పద్దెనిమిదో వారం చదువు ముచ్చట్లు కత్తి మహేష్ కుమార్ తో…

సాధారణం
పర్ణశాల బ్లాగరి కత్తి మహేష్ కుమార్ ను పరిచయం చేసే సాహసం చేయనుగాని, ఇంకొకరు సరదాగా సుత్తి నరేష్ కుమార్ పానశాల పేరుతో బ్లాగు మొదలెట్టారంటే చాలు, మహేష్ ఏ స్థాయిలో చర్చలను రేకెత్తించారో అర్థమవుతుంది. సాహిత్యం, సమాజం, మనసు, మనసులోపలి ముసుగులు ఇలా విభిన్న అంశాలపై తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పగల కత్తిలాంటి బ్లాగరి మహేష్. బ్లాగును సీరియస్ గా తీసుకునే అతికొద్దిమంది బ్లాగరులలో ఒకరైన ఈయన చదువు ముచ్చట్లు ఈ వారం…
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
బహుశా కథాగమనరీతి తన శైలి తెలియకపోవడం వలన అనుకుంటాను సాల్మన్ రష్డీ రాసిన ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ చాలా బోర్ అనిపించింది. చదువుతుంటే బోర్ అనిపించిందిగానీ, ఎందుకు చదివానా అనిపించలేదు. 

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

 

 

 

ఇటీవల కొని చదవడం పూర్తి చేసిన పుస్తకం బష్రత్ పీర్ రాసిన “కర్ఫ్యూడ్ నైట”. ఇది ఒక కాష్మీరీ తను తుపాకి నీడన జీవించిన జీవితం గురించి పంచుకున్న పుస్తకం. కాష్మీర్ సమస్యలో సామాన్య ప్రజలు ఎలా alienate అయ్యారనే విషయాన్ని,ఆ నిజాల్ని అనుభవించిన వ్యక్తి నోటివెంట వినాలనుకునేవారందరూ చదవాల్సిన పుస్తకం ఇది. 

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

 

 

 

 చిన్నాచితకా పుస్తకాలతో కలిపి దాదాపు రెండొందలుండొచ్చు.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

 

 

 

నందన్ నీల్ఖని రాసిన “ఇమాజినింగ్ ఇండియా” కొని నాలుగు నెలలు కావస్తోంది. కానీ ఇప్పటివరకూ చదవలేకపోతున్నాను. ఈ నెల మొదలెట్టాలి.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

 

 

 

నాకు బాగా నచ్చే సాహిత్యం నవలలు. బుచ్చిబాబు, చిట్టిబాబు, చివుకుల పురుషోత్తం, ముదిగొండ శివప్రసాద్, యండమూరి వీరేంద్రనాధ్ నాకు నచ్చే నవలా రచయితలు.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

 

 

 

ఈ ఏడాదిలో నేను బహుకరించిన పుస్తకం “శివ” అనే ఆధ్యాత్మిక పుస్తకం. నాకు ఇంకా బహుమతులు రావడం మొదలవలేదు.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

 

 

 

ప్రస్తుతం ఏ పత్రికా నచ్చడం లేదు.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

 

 

 

గుర్తు లేదు. అయినా ఇలాంటివి ఎప్పటికప్పుడు మర్చిపోవాలి.

 

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

 

 

 

ఎస్.ఎల్.బైరప్ప కన్నడం లో రాసిన “పర్వ” కు తెలుగు అనువాదం చదువుతున్నాను. అనువాదకులు గంగిశెట్టి లక్ష్మీనారాయణ. ప్రకాశకులు సాహిత్య అకాడమీ.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

 

 

 

బుచ్చిబాబు “చివరకు మిగిలేది”, చలం సాహిత్యం, యండమూరి పుస్తకాలు నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాలు. ఒక స్థాయిలో నా జీవితాన్ని నిర్దేశించినవికూడా ఇవే.
ప్రకటనలు

8 responses »

  1. అసలు మీరు చేసిన పరిచయమే కత్తిలా ఉంది.మహేష్ గారి అభిప్రాయాల్లోని ఖచ్చితత్వం కొత్త కాదనుకొండి!
    ఎనిమిదో ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చాలా బాగుంది.

  2. కొత్తపాళి గారూ, మహేష్ గారన్నట్టు మిడ్నైట్ చిల్డ్రన్ నవల నాకు కూడా భలే బోర్ కొట్టింది. ఇప్పటికి నాలుగు సార్లు పాతిక మించి పేజీలు చదవలేకపోయాను. అయితే ఇన్నాళ్లూ నాకా మహా రచయిత రాస్తున్న ఇంగ్లిష్ అర్థం కావడం లేదనుకున్నా. మహేష్ గారు చెప్పాక, నవల బోర్ అనుకున్నా. కాని, ఇప్పుడు తెలిసింది, నేనెప్పుడూ ముంబై వెళ్లకపోవడమని. ఇంతకుముందు, ఏడుతరాలు నవల పదిపేజీలు చదవలేకపోయేవాడిని. మిత్రుడు యాసీన్ కరెక్టుగా ఇరవై ఐదు పేజీలు చదవి ఆపమని చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. ఇరవై పేజీలు తరవాత పుస్తకం కిందపెడితే ఒట్టు.

  3. మహేష్ గారి పై నాకు వ్యక్తిగతంగా కోపం లేదు కానీ కొన్ని విషయాలలో అతను చాలా అస్పష్టంగా ఉంటారు. పబ్ ల విషయంలో కూడా ఇలాగే చాలా అస్పష్టంగా వాదించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s