ఇరవై అయిదో వారం చదువు ముచ్చట్లు జయప్రకాష్ తో…

సాధారణం

నేను బ్లాగింగ్ మొదలుపెట్టిన తొలిదినాల్లో నాకొచ్చే వందలాది సందేహాలను ఆన్ లైనులో, ఫోనులో తీరుస్తూ… ఇలా చెప్తే వీడికి అర్థంకావట్లేదనుకుని కొణతం దిలీప్ కొన్ని ఫైళ్లు పంపించేవారు. అవన్నీజయప్రకాష్ గారివర్డ్ ప్రెస్ ట్యుటోరియల్ పాఠాలు. అలా జేపీసార్ కు నేను ఏకలవ్య శిష్యుడిని. తర్వాత మీరుచదివారా?లో రాసిన కొన్ని పుస్తక పరిచయ వ్యాసాలను తాను ఎడిట్ చేస్తున్న ‘డిస్కవర్ తెలంగాణ‘లో తిరిగి ప్రచురించడం ద్వారా మరికొంతమంది తెలంగాణ మిత్రులను పరిచయం చేశారు. జేపీ తన సొంత బ్లాగును రాస్తూనే ఫిలిం తెలంగాణ, ప్రాణహిత, పోలేపల్లి, ఫరెవర్ తెలంగాణ సైట్ల ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి….

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

 నాకు పుస్తకాలు చదవడం కన్న చూసుడు చాన ఇష్టం (తెరకు ఎక్కించిన పుస్తకాలు), ఇప్పటి వరకు అయితె పెద్దగ బోర్ కొటిచ్చిన పుస్తకం ఏం లేదు, ఏమన్న తడితె ముందుగ మీకే చెప్పుత.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

వరవరరావు గారి ‘తెలంగాణ వ్యాసాలు’ (మీరు రాసిన పరిచయం చదివినంక )

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

సుమారుగ ఒక మనిషి మోసేటన్ని ఉంటయేమో, కని తప్పకుంట మీకన్న తక్కువే 🙂

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

Standing Up to the Madness (by Amy Goodman and David Goodman ) ఇంకా చదవలేదు, మొదలు పెట్టాలె. ‘బాపు బొమ్మలు’ (ఇందుల చదివనీకి బొమ్మలే ఉన్నా, మూడు నాలుగేల్ల నుంచి పుస్తకం కొనలేకపోతున్న)

5. మీకు బాగా నచ్చిన రచనలు ? పుస్తకాల పేర్లు ?

లోకేశ్వర్ ‘సలాం హైదరాబాద్’; శ్రీ శ్రీ ‘మహ ప్రస్థానం’ (ofcourse) ‘ఖడ్గ సృష్టి’ ; చలం ‘సముద్రం’ ; తుమ్మేటి రఘోత్తంరెడ్డి ‘కథల’ సంకలనం ; కొణతం దిలీప్ ‘ఒక దళారీ పశ్చాత్తాపం’; నారాయణ స్వామి ‘సందుక ‘ ; కాళోజీ ‘నా గొడవ’ ; వరవరరావు గారి తెలంగాణ వీరగాథ : బతుకమ్మ పాట ; ; ; ; ‘The Exception to the Rulers ‘ by Amy Goodman and David Goodman; Howard Zinn ‘s ‘You Can’t Be Neutral on a Moving Train’; Dee Brown’s “Bury my Heart at Wounded Knee” ; Alex Haleys ‘Roots’ ; Isabel Allendes ‘My Invented Country’;

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఇచ్చింది sadly సున్నా, కని ఒక నాలుగైదు పుచ్చుకునే ఉంటాను.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నచ్చినవి: ప్రాణహిత, సోయి, వీక్షణం, భూమిక, నచ్చనిది, అసలు మెచ్చనిది: స్వాతి, సితార. (ఎందుకో అడుగొద్దు , i don’t even think it’s worth mentioning them here 🙂

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

N/A

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’

10.మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

పైన చెప్పిన నచ్చిన పుస్తకాలు అన్నీ ఏదో తీరుగ నా పైన ప్రభావం చూపినవే. మనం చదివే ప్రతి పదం, ప్రతి పుస్తకం మనకు తెలువకుంట ఏదో తీరుగ ప్రభావితం చేసేటివే., కని అందుల ఉన్న మంచినే నన్ను ప్రభావితం చేయాలని కోరుకుంట.

ప్రకటనలు

5 responses »

 1. >>నచ్చినవి: ప్రాణహిత, సోయి, వీక్షణం, భూమిక, నచ్చనిది, అసలు మెచ్చనిది: స్వాతి, సితార. (ఎందుకో అడుగొద్దు , i don’t even think it’s worth mentioning them here 🙂

  Comparing Apples Vs Oranges 🙂

 2. జయప్రకాష్ బ్లాగు ఒక్కసారి చదివామంటే వదల్లేము. అంత బాగుంటుంది. ఆయన మిత్రులొకరు చనిపోయినప్పుడు ఆయన రాసిన వ్యాసం చాలారోజులు నన్ను వెంటాడింది. మంచి బ్లాగు రాసే ఈయన ప్రాణహిత ఎడిటర్ అని నాకు తెలియదు.

 3. మీ ప్రశ్నలు బాగున్నయి… వాటికి జే పీ యిచ్చిన జవాబులు బాగున్నయి.
  కానీ, విందు భోజనం మొదటి ముద్దలోనే పంటికి రాయి తగిలినట్టు
  మొదటి ప్రశ్న కలుక్కు మన్నది.
  ఆఖరు ప్రశ్న ను మొదటికి తెచ్చి మొదటి ప్రశ్నను ఆఖర్న పెడితే మరింత బాగుంటదనిపించింది.

  ” కొలిమి ” గింత ఆలస్యంగ ” అంటుకోవడమే ” కొంచం ఆశ్చర్య మనిపించింది.
  బహుశా ఇదే మొదటి సారి కాకపోవచ్చునేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s