ముప్పై ఒకటో వారం చదువు ముచ్చట్లు గీతా రామస్వామిగారితో…

సాధారణం

తెలుగు పుస్తక ప్రచురణ రంగంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక మేలిమి మలుపు. ప్రత్యామ్నాయ సాహిత్య ప్రచురణలో, ముఖ్యంగా అనువాద సాహిత్య ప్రచురణలో తెలుగు పాఠకులకు ఒక పెన్నిధి హెచ్ బి టి. ఉత్తమ సాహిత్య ప్రచురణతో పాటు పాఠకులకు అందుబాటులో ఉండే ధరలతో తెలుగు పాఠకలోకానికి ఎనలేని సాహిత్య సేవ చేస్తున్న హెచ్ బి టి కృషి వెనుకనున్నది గీతా రామస్వామి గారు. స్వయంగా రచయిత్రి అయిన గీతగారు ఒక మంచి పాఠకురాలు. తెలుగు నాకు పెద్దగా రాదు కనుక ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం బాగోదేమో అని ముందు నిరాకరించినా, ఈ జవాబుల ఉపయోగం చెప్పాక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చి సహకరించారు. ఆమె ఇంగ్లీషులో రాసిన జవాబులను యథాతథంగా ఇస్తూ నా తెలుగు స్వేచ్చానువాదాన్ని కూడా బ్రాకెట్లలో ఇస్తున్నా. మరి ఈ వారం గీత గారి చదువు ముచ్చట్లు చదవండి…

I am a Tamil by birth and have adopted Andhra Pradesh in early adulthood. Though I speak, read and write Telugu, I do not have the native fluency. I do read Telugu, but only for work in HBT, and do not enjoy reading it as leisure. This is a matter of great shame to me.

(నేను పుట్టింది తమిళనాడులో అయినా యుక్త వయసులోనే ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడ్డాను. నేను తెలుగులో మాట్లాడడం, చదవడం, రాయడం చేయగలుగుతున్నా నేటివ్ ఫ్ల్యుయెన్సీ పట్టుబడలేదు. తెలుగులో చదివేది హెచ్ బి టి పనిలో భాగంగానే, కానీ తెలుగును అస్వాదిస్తూ చదవలేను. ఇందుకు నేనెంతో సిగ్గుపడుతున్నా.)

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
I have always wondered how Dostoevsky and Turgenev are regarded as great writers. They have always bored me when I have read and reread them. Sometimes, it is possible that one is not ready for a book; one’s mind has to mature, one has to be prepared, and then what the book conveys strikes roots. This hasn’t happened to me vis-à-vis these two writers. On another plane, Mills and Boons books (romances) bore me dreadfully too.
(దోస్తొయెవ్ స్కీ, తుర్జెనెవ్ లు మహా రచయితలుగా ఎలా గుర్తింపు పొందగలిగారో ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతుంటాను. నేను వాళ్లను మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదివినా ఎంతో బోర్ కొట్టారు. కొన్నిసార్లు మనం కొన్ని పుస్తకాలను చదవడానికి సిద్ధం కాకుండా పోవడానికి కూడా అవకాశం వుంది. మన మనసులు పరిపక్వం కావాలి, మనం పుస్తకం చదవడానికి సన్నద్ధంగా వుండాలి, అప్పుడే ఆ పుస్తకం బోధపరిచేదంతా మనకు లోతుగా వంటపడుతుంది. యీ యిద్దరు మహా రచయితలతో నాకిదంతా జరగలేదనుకుంటా. ఇక మరో వైపు మిల్స్ అండ్ బూన్స్ (రొమాన్స్) బుక్స్ కూడా నన్ను చంపేంత బోర్ కొట్టాయి.)

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

Just yesterday, I finished Isaac Asimov’s The Naked Sun. I had read him long ago – maybe thirty years ago and was not interested in reading more of him. The other day, my fifteen year old daughter said that she found Asimov one of the best writers. Curious to know why (she reads extensively), I picked up this book, and found that it retained my interest till the end. It also raised several questions on the eternal values of mankind.

(జస్ట్ నిన్ననే, “ది నేకిడ్ సన్” (ఐజాక్ ఆసిమోవ్) పూర్తి చేశాను. చాలా యేళ్ల కిందట ఆసిమోవ్ ను చదివాను – బహుశా ముప్పై యేళ్ల కిందట అనుకుంటాను, కానీ పెద్దగా ఆసిమోవ్ ఇతర రచనలు చదవడానికి అంత ఆసక్తి కలగలేదు. ఈ మధ్యనే నా పదిహేనేళ్ల కూతురు, గొప్ప రచయితల్లో ఆసిమోవ్ ఒకడని చెప్పింది. ఆమె చాలా విస్తృతంగా చదువుతుంది లెండి, సరే ఎందుకో తెలుసుకుందామని ఆసక్తితో నేనీ పుస్తకాన్ని ఎంచుకున్నాను. పుస్తకం పూర్తి చేసేవరకు వదలలేనంత ఆసక్తికరంగా వుండడం గమనించాను. అన్నట్టిందులో ఆసిమోవ్ మానవాళి శాశ్వత విలువల పట్ల చాలా ప్రశ్నలు రేపాడు.)

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

Sorry, I do not have a library – I try not to keep one. I live among books, work with books and am drowned in books and manuscripts. At any time, I read three to four books simultaneously. Hence I do not keep any books. I borrow, read and return them. The sole book in my library (if you call it that) is David Werner’s Where There is No Doctor. My daughter has a huge library, so I pass on many books to her.

(క్షమించాలి, నాకు లైబ్రరీ లేదు – అసలు అది లేకుండా వుండడానికే నా ప్రయత్నం. నేను పుస్తకాల మధ్యనే బతుకుతుంటాను. పుస్తకాలతోనే పని చేస్తుంటాను. అసలెప్పుడూ పుస్తకాలు, రాత ప్రతులలోనే తలమునకలుగా వుంటాను. ఎప్పుడైనా ఒకేసారి మూడు నాలుగు పుస్తకాలు చదువుతుంటాను. అంచేత నేను పుస్తకాలను ప్రత్యేకంగా భద్రపరిచేది లేదు. పుస్తకాలు అరువు తెస్తుంటాను, చదువుతాను, మళ్లీ ఇచ్చేస్తాను, అంతే. నా లైబ్రరీలో (మీరలానే పిలవదలిస్తే) వున్న ఏకైక పుస్తకం “వైద్యుడు లేని చోట” (డేవిడ్ వెర్నర్). నా కూతురిదగ్గర మాత్రం చాలా పెద్ద లైబ్రరీ వుంది. నా పుస్తకాలు ఆమెకు ఇచ్చేస్తుంటాను.)

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

Orhan Pamuk – after all, he is a Nobel prize winner, but every time I pick up a Pamuk book, I don’t seem to appreciate it or finish it.

(ఒరాన్ పాముక్ – ఎంతచెడ్డా నోబెల్ బహుమతి విజేత. కానీ పాముక్ పుస్తకం ఏదైనా తీసిన ప్రతిసారీ నేను దానిని మెచ్చుకోలేకపోతున్నాను లేదా పూర్తి చేయలేకపోతున్నా.)

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

Harper Lee (To Kill a Mockingbird), James Baldwin (Notes of A Native Son,   Go Tell it on a mountain),

(హార్పర్ లీ రాసిన “టు కిల్ ఏ మాకింగ్ బర్డ్”, జేమ్స్ బాల్డ్ విన్ రాసిన “నోట్స్ ఆఫ్ ఏ నేటివ్ సన్”, “గో టెల్ ఇట్ ఆన్ ఏ మౌంటెన్”.)

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

No presents to anyone – a Left background denied this culture to me. This year, I got two books as presents – Salman Rushdie’s The Enchantress of Florence and Aravind Adiga’s The White Tiger.

(ఎవరికీ బహుమతులివ్వను – వామపక్ష భావజాల నేపథ్యం వల్ల ఈ సంస్కృతి నాకబ్బలేదు. ఈ ఏడాది నాకు మాత్రం రెండు వచ్చాయి – సాల్మన్ రష్దీ రాసిన “ది ఎన్ చాంట్రెస్ ఆఫ్ ఫ్లోరెన్స్”, అరవింద్ ఆడిగ రాసిన “ది వైట్ టైగర్”.)

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

Deccan Chronicle and The Hindu; I appreciate The Hindu.

(దెక్కన్ క్రానికల్, ది హిందూ; వీటిల్లో ది హిందూను నేను మెచ్చుకుంటాను.)

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

could’nt understand the question?

(నాకీ ప్రశ్న అర్థం కాలేదు.)

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

Revolt! Writings from Colonial Madras, V.Geetha and Rajadurai.

(వి. గీత, రాజదురై రాసిన “రివోల్ట్! రైటింగ్స్ ఫ్రం కలొనియల్ మద్రాస్”)

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

Kay Jamieson’s An Unquiet Mind, David Werner’s Where There is No Doctor, Virginia Axline’s Dibbs In Search of Self – these are over the last twenty years. The books that influenced me in early adulthood are of course, different.

(“ఏన్ అన్ క్వయీట్ మైండ్ (An Unquiet Mind)” (కే జేమీసన్), “వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్ (Where There Is No Doctor)” (డేవిడ్ వెర్నర్), “డిబ్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ సెల్ఫ్ (Dibbs In Searc Of  Life)” (వర్జీనియా ఆక్స్ లైన్)… ఇవి గత ఇరవై సంవత్సరాలకు పైగా నా అభిమానాలు. ఇక నా యుక్త వయసులో ప్రభావితం చేసినవంటారా, అఫ్ కోర్స్ అవి వీటికి చాలా భిన్నమైనవి.)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s