ఇరవైమూడోవారం చదువు ముచ్చట్లు గద్దె ఆనంద్ స్వరూప్తో…

సాధారణం

గద్దె ఆనందస్వరూప్ గారిని మొదటిసారి వినడం “ఒక దళారి పశ్చాత్తాపం” పుస్తకంలో దిలీప్ గారు ప్రస్తావించినప్పుడు. తరువాత ఒకరిద్దరు రచయితలు ఆయన ప్రస్తావన తెచ్చినా పెద్దగా వివరాల్లోకి వెళ్లలేదు. అయితే విన్నదాన్నిబట్టి ఆయన అభిరుచి కలిగిన పాఠకులని అర్థమైంది. ఈ వారం చదువు ముచ్చట్లు ఆయనవే. అవి చదివాక మీరు కూడా ఆ మాట ఒప్పుకుంటారు. గణితం పట్ల మక్కువ ఎక్కువ కలిగిన ఆనంద్ స్వరూప్ గారి చదువు ముచ్చట్లు మరిక వినండి…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

చాలా మంది రచయితలు. చాలా పుస్తకాలు. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు బోర్ కొట్టి, కొన్నిసార్లు కొన్నేళ్లు పోయాక మళ్లీ చదువుతున్నపుడు కొత్త అర్థాలతో మనల్ని పలకరిస్తాయి.దానికో ఉదాహరణ “ఏన్ అంత్రపాలజిస్ట్ అమాంగ్ హిస్టోరియన్స్” (బెర్నార్డ్ కాన్-Bernard Cohn).

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

“Recovering the Lost Tongue: The Saga of Environmental Struggles in Central India” (రాహుల్ బెనర్జీ). కాచిగూడ ప్రాచీ పబ్లికేషన్స్ ప్రచురణ. దీనిమీద నా ప్రేమకు మరో కారణం అది ప్రాచీ పబ్లికేషన్స్ చెందినది కావడమే. ఇటీవలి నా విమాన ప్రయాణం పూర్తికాగానే “A Million Mutinies Now” (వి. ఎస్. నయీపాల్) పూర్తిచేశాను.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

తెలీదండీ. ఒక్కోదాన్లో ఆరు వరసలున్నీఅయిదు షెల్ఫ్ లున్నాయి. దాదాపుగా ఒక్కో వరసలో 30 నుంచి వందదాకా పుస్తకాలుంటాయి. అంతే.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

చాలా వున్నాయి. కానీ నాకీమధ్య కేవలం పుస్తకాలు చదవడంతోనే సరిపోదని, చదివిన విషయాలను శ్రద్ధగా, ఏకాగ్రతగా విచికిత్స జరుపుకోవడం అవసరమనీ అనిపిస్తోంది. నిజానికి మనం కొన్ని పుస్తకాలు చదవడం కుదరకపోయినా అప్పుడు ఇబ్బందేం వుండదు. అ సమాచారమే మిగతా పుస్తకాలలో, మిగతా చోట్లా పరుచుకునివుంటుంది కదా.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

తెలుగులో నాకు తరచుగా జ్ఞాపకమొచ్చేది “అసమర్ధుని జీవయాత్ర” (గోపీచంద్). ’50ల తర్వాత చాలా కొద్దిగానే తెలుగు పుస్తకాలు చదవగలిగాను. మరోటి, నా తెలుగు పరిజ్ఞానం కూడా అంత గొప్పదేం కాకపోవడం వల్ల సరళమైన తెలుగులో రాసిన అన్నమయ్య, వేమన, గురజాడ, రాళ్లపల్లి, ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి వాళ్ల రచనలే చదవడాన్ని ఇష్టపడతాను. ఇక ఇంగ్లిషులో అయితే నేను ఇష్టపడే రచయితలు, పుస్తకాలు చాలానే వున్నాయి. ఇటీవల నచ్చిన కొన్ని చెప్తాను. మాట్ రిడ్లే (“ది రెడ్ క్వీన్” మొదలైనవి), సారా బ్లాఫర్ హార్డీ (“మదర్ నేచర్” మొ.), డాన్ గిల్బర్ట్ (“Stumbling On Happiness”), అమితవ్ ఘోష్ (“In An Antique Land”), సుకేతు మెహతా (“మాగ్జిమమ్ సిటీ”), వి. ఎస్. నయీపాల్ పుస్తకాలు, కౌటిల్యుని అర్థశాస్త్రం (కొంచెమే చదివాను), బెర్నార్డ్ కాన్ పుస్తకాలు, మధ్యయుగ ఆంధ్ర చరిత్ర పై సింథియల్ టాల్బోట్ రాసిన రచన, షెల్డన్ పోలాక్ రాసిన “The Language of the Gods in the World of Men” మొదలైనవి. రామకృష్ణ మిషన్ ప్రచురించిన భారత సంస్కృతి, వారసత్వంపై ఏడు సంపుటాలపై శ్రద్ధ పుట్టింది. వాటిని తెప్పించుకుంటున్నాను. అవి దారిలో వున్నాయి.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
ఓ పదిహేను ఇరవై పుస్తకాలు మిత్రులకు ఇచ్చాను. నా పిల్లలు కూడా నాకు కొన్ని పుస్తకాలు పంపించారు.
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇంటర్ నెట్లో చాలా బ్రౌజ్ చేస్తుంటాను. భారతదేశంలోని కొంతమంది మిత్రులు చెప్పగా విన్నదిది: అక్కడ జాతీయ దినపత్రికలైన చాలా ఇంగ్లిషు పేపర్లకంటే ప్రాంతీయభాషా పత్రికలే బాగుంటాయట. నేను ఇ.పి.డబ్ల్యు., అవుట్ లుక్ క్రమంతప్పక చదువుతాను.
8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
బెస్ట్ సెల్లర్స్ సాధారణంగా చదవను నేను. మొదట ఒక విషయం ఎంచుకుంటాను. ఆ తర్వాత ఆ విషయంపై పుస్తకాలు ఒకటొకటిగా సేకరిస్తాను. ప్రస్తుతానికి నేను భారతదేశపు సందర్భంలో ‘అభివృద్ధి” అనే అంశాన్ని అర్థం, అవగాహన చేసుకోవాలనే తాపత్రయంతో వున్నాను. అంచేత దీనికి తగ్గట్టుగా ప్రాచీన చరిత్ర నుంచి మధ్య యుగాల మీదుగా తాజా పరిణామాల వరకు అవగాహన కలిగించే పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్నాను. అయితే ఈ విషయాలలో ఇప్పటికి నాకర్థమైంది పూజ్యమని మీకు చెప్పకేం లెండి. 
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
వి. ఎస్. నయీపాల్ రాసిన “ఇండియా: ఏ వూండెడ్ సివిలైజేషన్” చదవాలనుకుంటున్నా. ఇప్పుడే ఆయనది ఓ పుస్తకం పూర్తిచేశాను.
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి? 
చాలా. ఒకే పుస్తకాన్ని ఎంచుకోవాలంటే సారా బ్లాఫర్ హ్ర్డీ రాసిన “మదర్ నేచర్” నే ఎంచుకుంటానేమో.
ఒక్క మాట- ప్రాచీ పబ్లికేషన్స్ పి.పి.సి. జోషీ గారికి, పరుచూరి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీరిద్దరూ నాకెన్నో పుస్తకాలను, మంచి పుస్తకాలను సూచిస్తుంటారు.
ప్రకటనలు

One response »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s