ముప్పై నాలుగో వారం చదువు ముచ్చట్లు టంకశాల అశోక్ తో…

సాధారణం
అవును, ఈయన వార్త దినపత్రిక ఎడిటర్ అశోక్ గారే. సీనియర్ జర్నలిస్టూ, నిరంతర పఠనమూ, ముక్కుసూటిగా మాట్లాడడమూ అన్న పదాలు స్ఫురించగానే గుర్తొచ్చేది టంకశాల అశోక్ పేరే….  పత్రిక-వార్తలు-విశ్లేషణలు-పర్యటనలు తప్ప నిజానికి మరో పాత్రికేయ రాజకీయ మర్మమేమీ ఎరుగని అశోక్ ఎక్కువ మాట్లాడరు. ఇలాంటి వ్యక్తులు జర్నలిజం వృత్తిలో వుండడం అరుదు. తక్కువ మాట్లాడినా, నిష్టూరమనిపించినా, నిక్కచ్చిగా స్పష్టంగా మాట్లాడడం ఆయన బలహీనత. వార్త ఆదివారం రెగ్యులర్ గా చూస్తూవుంటే ఆయన ఏం చదువుతున్నారో వారు రాసే రివ్యూల బట్టి తెలుస్తుందనుకోండి. ఎంతో మితభాషి, బ్లాగు ప్రపంచానికి దూరంగా వున్న ఆయనతో ఈ నాలుగు మాటలూ మాట్లాడించిందీ కస్తూరి మురళీకృష్ణగారు. ఈ వారం అశోక్ సార్ చదువు ముచ్చట్లు విందామా మరి….
.
 
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
అటువంటివేమీ లేవు.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

కొనను. పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తకాలలో మంచివనుకున్నవి చదువుతాను. “ఓపెన్ వీన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా” (ఎడ్వర్డో గిలియానో) పుస్తకాన్ని ఇటీవల పూర్తి చేశాను. దీనిని బరాక్ ఒబామాకు వెనిజులా ప్రెసిడెంట్ హ్యూగో చేవెజ్ బహుమతిగా ఇచ్చాట్ట.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

నా లైబ్రరీని హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఇచ్చేశాను. ప్రస్తుతం ఓ మూడు, నాలుగొందలు పుస్తకాలు వుంటాయి.

4.. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

చాలా వున్నాయి.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

చాలా మంది వున్నారు. ఒకరని చెప్పడం కష్టం.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

నేను రాసినవి కాంప్లిమెంటరీలుగా స్నేహితులకు ఇస్తుంటాను. వాళ్లు సొంత పుస్తకాలు కాంప్లిమెంటరీలుగా ఇస్తుంటారు. అంతేకాని కొనివ్వడం లేదు.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నచ్చేది ‘వార్త’. ఏ పత్రికైనా వంద శాతం నచ్చకపోవడం ఉండదు. కొన్ని నచ్చిన ఫీచర్స్ వుంటాయి. అలాగే కొన్ని నచ్చనివి కూడా వుంటాయి. అంతే.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

ఏదీ లేదు.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ప్రస్తుతానికి “ది డ్యూయెల్: పాకిస్తాన్ ఆన్ ఫ్లైట్ పాత్ ఆఫ్ అమెరికా” (తారిఖ్ అలీ) పుస్తకాన్ని చదువుతున్నాను.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

బోలెడన్ని.

ప్రకటనలు

2 responses »

  1. నిజమే! మీరు ఉపోద్ఘాతం లో వాడిన పదాలన్నీ – ముచ్చట్లు చదివిన తర్వాత – నూటికి నూరు పాళ్ళు సరైనవే అనిపించింది.
    ….చాలా వున్నాయి.
    ….చాలా మంది వున్నారు.
    ….బోలెడన్ని!
    మరీ ఇంత ముక్కు సూటి సమాధానాలా!
    టంకశాల అశోక్ విశ్వరూపాన్ని చూడాలంటే అయన సంపాదకీయాలు, విశ్లేషణా రచనలూ వ్యాసాలు చదవాల్సిందే. మాటల్లో, ఉపన్యాసాలలో అసలు అశోక్ కనిపించరు. !

  2. కార్గిల్ దాడి జరిగినపుడు అశోక్ సార్ కార్గిల్ నుంచి ప్రత్యక్ష సాఖిగా రాసిన వ్యాసాలు చదవడం అప్పట్లో పెద్ద పాషన్ గా ఉండేది నాకు.

    ప్రభాకర్ గారు చెప్పిని కరెక్టే! ఆయన విశ్వరూపాన్ని చూడాలంటే విశ్లేషణా వ్యాసాలు చదవాల్సిందే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s