ముప్పై మూడో వారం చదువు ముచ్చట్లు రెంటాల కల్పనగారితో…

సాధారణం

తూర్పు పడమర బ్లాగరి అయిన రెంటాల కల్పన కవి. అంతకంటే ముందు మంచి పాఠకులు. “నేను కనిపించే పదం” కవయిత్రి కల్పన వృత్తిరీత్యా జర్నలిస్ట్. నిరంతర సాహిత్య అధ్యయన, రచన తృష్ణ కలిగిన అతికొద్ది మంది తెలుగు సాహితీపరులలో ఈమె ఒకరు. (ఇటీవల ఈమె రాసిన ‘అయిదో గోడ’ కథ మీద జరగవలసినంత సమ్యక్ దృక్పథంలో చర్చ జరగకపోవడం వల్ల ఒక మంచి సాహిత్య సృజన తెలుగు పాఠకలోకానికి చేరలేకపోయిందని నా వ్యక్తిగత ఫిర్యాదు.) ఈమె చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి….

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి) 

చిన్నప్పుడు ఈ విషయం మా నాన్న గారికి చెప్పటానికి భయపడ్డాను. ఇప్పుడైతే నన్ను ఎవరూ ఏమి అనరుగా. ఆ ఉద్గ్రంధం  Tolstoy “యుద్ధం-శాంతి”. అప్పటికింకా నా వయస్సు నిండా పదేళ్ళే. ఆ పాత్రల పేర్లు అవి సరిగ్గా అలవాటు కాకపోవడం వల్ల కాబోలు ఎంత చదివి ముందుకెల్దామన్నా ఎవరెవరో మర్చిపోయి మళ్ళి వెనక్కు వెళ్ళాల్సివచ్చేది. ఎలాగోలా పూర్తి చేసాను కాని ఏమి అర్ధమైందో చెప్పమంటే తెల్లమొహం వేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ చదవాలనిపిస్తుంది కాని ముందే భయమేస్తుండటంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇటీవల నేను Amazon నుంచి కొన్న పుస్తకం Jambula Tree And Other Stories . Monica Arac de Nyeko is an African women Writer.  African writing కి ఇచ్చే ప్రతిష్టాత్మక Caine Prize వచ్చిన కధ Jambula Tree. ఆ కధ ఒక్కటి చదివాను.ఇంకా పుస్తకం పూర్తిగా చదవలేదు. నిన్ననే చదవటం పూర్తి చేసిన నవల మాత్రం  The Housekeeper and The Professor. ప్రముఖ జపనీస్ రచయత్రి Yoko Ogawa నవల. కుటుంబం, జ్ఞాపకాలు, లెక్కలు- ఈ నవల మొత్తం ఈ మూడింటి చుట్టు అందమైన అల్లిక. వర్తమానం లో జీవించటం అంటే ఏమిటో, ఒక కుటుంబం ఏర్పడటానికి రకరకాల equations ఎలా అవసరమవుతాయో ఈ నవల అంతర్లీనం గా చర్చిస్తుంది. లెక్కలు, sports అంటే బోరు కొట్టే వాళ్ళను కూడా ఎలాంటి విసుగు తెప్పించకుండా చదివించగలిగేలా వుంది. ఈ మధ్య కాలంలో నేను చదివిన, నాకు నచ్చిన మంచి పుస్తకం ఇది ఒక్కటే కాదు కాని అందులో ఇది ఒకటి.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి

ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టము. ఎందుకంటే మా సొంత library ఇక్కడ లేదు.ఇంకా India లోనే వుంది జాగ్రత్తగా ఒక స్నేహితుడి దగ్గర. ఇప్పుడు ఇక్కడ స్థలాభావం వల్ల అతి తక్కువ పుస్తకాలు మాత్రమే( అంటే దాదాపు ఒక 500) వున్నాయి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి

బహుశా చదివిన, చదువుతున్న పుస్తకాల కంటే ఇవే ఎక్కువ వుంటాయి .ఎందుకంటే ప్రతి రోజు తెలుగులో, ఇంగ్లీష్ లో,ఎన్నొ కొత్త పుస్తకాలు విడుదల అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మంచి బుక్ అనగానే అబ్బా, చదువుదాము అనిపిస్తుంది. అలా మన  wish list పెరిగిపోతూ వుంటుంది. క్లుప్తం గా చెప్పలంటే ప్రస్తుతం నా wish list లొ నుంచి కొన్ని పుస్తకాల వివరాలు…Thousand Splendid Suns, The Alchemist, Memoirs of a Geisha. Jane Austen బుక్స్ మొత్తం చదవటం పూర్తి చేయాలనిపిస్తుంది కాని చేయటం లేదు. తెలుగు లో సంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండూ కూడా అసలు ఏమి చదవనట్టే లెక్క. అది కాక  కొత్త పుస్తకాలు వస్తున్నట్టు పత్రికల్లో చూస్తాను కాని అన్ని ఇక్కడకు కొని తెప్పించుకొని చదవటం కష్టం కాబట్టి ప్రస్తుతానికి వాటిని వాయిదా వేస్తున్నాను.

5. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

ఒక్కప్పుడు పత్రికలు నచ్చటం, నచ్చకపోవటం వుండేది.ఇప్పుడు అన్ని ఒక్కలాగానే వున్నయి. ప్రత్యేక అభిమానం అంటూ ఏమి లేదు.

6. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

మా బాబు తో కలిసి Gordon Korman  రాసిన  schooled బుక్ చదువుతున్నాను.  అజర్ నఫిసి Things I’ve Been Silent About: Memories  పుస్తకం చేతికి రాగానే చదవటం మొదలుపెడతాను.

7. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ఆమాటకొస్తే అసలు ప్రభావం చూపని పుస్తకం ఏమైన వుంటుందా? ముందు చెప్పాల్సింది Tolstoy “అన్నా కెరినినా”.  తిరుమల రామచంద్ర గారి ” హంపి నుంచి హరప్పా దాకా”, శ్రీపాద వారి ” అనుభవాలు-జ్ఞాపకాలు” లాంటి పుస్తకాల ప్రభావం నా మీద ఎక్కువేననుకుంటాను. అలాగే కవిత్వం లో ” In Their Own Voice”(The Penguin Anthology Of Contemporary Indian Women Poets -Edited by Arlene R.K. Zide),  పాకిస్తాని women writers anthology ” We Sinful Women” నాకు బాగా నచ్చిన , నా మీద అమిత ప్రభావాన్ని చూపిన పుస్తకాలు.

8. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

వ్యక్తుల్ని బట్టి కాకుండా రచనల్ని బట్టి నిర్దారణ కు రావటం మంచిదని నా అభిప్రాయము. అయినప్పటికి మీ ప్రశ్నకు సమాధానం గా కొన్ని పేర్లు చెప్పాలంటే తెలుగు కవిత్వంలో వజీర్ రహ్మాన్ఎచటికి పోతావీ రాత్రి?”, , నిడమానూరి రేవతి దేవి “శిలాలోలిత కవితలు, జయప్రభ యశోధరా వగపెందుకే”,  పసుపులేటి గీత,షాజహానా కవిత్వము. వీరు కాక అంధ్రభూమి లో నేను తొలిసారిగా నిర్వహించినా కవితా కాలం” ఆమె పాట” కోసం   ఏడాదికి పైగా వారానికి వొక్కటి చొప్పున నేను అనువాదం చేసిన ప్రతి కవయిత్రీ నాకు నచ్చిన కవయిత్రే. మరీ ముఖ్యంగా ఉర్దూలో సారాషాగుప్తా కవిత్వము నాకిష్టం. వచనంలో ముందు చలం, శ్రీపాద రచనలు, తర్వాత పి.సత్యవతి మంత్రనగరి , ఓల్గా స్వేచ్చ ,సి.సుజాత సుప్తభుజంగాలు ,నిడదవోలు మాలతి, సుభాషిణి, మల్లీశ్వరి, శారదామురళి(Australia) రాస్తున్న మంచి కధలు .ఇంగ్లీష్ లో ఝుంపా లహరి Interpreter of Maladies,  ఆజర్ నఫిసి ” Reading Lolita in Tehran , L.M. Montgomery రాసిన Anne of Green Gables.

ప్రకటనలు

9 responses »

 1. పొద్దున్నే షెల్ఫారీలో కల్పనగారి పుస్తకాలు చూశాను. “The Housekeeper and The Professor.” గురించి చదివి, కొనాలని నిశ్చయించేసుకొని కాసేపట్లోనే ఈ టపా కనిపించింది. బాగుంది!

 2. రవి,

  నా సమాధానాలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. అయితే ఒక చిన్న పొరపాటు జరిగింది. మీరు ఒక ప్రశ్న, సమాధానం రెండూ వదిలేసారు. ఆ ప్రశ్న, సమధానం రెండు ఇదిగో, ఇక్కడ. మీరు వీలైతె update చేయగలరు.

  5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

  వ్యక్తుల్ని బట్టి కాకుండా రచనల్ని బట్టి నిర్దారణ కు రావటం మంచిదని నా అభిప్రాయము. అయినప్పటికి మీ ప్రశ్నకు సమాధానం గా కొన్ని పేర్లు చెప్పాలంటే తెలుగు కవిత్వంలో వజీర్ రహ్మాన్ “ఎచటికి పోతావీ రాత్రి?”, , నిడమానూరి రేవతి దేవి “శిలాలోలిత ” కవితలు, జయప్రభ “యశోధరా వగపెందుకే”, పసుపులేటి గీత,షాజహానా కవిత్వము. వీరు కాక అంధ్రభూమి లో నేను తొలిసారిగా నిర్వహించినా కవితా కాలం” ఆమె పాట” కోసం ఏడాదికి పైగా వారానికి వొక్కటి చొప్పున నేను అనువాదం చేసిన ప్రతి కవయిత్రీ నాకు నచ్చిన కవయిత్రే. మరీ ముఖ్యంగా ఉర్దూలో సారాషాగుప్తా కవిత్వము నాకిష్టం. వచనంలో ముందు చలం, శ్రీపాద రచనలు, తర్వాత పి.సత్యవతి మంత్రనగరి , ఓల్గా స్వేచ్చ ,సి.సుజాత సుప్తభుజంగాలు ,నిడదవోలు మాలతి, సుభాషిణి, మల్లీశ్వరి, శారదామురళి(Australia) రాస్తున్న మంచి కధలు .ఇంగ్లీష్ లో ఝుంపా లహరి Interpreter of Maladies, ఆజర్ నఫిసి ” Reading Lolita in Tehran , L.M. Montgomery రాసిన Anne of Green Gables.

  ఁఆర్థండ గారు,

  War and Peace అంటె నాకు కూడా గౌరవమే. కాకపొటె నేను wrong age లో చదవటం వల్ల నాకు బోరు కొట్టించిదన్న విషయం నిజయితీ గానే వొప్పుకున్నాను. ఆ పుస్తకం మల్లీ తీరికగా చదవాలనే నా ప్రయత్నం కూడా.

  @కొత్తపాళి, Gone with the wind పూర్తి చేయలేక అధ్భుతమైన సినిమా చూసేసాను.

  Kalpana

 3. కల్పనగారూ, క్షమించాలి. ఎలా మిస్సయ్యానో, ఏకంగా ఒక మంచి ప్రశ్న-జవాబు మిస్సయిపోయాను. వెంటనే చివర్లో అప్ డేట్ చేస్తున్నాను. షెల్ఫారిలో మీరున్నారని పూర్ణిమగారు సమాచారమందించారు. అక్కడ మీ లైబ్రరీ కొంత చూడొచ్చన్న మాట.

 4. టాల్స్టాయ్ అహింసావాదం ప్రభావం వల్ల నేను నాన్ వెజ్ తినడం మానేశాను. టాల్స్టాయ్ నన్ను ప్రభావితం చేసిన అంత గొప్ప రచయిత. లెనిన్ & స్టాలిన్ లాగే నేను కూడా టాల్స్టాయ్ ని prohet of peace గా భావిస్తాను.

 5. పూర్ణిమా,

  షెల్ఫారి లొ మొదట మిమ్మల్ని గుర్తు పట్టలేదుకాని, ఇక్కడ ఈ కామెంట్ చూసాక మీరెవరొ తెలిసిపోయారు. అయితే నేను అక్కడ నా షెల్ఫ్ పూర్తిగా update చేయలేదు. మీరు రెగులర్ గా షెల్ఫారి చూస్తున్నరా?

  కల్పన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s