ఇరవై నాలుగో వారం చదువు ముచ్చట్లు టి శ్రీవల్లీ రాధికగారితో…

సాధారణం

మహార్ణవం‘ బ్లాగరి టి. శ్రీవల్లీరాధిక కథకురాలు, కవయిత్రి. సున్నితమైన హ్యూమన్ ఎమోషన్స్ను అంతే సుకుమారమైన పదాలతో కవిత్వీకరించడం ఈమె ప్రత్యేకత. దాదాపుగా అన్ని తెలుగు పత్రికల్లోనూ కవితలు రాస్తున్న రాధిక కథ “మై ఫ్రెండ్” పేరుతో అనువాదమై, అమెరికాలో భారత రాయబార కార్యాలయం ప్రచురించే ‘ఇండియన్ రివ్యూ’లో జులై-2008 సంచికలో (p. 18-21) ప్రచురితమైంది. “రేవు చూడని నావ” కవితా సంపుటి “మహార్ణవం”, “ఆలోచన అమృతం” కథాసంకలనాలు ప్రచురించిన  ఈమె చదువు ముచ్చట్లు ఈ వారం వినండి మరి…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

వివిధ కారణాల వల్ల నచ్చని పుస్తకాలు చాలా వున్నాయి కానీ “బోర్ కొట్టించిన పుస్తకం” గా ఏమీ గుర్తు రావడం లేదు. సాధారణంగా అన్నిరకాల భావాల్నీ, భాషలనీ నేను హాయిగానే చదువుకోగలుగుతాను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇంద్రగంటి శ్రీకంతశర్మగారి “పరిపరిపరిచయాలు”

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

400 వరకు వుంటాయి

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

ఇది చాలా పెద్ద జాబితా. మొదట గుర్తొచ్చిన 4 పేర్లు చెప్తాను . టాగోర్ సాహిత్యం, యోగవాసిష్టము, సత్యం శంకరమంచి అమరావతి కథలు, తెన్నేటి సూరి చెంఘీజ్ ఖాన్

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

శ్రీపాద కథలు, టాల్ స్టాయ్ కథలు, మధురాంతకం రాజారాం గారి కథలు, ముళ్ళపూడి బుడుగు, నామిని మిట్టూరోడి కథలు,సులొచనారాణి గారి మీనా, రంగనాయకమ్మ గారి స్వీట్ హోం

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

నేనిచ్చినవి రెండే, అందుకున్నవి పదికి పైనే వున్నాయి. ఈ ఏడాది బహుమతిగా అందుకున్న పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం Angela’s Ashes.

7. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

నిజానికి జనం బాగా సీనిచ్చిన చాలా పుస్తకాలు నాకు “అంతగా” కాదు “అసలే” నచ్చలేదు. అలాంటి వాటిల్లో కొన్ని… The God of Small Things (Arundhati roy), Interpreter of Maladies (Jhumpa Lahri), అనుక్షణికం (చండీదాస్), కొల్లాయి గట్టితేనేమి (మహీధర రామమోహనరావు), అతడు ఆమె (ఉప్పల లక్ష్మణరావు), కాలాతీత వ్యక్తులు (పి. శ్రీదేవి) ఇంకా ‘who moved my cheese’, ‘Fish’ లాంటి పుస్తకాలూ.

8. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

రొయ్యలు (తగళి శివశంకర పిళ్ళై)

9. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ప్రభావితం అని చెప్పలేను కానీ … ఉద్వేగపరిచిన కొన్ని పుస్తకాలు.. Small Is Beautiful(Schumacher), Path of Ramana – II, Tattva Bodhah

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s