జీవన శైలిలో మార్పే వ్యక్తిత్వ వికాసం

సాధారణం

themonkవారానికొకటిగా ఇంటర్ నెట్ ప్రపంచంలో “మీరు చదివారా?” బ్లాగులో వస్తున్న పుస్తక పరిచయాలను అభిమానంగా చదివి అభినందిస్తున్న ఓ హెల్త్ అసిస్టెంట్ మిత్రుడు కొన్ని మాసాల కిందట ‘రీడ్ అండ్ రివ్యూ’ అంటూ ఓ పుస్తకం పంపించారు. రాబిన్ ఎస్. శర్మ రాసిన “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ” పుస్తకమది. ఈ వారం ఆ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. 

వ్యక్తిత్వ వికాసం లేదా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలకు బీజం వేసింది డేల్ కార్నీజీ. అదే బాటలో ముందుకు వచ్చింది నార్మన్ విన్సెంట్ పీలే. వీళ్లిద్దరూ డాక్టర్లు కారు. మార్కెటింగ్, సేల్స్ రంగాలలో అనుభవమున్న వారు. వీళ్లు చెప్పిన విషయాలకు మనస్తత్వ శాస్త్రాన్ని జోడించిన బిహేవిరియల్ సైకాలజిస్ట్ థామస్ హారిస్ “అయామ్ ఓకె, యు ఆర్ ఓకె” పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అయితే ఈ పుస్తకాలన్నింటిలో సామాన్యంగా కనబడే లక్షణం రచయిత ప్రవక్తగా మారడం. బోధిచెట్టు కింద గట్టుమీద కూర్చుని, నేలమీద కూర్చున్న తన భక్తులకు వేదాంతసారాన్ని చెప్పే భారతీయ యోగుల్లాగా వీళ్లంతా జీవితంలో, సమాజంలో, మనసులో ఎలా విజయం సాధించవచ్చో పాఠకులకు ప్రత్యక్షంగా బోధిస్తుంటారు. అమెరికాలో లాయర్ గా పనిచేస్తున్న రాబిన్ ఎస్. శర్మ దీనికి భిన్నంగా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాన్ని ఒక కథలాగా చెప్తే ఎలా వుంటుందన్న ఆలోచన ఫలితమే ఈ “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారి”.

చాలా పెద్ద పేరున్న జూలియన్ మాంటిల్ అనే ట్రయల్ లాయర్ ఒకరోజు కోర్టు హాలులో గుండెపోటుతో విరుచుకు పడిపోవడంతో కథ మొదలవుతుంది. పని…పని…పని… మాత్రమే ప్రపంచం. పనే దేవుడు. పనినే ప్రాణంగా భావించే జూలియన్ మాంటిల్ రెండు మూడు నెలలకు హాస్పిటల్ లో బతుకుజీవుడా అని ప్రాణాలతో బయటపడతాడు. కాని, మూడు నెలల్లోనే తన ఆస్తి, ఐశ్వర్యమూ సంపదా అన్నింటినీ పూచికపుల్లతో సహా అమ్మేస్తాడు. తనకంటూ ఏ వస్తువూ వుంచుకోడు. ఆఖరికి తన పడవలాంటి కారునో, కారులాంటి పడవనో కూడా అమ్మిపారేస్తాడు. ఆ తరువాత ఆశ్చర్యకరంగా ఈ ప్రపంచంనుండి అదృశ్యమై పోతాడు. ఎక్కడికి వెళ్లిపోయాడో తన ఆచూకీ ఎవ్వరికీ తెలీదు.

పదిహేడు సంవత్సరాలుగా అతడితో కలిసి పనిచేస్తున్న జాన్ మనకీ కథంతా చెపుతుంటాడు. అలాంటి జాన్ దగ్గరకు ఒకరోజు సన్నగా, ఆరోగ్యంగా, చలాకీగా మెరుస్తోన్న కళ్లతో వ్న్న ముప్పైఏళ్ల యువకుడు వచ్చి నేనే జూలియన్ మేంటిల్ నని చెప్తే కథకుడు నమ్మలేకపోతాడు. బానడు పొట్ట, ఊబ శరీరం, సగం పైబడిన వయస్సు ఎలా మాయమైపోయాయని ప్రశ్నల వర్షం కురిపించిన కథకుడికి వివరంగా రెండు వందల పేజీలలో చెప్పిన సమాధానమే ఈ నవల.

ఒత్తిడితో, విరామమెరుగకుండా, యాంత్రికంగా మారిన జీవితంపై విముఖతతో ప్రశాంతతను వెతుక్కుంటూ బయలుదేరిన జూలియన్ వాళ్లూవీళ్లూ ఇచ్చిన సమాచారం మేరకు భారతదేశం చేరి హిమాలయాల దారి పడతాడు. ఆ మంచు ప్రర్వతశ్రేణులలో మహామునులను అన్వేషిస్తూ సాగించిన మహాప్రస్థానంలో శివానా పర్వతప్రాంతంలో కొంతమంది యోగులు కనిపించి జీవితసారాన్ని బోధిస్తారు. బహుశా ఈ సరికి మీకు అర్థమైపోయుంటుంది. ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని రచయిత అత్యద్భుతంగా వర్ణించి వుంటాడని, అవును. నిజమే.     ఈ పుస్తకం అమ్మకాలు, దీని తర్వాత రచయిత రాసిన పుస్తకాల వివరాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ నవల ప్రచురణ తర్వాత రాబిన్ శర్మ తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టేసి, పూర్తిగా పబ్లిక్ స్పీకింగ్ వృత్తిలో స్థిరపడిపోయాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవనవిధానం పట్ల, మన తత్త్వం పట్ల పాశ్చాత్యులు ఎంత మక్కువ చూపిస్తున్నారో తెలుస్తుంది. అయితే మన దేశంలోని వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయితలు బివి. పట్టాభిరామ్, శివ్ ఖేరా (వీరిద్దరి పేర్లు పక్కపక్కన రాయడం వీరిని సమం చేయడానికి కాదు, ఇక్కడ నుండి అక్కడిదాకా అని చెప్పడానికి), ఆరిందమ్ చౌధురి తదితరులంతా పాశ్చాత్య విశ్లేషణ కోసం చూడడం విడ్డూరం.

జీవితాన్ని ఏడు సూత్రాలతో ఆనందమయం చేసుకోవచ్చంటాడు రచయిత. మనసుపై అదుపు, గమ్యంపై అదుపు, కైజెన్ సాధన, క్రమశిక్షణతో బతుకు, కాలంపై అదుపు, నిస్వార్థ ప్రేమ, ప్రస్తుతాన్ని ప్రేమించు అనే ఏడు సూత్రాలు, ఒక్కో సూత్రంపై ధ్యానానికి ఒక్కో చిహ్నం, ప్రతి సూత్రమార్గంలో ప్రయాణించడానికి కొన్ని నిర్దిష్టమైన దారులు సూచిస్తాడు. చాలా ఆసక్తికరమైన సంభాషణలతో, పిట్ట కథలతో, ఉపదేశాలతో, సూక్తులతో సాగిపోయే రచన ఈ నవల. యువతరానికి ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.

ఈ పుస్తకాన్ని నాకందించిన పాఠకమిత్రుడు ఫోన్ చేసి పుస్తకమెలా వుందని వాకబుచేసినపుడు నా సమాధానమిది: “చంద్రబాబుకో, రామోజీరావుకో, వైఎస్ కో, మరొక డబ్బున్నాయనకో అయితే ఈ పుస్తకం చాలా బావుంటుంది. పడవలాంటి కారును అమ్మేసి యోగిగా మారిపోయిన వ్యక్తి కథ ఇది. కాని మన సమస్య అది కాదు కదా. తర్వాత పూట గడవడమెలా అన్నదే మన సమస్య. నోట్లోకి నాలుగు వేళ్లూ చేర్చేదెలా అని నిరంతరం సతమతమయ్యే మనకి బతుకు పుస్తకాలు కావాలి“. కొన్ని వారాల కిందట కాశీభట్ల వేణుగోపాల్ రాసిన “తపన” నవలలో కథానాయకుడు ఈ పుస్తకం చదివితే బాగుంటుందన్నది అందుకే!

అన్నట్టీ పుస్తకానికి తెలుగు అనువాదం కూడా వెలువడింది అది నేనింకా కొనలేదు. అంచేత చదవలేదు. అంచేత ఏమీ దానిగురించి చెప్పలేను. త్వరలో హిందీ సినిమాగా కూడా రానుందట.

ప్రకటనలు

6 responses »

 1. తెలుగులో ఈ పుస్తకం పేరు ‘ఆస్తులు అమ్ముకుని ఆత్మ శోధనకై ఒక యోగి ప్రస్థానం’. కొన్ని ఘట్టాలు అభూత కల్పనలు అనిపించేలా ఉన్నప్పటికీ చాలా ఆసక్తకరంగా ఉంటుందీ పుస్తకం. ‘ఆనందపరుస్తూ ఉపదేశించే అద్భుతమైన కథ’ అంటూ ‘ది ఆల్కెమిస్ట్’ రచయిత పాల్ కొయెల్ హో లాంటివారి ప్రశంసలు అందుకున్న పాపులర్ పుస్తకం. 41 భాషల్లోకి అనువాదం పొందింది.

  తెలుగు అనువాదం చేసిందెవరో పుస్తకంలో ఎక్కడా కనిపించకపోవటం ఓ లోటు.

  జైకో పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ (పంపిణీ దారులు- జ్యోతి బుక్ డిపో, విశాఖపట్నం). వెల: 135 రూపాయలు.

 2. రెండు రోజుల క్రితమే నా దగ్గరకు వచ్చిన పుస్తకం ఇది. మీ పరిచయం చదివాను.మీ మిత్రుడికి మీరిచ్చిన సమాధానం చాలా బావుంది. అయితే నెమ్మదిగా చదవొచ్చన్నమాట.

  వేణూ,
  మీరిచ్చిన సమాచారం కూడా ఉపయుక్తం! థాంక్యూ!

 3. nenu mi blog chudatam first time.naku books chadavatamante chaalaa istam. “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ” nenu chadiva..ipaati generation andaru chadavavalasina pustakam.keep it up andi…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s