2009 మాన్ బుకర్ ఇంటర్నేషనల్ బహుమతి విజేత ఆలిస్ మన్రో

సాధారణం

MunroAliceమూడవ అంతర్జాతీయ మాన్ బుకర్ ప్రైజును కొద్దిసేపటి కిందట ప్రకటించారు. 2009 సంవత్సరానికి గాను ఈ బహుమతి అలిస్ మన్రోను వరించింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇచ్చే ఈ అవార్డును ఇదివరకు 2005లో ఇస్మాయిల్ కదరే, 2007లో చినువా అచ్ బీ లు గెలుచుకున్నారు. కెనడాకు చెందిన మన్రో ఈ బహుమతి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈసారి జడ్జి పానెల్ లో జేన్ స్మైలే, అంద్రేయ్ కర్కోవ్ తోపాటు భారతీయ రచయిత అమిత్ చౌధురి కూడా వున్నారు. డుబ్లిన్ లో ట్రినిటీ కాలేజీలో జూన్ 25న జరగబోయే ఫంక్షన్ లో విజేత మన్రోకు 60 వేల పౌండ్లు బహుమతి మొత్తంగా పొందనున్నారు.

ఈసారి 12 దేశాలకు చెందిన 14 మంది రచయితలు ఈ బహుమతికి పోటీ పడ్డారు. భారతదేశం నుంచి మహాశ్వేతాదేవి, వి ఎస్ నయీపాల్ కూడా వున్నారు. వీరుకాక పీటర్ కారే (ఆస్ట్రేలియా), ఇవాన్ ఎస్. కానెల్ (అమెరికా), ఈ ఎల్ డాక్టరో (అమెరికా), జేమ్స్ కెల్మాన్ (ఇంగ్లండ్), మారియో వర్గాస్ ల్లోసా (పెరూ), అర్నోస్త్ లూస్తిగా (చెక్ రిపబ్లిక్), జాయిస్ కేర్ల్ ఓట్స్ (అమెరికా), ఆంటోనియా తాబుచ్చి (ఇటలీ), గూగీ వా థియాంగో (కెన్యా), దుబ్రావ్కా ఉగ్రెసిక్ (క్రొయేషియా), ల్యుద్మిలా ఉలిత్సికాయా (రష్యా) ఇతర రచయితలు ఈ పోటీలో వున్నారు. వీరిలో అలిస్ మన్రోను విజేతగా న్యాయ నిర్ణేతలు ప్రకటించారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s