ముప్పై ఐదోవారం చదువు ముచ్చట్లు ఆరి సీతారామయ్యతో…

సాధారణం
అమెరికాలో రోచెస్టర్లోని ఓక్ లాండ్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసరుగా పనిచేస్తున్న ఆరి సీతారామయ్య ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అప్పుడప్పుడూ కథలు రాస్తుంటారు. “గట్టు తెగిన చెరువు” కథాసంపుటి వెలువరించారు. మంచి పాఠకులైన సీతారామయ్యగారి చదువు ముచ్చట్లు ఈ వారం చదవండి….
 
1. మీకు ఎలాంటి రచనలు నచ్చుతాయి? ఎలాంటివి నచ్చవు?
 
చదివింతర్వాత కొంతకాలం మనసులో ఉండిపోయేవి, ఆలోచించేట్లు చేసేవి అంటే ఇష్టం. పాత్రలచేత ఉపన్యాసాలు చెప్పించే రచనలూ, సమస్యలకు పరిష్కారాలు చూపించటానికే రాశారన్నట్లు ఉండేవి అంటే అయిష్టం.
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
 
రిచర్డ్ యేట్స్ గారి రెవల్యూషనరీ రోడ్.
3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
 
ఇంగ్లీషువి వెయ్యి పుస్తకాలుండవచ్చు. తెలుగు పుస్తకాలు నాలుగైదొందలు ఉంటాయి. 
4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
 
చాలా ఉన్నయ్. మా ఇంట్లో ఉన్న పుస్తకాలే చదవనివి ఎన్నో ఉన్నయ్. కార్ల్ మార్క్స్ గారి “కేపిటల్” చదవాలని చాలాకాలంగా అనుకోవటమేగాని ఇంతవరకూ కుదరలేదు. 
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.
 
ఎంతమందో! చలం, కొకు, రావిశాస్త్రి, బుచ్చిబాబు, రంగనాయకమ్మ, సీతాదేవి, శ్రీపాద, గోపీచంద్, తుమ్మేటి, సత్యవతి, ఓల్గా, సుంకోజీ, దయానంద్, మంచికంటి, ఉమామహేశ్వర్రావు, పాపినేని, అల్లం రాజయ్య, వి సి ఆర్, తోలేటి, హెచార్కె, శ్రీరమణ, వివినమూర్తి, ఇట్లా రాసుకొపోతూ ఉంటే చాలామంది ఉన్నారు.
నేను కవిత్వం ఎక్కువగా చదవలేదు. చదివినంతలో శ్రీశ్రీ, శివసాగర్, శివారెడ్డి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో విన్నకోట, అఫ్సర్, స్వామి, కన్నెగంటి, భూషణ్. 
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
 
ఐదారు పుస్తకాలు ఇచ్చాను. తీసుకోవటమే ఎక్కువ. 
7. మీ అభిప్రాయంలో ఇప్పుడొస్తున్న పత్రికల్లో మంచి సాహిత్య పత్రిక ఏది?
 
ప్రింట్ లో నాకు తెలిసినంతలో విపుల. వెబ్ లో అయితే ప్రాణహిత, ఈమాట, కౌముది. కొత్తగా మొదలయిన పుస్తకం.నెట్ మంచి ప్రయత్నం. 
 
8. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
 
కథ 2008 చదువుతున్నాను. 
 
9. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
 
చలం నవలలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం అని చెప్పాలి. రంగనాయకమ్మ గారి నవలలు కూడా. గోర్కీ నవల అమ్మ ఎన్ని సార్లు చదివానో!
 
10. యువ పాఠకులకు మీరిచ్చే సలహాలాంటిది…
 
మనకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్‌, అమెరికన్‌ సాహిత్యం తెలిసినంతగా పక్కదేశాల సాహిత్యం, అంటే శ్రీలంక, బర్మా, థాయ్ లాండ్, ఇండొనేషియా లాంటి దేశాల సాహిత్యం తెలియదు. ఇదొక దురదృష్టం. విదేశీపాలననుంచి బయటపడ్డ పక్క దేశాల సాహిత్యంలో ఎలాంటి  పరిణామాలు వచ్చాయో తెలుసుకోవటం మంచిదనిపిస్తుంది. ఆమాటకొస్తే ఇండియాలోనే ఇతర భాషల్లో సాహిత్యం ఎలావుందో తెలుసుకోవటంకూడా మంచిదే.
ప్రకటనలు

6 responses »

  1. seetaram gaaru,

    “విదేశీపాలననుంచి బయటపడ్డ పక్క దేశాల సాహిత్యంలో ఎలాంటి పరిణామాలు వచ్చాయో తెలుసుకోవటం మంచిదనిపిస్తుంది. ఆమాటకొస్తే ఇండియాలోనే ఇతర భాషల్లో సాహిత్యం ఎలావుందో తెలుసుకోవటంకూడా మంచిదే.” I too agree with this point.

    Kalpana

  2. ఆరి సీతారామయ్య గారు నాకు తెలుసు. యాహూ గ్రూప్స్ లో అలెక్సాండ్రా కొల్లొంటాయ్ వ్రాసిన “మూడు తరాల ప్రేమ కథ” గురించి పెద్ద చర్చ జరిగింది.

  3. Katha 2008 is probably not yet available in book stores. But our book club (Detroit Telugu Literary Club) obtained a few copies and discussed the stories last Sunday. The editors Vasireddy Naveen and Papineni Sivasankar attended the meeting. We were fortunate to have the renowned short story writer R.M.Umamaheswararao also join the discussion.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s