ఇరవైరెండో వారం చదువు ముచ్చట్లు మీనాక్షి రెడ్డి మాధవన్ తో…

సాధారణం

సాక్షిలో అనుకుంటాను, గీతా రామస్వామి గారు ఇంగ్లిషు నవలలు రెండింటిని కొన్ని నెలల క్రితం పరిచయం చేశారు. వారిలో ఒకరు మీనాక్షి రెడ్డి మాధవన్. యు ఆర్ హియర్ అన్న తొలి నవలతో చక్కటి రచయిత్రి అన్న ముద్ర కూడా సంపాదించారు. అప్పటికే దేశంలో తన బ్లాగుతో ఇంగ్లిష్ బ్లాగులోకంలో గొప్ప పాపులర్ అయిన మీనాక్షితో చదువు ముచ్చట్లు ఈ వారం…

మీకెంతో నచ్చిన పుస్తకం?

కర్టిస్ సిట్టెన్ ఫెల్డ్ రాసిన “ప్రెప్” నవల. ఎంచేతనంటే ఇందులో కథ చెప్పేది తుంటరి టీనేజి అమ్మాయి, నేనెలా అప్పుడు ఎలా వుండేదాన్నో అలానన్నమాట.

మీకు నచ్చే రచనా ప్రక్రియ ఏది?

“నిజమైన” కాల్పనిక సాహిత్యం. నా ఉద్దేశమేమిటంటే ప్రత్యామ్నాయ విశ్వమంటూ ఏమీ వుండకూడదు, అందులో ఏమీ జరిగినట్టు రాయకూడదు. నాకు చారిత్రక కల్పనలన్నా, జీవిత చరిత్రలన్నా ఇష్టమే. నేను హిస్టరీ బఫ్ ను లెండి.

మీ అభిమాన పాత్ర?

“ఎక్స్ లిబ్రిస్”లోని ఆన్ ఫదీమన్ (కారెక్టర్ అని కాదు గాని, నన్ను భలే నవ్వించింది) పాత్రకూ – “పెర్సెపోలిస్”లోని యువ మార్జేన్ సత్రాపి అనే పాత్ర్రకూ మధ్య గట్టి పోటీ వుంటోంది. నేనిప్పటికి చదివిన వాటిల్లోకెల్లా సత్రాపి చాలా చిత్రాతిచిత్రమైన ఏడేళ్ల గడుసు పిల్ల.

మీకు నచ్చినా జనం అంతగా సీనివ్వని పుస్తకమేది?

కేథ్రిన్ ఫోర్బ్స్ రాసిన “మామాస్ బ్యాంక్ అకౌంట్”. నాకు తెలిసిన వాళ్లెవరికీ దీని గురించి తెలియదు. ఒక స్వీడిష్ అమెరికన్ అయిన రచయిత్రి, ఆమె పెద్ద కుటుంబం గురించి, టీనేజర్ గా ఆమె రాసిన తన సొంత కథల సిరీస్ ఇది. నిజంగా ఇది సరదాగా, విచారకరంగా, ఈమ్కా స్వీట్ గా వుంటుంది.

జనం మరీ ఎక్కువ సీనిచ్చిన పుస్తకాలు?

ఏదైనా పుస్తకాన్ని అలా పిలవడం అంటే నాకిష్టం వుండదు. అయితే గొప్ప మార్కెటింగ్ జరగ్గా నా చేతికొచ్చిన పుస్తకం సిద్ధార్థ్ ధన్వంత్ సంఘ్వి రాసీ “ది లాస్ట్ ఫ్లామింగో ఆఫ్ బోంబే” మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది.

ఇటీవల కొన్న పుస్తకమేది?

నిన్ననే, సెకండ్ హాండ్ పుస్తకాలమ్మే చోటుకు షాపింగుకు వెళ్లాను. బఠానీలు అనబడే పుస్తకాలు రెంటిని కొన్నా. కాండేస్ బుష్నెల్ రాసిన “సెక్స్ అండ్ ది సిటీ”, జోడీ పికోల్ట్ రాసిన “ఏ ఛేంజ్ ఆఫ్ హార్ట్” లు రెండూ కొన్నాను. రెండూ సరదాగా చదవొచ్చు అని చెప్పగలను. పికోల్ట్ పుస్తకం పూర్తి అయ్యేదాకా పట్టుపట్టి మరీ చదివిస్తాడు. తెల్లవారి నాలుగు దాకా చదువుకునే కూర్చున్నాను.

మీరు రాసి వుండాల్సింది అనుకున్న పుస్తకమేదైనా వుందా?

“ది కాచర్ ఇన్ ది రై”, పుస్తకం చదివిన ప్రతి ‘మిస్ అండర్ స్టుడ్” అడాలసెంటుకూ (అపార్థం చేసుకునే కౌమారప్రాయునికీ) హృదయాలను పట్టి ఓలలాడిస్తుంది. అది చాలా సింపిల్ స్టోరీ. నేను రాయడం ప్రారంభించడానికి కావల్సిన ప్రేరణనిచ్చింది ఈ పుస్తకమే.

(తెహల్కా ఏప్రిల్ 4, 2009 సౌజన్యంతో…)

ప్రకటనలు

One response »

  1. రవికుమార్ గారూ,
    మీనాక్షి చదువు ముచ్చట్లు ఫర్లేదు కానీ, ఆమె హైదరాబాదీ కాదండీ. ఢిల్లీలో పుట్టిపెరిగిన పిల్ల. వాళ్లమ్మ హైదరాబాదీ. తండ్రి మాధవన్ ఐఏఎస్ అధికారి. ఇంగ్లిష్ బ్లాగులోకానికే వన్నె తెచ్చిన.. ఇది కాస్త అతిశయోక్తిగా అనిపించింది. ఇంగ్లిష్ లో బ్లాగులు వేలకు వేలూ. ఎందరో గొప్పవాళ్లు రాస్తుంటారు. తమకు నచ్చినవాటిని స్వీకరించి నవలలుగా ప్రచురించడం పెంగ్విన్, హార్పర్ కొలిన్స్ వంటి ప్రచురణకర్తలు చేస్తుంటారు. అలా వచ్చిందే మీనాక్షి రెడ్డి మాధవన్ పుస్తకం ‘యూ ఆర్ హియర్’. అది ఇప్పుడొస్తున్న ‘చిక్ లిట్’ అంటే అమ్మాయిలు రాసే పల్ప్ లిటరేచర్ లో భాగం. ఏ రకమైన ఇన్హిబిషన్సూ లేని కొత్త తరం అమ్మాయిల భావాల్ని ప్రతిబింబించే రాతలవి. రెండోది, స్త్రీవాదం వచ్చి పాతికేళ్ల పైనే అయింది కదా, ఆ భావజాలం నీడల్లో పెరిగిన పిల్లల ఆలోచనలెలా ఉంటాయో తెలుసుకోవడానికి చిక్ లిట్ ఉపయోగపడుతుంది. ఏదేదో చెప్పెస్తున్నాననుకోకండి, ఆమెను నేను కలిశాను, ఇంటర్వ్యూ పత్రికలో ప్రచురించాం కూడా. ఆమె నవల యూ ఆర్ హియర్ నవల పరిచయం ఇవాళో రేపో పుస్తకం వెబ్సైటు వారికి పంపుతున్నా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s