ఇరవై ఏడో వారం చదువు ముచ్చట్లు వసంతలక్ష్మిగారితో…

సాధారణం

ఆదివారం ఆంధ్రజ్యోతి మ్యాగజీన్ ఎడిటర్ గా వసంతగారు పాఠకలోకానికి, పాత్రికేయ ప్రపంచానికి, సాహితీప్రియులకు చిరపరిచితురాలు. ప్రతి వారం ఆమె రాసే ‘సండే కామెంట్’ కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. సాహిత్య, ఉద్యమ కోణాలు, వివిధ సామాజిక అంశాల పట్ల అవగాహన, చురుకయిన విశ్లేషణ ఆమెను ఉదయం పత్రికలో పనిచేయక ముందు నుంచీ భిన్న రంగాల మేధావులకు పరిచయం చేశాయి. పుస్తకాలంటే ప్రేమ, స్నేహమంటే ప్రాణం, నమ్మిన విషయాలకోసం దూసుకుపోయే చొరవ వసంతలక్ష్మిగారిని పత్రికా సంపాదకుల్లో విభిన్నంగా నిలబెడతాయి. ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్ వసంతగారి జీవిత భాగస్వామి. కొన్ని భారతీయ భాషల నుంచి తెలుగులోకి కథలనూ అనువదించిన ఆమె చదువు ముచ్చట్లు ఈవారం…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

మళ్లీ గుర్తు పెట్టుకోవడం కూడానా! సామాన్యంగా ముందే పసిగట్టి కంచె దూకి పారిపోతాను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇటీవల కొన్న పుస్తకమైతే The Story Of My Assasins. తరుణ్ తేజ్ పాల్ రాశారు. ఎవరో ఫ్రెండ్ చాలా బాగుందని చెపితే కొన్నాను. కాని చదవడం పూర్తి చేసిన పుస్తకం మాత్రం Curfewed Night. రచయిత  Basharat Peer. వెంటనే అనువాదం చేసేద్దామనిపించేంత నచ్చిన పుస్తకం అది. కాశ్మీర్ సమస్య మీద ఒక కాశ్మీరీ కలం నుంచి వెలువడ్డ మొదటి పుస్తకం అది. అతని జీవిత కథే కాబట్టి ఎక్కడా బోరు కొట్టదు.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

ఇదివరకా, ఇప్పుడా? ఇల్లు మారినప్పుడల్లా, అలమరల్లో చోటు లేనప్పుడల్లా బోలెడు బోలెడు తీసేస్తూ ఉంటాను కాబట్టి ఒక సంఖ్యేదీ చెప్పను. వెయ్యో రెండు వేలో ఉండొచ్చు.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి? 

Tell me no lies అని జాన్ పిల్జర్ సంకలనం చేసిన పుస్తకం. William Dalrymple రాసిన Last Mughul. చెప్పాలంటే చాలా ఉన్నాయి.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి. 

ఇది అన్నిటికంటే కష్టమైన ప్రశ్న. వయస్సు, సందర్భం, మూడ్ ని బట్టి ఎందరో నచ్చారు. అయితే అదే ఫీలింగ్ ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పలేను.
 

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

బహుమతులుగా అని చెప్పలేను కాని ఒక ఆదివారం అనుబంధం ఇన్ ఛార్జిగా ఉండటం వల్ల చాలామంది రచయితలు ‘రౌడీ మామూలు’లా ఒకటి నాక్కూడా పంపిస్తూ ఉంటారు. నేను బజారుకు వెళ్లి అవతలి వాళ్ల అభిరుచికి తగినదని భావించి కొని ప్రెజెంట్ చేసే పుస్తకాలు చాలా తక్కువ. కాని ఆ రచయిత మీద ప్రేమతోనో, రచనలోని కంటెంట్ మీద ప్రేమతోనో, పబ్లిషర్ మీద ప్రేమతోనో తెలుగులో వచ్చిన పుస్తకాలలో కొన్ని 5, 10, 15 అలా కొనేసి నా స్నేహితులందరికీ ఇచ్చేస్తుంటాను. సాహిత్య సేవ కోసం కాదుగానీ ఈసారి కలిసినప్పుడు వాళ్లతో మాట్లాడుకోవడానికి కొన్ని మంచి మాటలైనా ఉంటాయని.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

పత్రిక నిర్వాహకుల్ని అడగాల్సిన ప్రశ్న కాదేమో. నాదే అన్నా ఇబ్బందే. నచ్చని పత్రిక పేరు చెప్పినా ఇబ్బందే. కాబట్టి సేఫ్ గా 100 శాతం సంతృప్తిని ఇచ్చే పత్రిక ఏదీ లేదని మాత్రం చెబుతాను.
 

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
 
Alchemist. సాగదీసినట్టనిపించింది.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి? 

కందుకూరి రమేశ్ బాబు సామాన్యశాస్త్రం సిరీస్ లో రాసిన  don’t feel. చాలా ఆసక్తికరంగా ఉంది.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

చిన్నప్పుడైతే తెన్నేటి సూరి రాసిన చెంఘిజ్ ఖాన్ అందునేమో కాని ఇప్పుడు అంత అమాయకత్వం లేదు. చదివిన ప్రతి పుస్తకమూ ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే ఉందంటే లౌక్యం అనుకోరు కదా.   

ప్రకటనలు

2 responses »

  1. అలా అన్నారు గాని, చెంఘిజ్‍ ఖాన్‍ని ఆనందించే అమాయకత్వాన్ని వసంత లక్ష్మి పోగొట్టుకోలేదు. జ్యోతి సండే మ్యాగ్‍ ఎడిటోరియల్స్ దానికి సాక్ష్యం. కలిసి కాసేపు కబుర్లు చెప్పుకున్న వాళ్లకు ఆ సాక్ష్యం కూడా అక్కర్లేదు. నిజానికి అందరం అలాంటి అమాయకత్వాన్ని బతుకంతా కాపాడుకోవాలి, ఎలాగైనా చేసి. లేకపోతే, తెలివి మీరిపోయి, మన తెలివి కింద మనం నలిగిపోవడమే కదా?!.
    -హెచ్చార్కె.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s