సమాజ భాష్యకారుడు పతంజలికి నివాళి

సాధారణం

తెలుగు సాహితీ వినీలాకాశంలో మరో తార నేలకొరిగింది. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే గొంతుమూగబోయింది. నిత్యం ప్రజాపక్షపాతం వహించే రచయిత కలం మరి రాయనని మొరాయించింది. ప్రతి మాటలోనూ వర్గ దృక్పథాన్ని ఎత్తి చూపించిన కలంకారి కన్నుమూశాడు. ప్రముఖ రచయిత కె. ఎన్. వై. పతంజలి మరణించాడు. 

శ్రీకాకుళపు యాసను కాళీపట్నం రామారావు, విశాఖపట్నం యాసను రాచకొండ విశ్వనాధశాస్త్రి అక్షరీకరిస్తే, విజయనగరం ప్రజల నుడికారాన్ని రచనల్లోకి ఎక్కించింది కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. అలమండ గ్రామంలో మార్చి 29, 1952లో జన్మించిన పతంజలి, 1963లో తొలి నవల రాశారు. భారత ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలుగా నిలిచిన నాలుగు యంత్రాంగాలైన రాజకీయం, న్యాయం, పోలీసు, పత్రికలను నిరంతరం డేగ నిఘావేస్తూ వాటి డొల్లతనాన్ని తన ప్రతి రచనలోనూ ఏకి పారేసిన పతంజలి కేవలం విమర్శతో ఆగిపోలేదు. దానినెలా బాగుచేసుకోవచ్చో అన్యాపదేశంగా తన రచనలలో సూచించారు.

ఖాకీవనం, పెంపుడు జంతువులు, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, అప్పన్నసర్దార్, ఒక దెయ్యం ఆత్మకథ, నువ్వేకాదు, వేటకథలు, రాజుల లోగిళ్లు, దిక్కుమాలిన కాలేజీ, పతంజలి భాష్యం, చూపున్నపాట, పోయేకాలం, శెభాసోమపాసా, జ్ఞాపకకథలు, గెలుపుసరే బతకడమెలా వంటి రచనలు ఆయన కలం జాలువార్చిన అక్షరాస్త్రాలు.

తన విలక్షణమైన జీవన వ్యక్తిత్వంవల్ల తాను పనిచేసిన ఏ పత్రికలోనూ పట్టుమని పదేళ్లు ఇమడలేకపోయిన పతంజలి జర్నలిస్టుగా తెలుగు పాత్రికేయవృత్తిలో తనదైన ముద్ర వేశారు. మార్క్సిస్టు విశ్లేషణను కేవలం కల్పిత రచనల్లోనే విశ్లేషించవచ్చన్న ముద్రను పోగొడుతూ తన పదునైన ఆలోచనధారను పాత్రికేయంలోకీ చొప్పించిన ఘనత పతంజలిది.

ఉత్తరాంధ్ర వాడుక భాష నుడికారాన్ని, ఇక్కడి ప్రజల జీవనసరళిని ఆత్మను, వర్గస్వభావ నేపథ్యంలో తన రచనల్లో ప్రతిఫలింపజేసి ప్రపంచానికంతటికీ చాటిచెప్పిన పతంజలి మరణం సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన స్మృతికి సమీక్ష క్లబ్ నివాళి అర్పిస్తోంది. మీరు చదివారా బ్లాగు నిశ్శబ్దంగా రోదిస్తోంది. ఆయన సాహిత్యాన్ని ఆర్ద్రంగా నెమరువేసుకుంటోంది.

దుప్పల రవికుమార్

కార్యదర్శి

ఆర్. శ్రీలత

ఉప కార్యదర్శి

ప్రకటనలు

4 responses »

  1. అవును. పతంజలి గారి గురించి ఒక్క జర్నలిస్ట్ బ్లాగరైనా టపా రాస్తారేమో నని చూసాను. ప్చ్!
    మీ సంతాప సందేశం చూస్తున్నాను. అసమాన ప్రతిభాశాలి,మీరన్నట్లు సమాజంలోని డొల్ల తనాన్ని ఏకి కాకులకేసిన విమర్శకాగ్రేసరుడు, పతంజలి గారి మృతి నిజంగా లోటే! ఆయనకు మనఃపూర్వక శ్రద్ధాంజలి!

  2. The sudden demise of Sri Pathanjali is a great loss to the telugu literature. He gave a shock treatment to the society with his sharp weapon…satire. You have rightly assessed his role. When I was reading your article, tears gushed down my cheeks.

    – Yalla Atchuta Ramayya

  3. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » 2009 మార్చి బ్లాగు వీక్షణం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s