగా పాల్గొనేవాడిని. రాజకీయ పార్టీగా అవతరించినాక దానికి దూరమయ్యాను. అప్పుడు చదివిన బులెటిన్ పై రాసిన పరిచయ వ్యాసమిది.)

ప్రకటనలు

3 responses »

 1. ఎవ్వడబ్బ సొమ్మని వీరు భూములు ఇష్టం వచ్చిన వాటికీ ధారాదత్తం చేస్తారు
  దీని వల్ల ప్రజలకు వొరిగిన ప్రయోజనం ఏమిటి?
  రైతుల రుణాలను ఎగగోట్టి, రేపు రొటేషన్ కాక అప్పు దొరక క మాడి పోయేది రైతే కదా
  కనీసం కట్టే వాళ్ళు కడతారు కదా ఈవిదం గ రుణ మాఫీ అని ఎగవేత నేర్పిస్తారా
  ఈ సంవత్సరం ఒక రైతు కూడా ఋణం తిరిగి చెల్లిస్తే వట్టు.
  మాఫీ కోసం ఏదురు చూస్తూ తిరిగి చెల్లించక మరుసటి సంవత్సరం రుణాలు పొందక రైతు పడే ఇబ్బంది ఎవ్వరయిన ఆలోచించారా
  ముఖ్యం గా అధికారం లో కి వచ్చే నాయకుడు ప్రజల అబిమానం మీద కాదు ఆతని కులబిమానం లేక మతబిమానం మీద మాత్రమే

 2. dear sir, monna visalandhra book house ki velli nappudu law ni ala upayoginchukovali ani dastvejulu ela tayaru cheyali ane books choosanu appudu anipinchindi oka govt office ki vellinappudu vallu sarigga manalni recieve chesukoka pote emcheyalo cheppe book undalani adi meeru parichayam chesinanduku thanks

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s