ఈ నెల పత్రిక “వీక్షణం”

సాధారణం

సాహిత్య పాఠకులైన “మీరు చదివారా?” బ్లాగు మిత్రులకు ఇకపై ప్రతినెలా ఒక పత్రికను పరిచయం చేయాలని ఈ పత్రికా పరిచయం శీర్షిక ఉద్దేశం.

 ఈ నెల మనమంతా తప్పక చదవాల్సిన పత్రిక “వీక్షణం” పరిచయం చేస్తున్నాను. సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు గౌరవ సంపాదకులుగా, ఎన్. వేణుగోపాల్ సంపాదకులుగా వ్యవహరిస్తున్న “వీక్షణం” మాస పత్రిక తెలుగులో ఇపిడబ్ల్యు స్థాయిలో నడుస్తోంది. సాహితీ కృషీవలులు సమాజాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిననాడు ప్రయోజనకరమైన సాహిత్యాన్ని సృష్టించగలరు. అలాంటి నిబద్దత గల రచయితలు, పాఠకులు తప్పక చదవాల్సిన పత్రిక “వీక్షణం”. ప్రతినెలా ‘ఫోకస్’ శీర్షికలో ఒక వర్తమాన అంశాన్ని నలుగురైదుగురు సీరియస్ ఆలోచనపరులు విభిన్న కోణాలలో విశ్లేషిస్తారు. ఇదికాక దేశ, విదేశాలలో జరుగుతున్న అనేక పరిణామాలపై సాధికారక విశ్లేషణ వ్యాసాలు వుంటాయి. గత కొన్ని నెలలుగా ‘నేర్చుకుందాం’ శీర్షికన సామాజిక అంశాలపైన అంతర్జాతీయంగా పాఠకాదరణ పొందిన వ్యాసాల అనువాదాలను అందిస్తున్నారు. పుస్తక పరిచయాలు, సమీక్షలు అప్పుడప్పుడూ వుంటాయి. ‘అసహజ మరణాల సూచి’ వీక్షణం ప్రత్యేకత. జిల్లాలవారీ డేటా అందిస్తున్నారు. పూర్తిగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల గురించిన సమగ్ర విశ్లేషణకు తనను తాను కేటాయించుకున్న పత్రిక మనం చదవడం మన ఉత్తమ అభిరుచికి నిదర్శనం. సాహితీ అధ్యయన పరులేకాక, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు, విద్యార్థులు తప్పక చదవాల్సిన ఈ పత్రికకు వెంటనే చందాదారులు కండి.

“మీరు చదివారా?” బ్లాగు పాఠకులు భారీ రాయితీతో ఈ పత్రికకు చందాదారులుగా చేరవచ్చు. ఈ పత్రిక సంవత్సర చందా కేవలం 120 రూపాయలు కాగా, నా బ్లాగు మిత్రులెవరైనా కేవలం ఎనభై రూపాయలు కట్టి చందాదారులు కావచ్చు. అంటే నలభై రూపాయల తగ్గింపు అన్నమాట. ఈ అవకాశం ఆగస్టు 15, 2009 వరకు మాత్రమే వుంటుంది. (ఈ అవకాశం వినియోగించుకోదలచిన వారు నాకో మెయిల్ పంపిస్తే వెంటనే మీకో కోడ్ నెంబరు మెయిల్ / ఎస్ ఎం ఎస్ ద్వారా అందుతుంది. మీ ఎంఓ ఫారమ్ లో ఈ కోడ్ నెంబరు సూచించండి. అంతే. ఏడాదిపాటు ప్రతినెలా “వీక్షణం” అందుకోండి.)

అన్నట్టు ఇప్పుడు “వీక్షణం” గతనెల నుంచి ఇంటర్ నెట్ ప్రేక్షకులకు అందుబాటులో వుంది. ఏ నెలకానెల సంచిక మొత్తాన్ని పిడిఎఫ్ చేసి తన బ్లాగులో పెడుతున్నారు. మీరు ఇక్కడ క్లిక్ చేసి జులై, 2009 సంచికను చదవొచ్చు. అయితే మీరు పత్రికకు చందా కట్టడంద్వారా ఒక మంచి పత్రికను నిలబెట్టిన వారవుతారు. మీ ఇంటిల్లపాది మాత్రమే కాక, మీ మిత్రులచేత కూడా చదివించ గలుగుతారు.

పత్రికకు చందా కట్టవలసిన చిరునామా:

వీక్షణం

మైత్రి రెసిడెన్సీ, 3-6-394,

వీధి నెంబరు 3, హిమాయత్ నగర్,

హైదరాబాద్ – 500 029.

ప్రకటనలు

2 responses »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s