ముప్పై ఆరో వారం చదువు ముచ్చట్లు మధురాంతకం నరేంద్రతో…

సాధారణం
వృత్తిరీత్యా ఇంగ్లిషు ప్రొఫెసరు అయిన మధురాంతకం నరేంద్ర గొప్ప సాహిత్య పిపాసి. ఆయన తండ్రి మధురాంతకం రాజారాం నుంచి వారసత్వంగా అబ్బిన కూసు విద్య సాహిత్య సేవ. ఏటా వస్తున్న కథల్లోంచి మంచి కథలను ఎంచి ప్రతిఏటా “కథావార్షిక” ను తీసుకొస్తున్నారు. అదికాక ప్రతి ఏడాది ఒక రచయితకు కథాకోకిల పురస్కారాన్ని అందించి ప్రతిభావంతులైన రచయితలకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇంతటితో ఆగక రకరకాల సాహితీ సంస్థల సహకారంతో రాష్ట్రమంతటా పర్యటించి సాహితీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. రచయిత రచనలు చేసుకోవడంతోనే ఊరుకోక ఈ విధమైన ఉద్యమ సమానమైన సహృదయ సాహితీ వాతావరణాన్ని సృష్టించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ వారం మధురాంతకం నరేంద్ర చదువు ముచ్చట్లు వినండి మరి…
 
 
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
 
నేను ఎంపిక చేసుకున్న పుస్తకాలే చదువుతాను గనక, బోరు కొట్టడమన్న ప్రసక్తే వుండదు.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇల్యా ఎహ్రెన్ బర్గ్ రాసిన “రచయితా-శిల్పమూ”.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

5000 దాకా.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

చాలా… బహుశా నాలుగైదు జన్మలకు పైగా సరిపోతుందేమో…అన్ని వున్నాయి. 

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

చాలామంది… టాల్ స్టాయ్…శరత్…దోస్తయేవ్ స్కీ… వీరు నాకు దేవుళ్లు. మా నాన్నగారి చాలా కథలు… అన్నాకరెనినా, శ్రీకాంత్… నేను మళ్లీ మళ్లీ చదివే పుస్తకాలు… ఇంకా… “నేరమూ – శిక్షా” (క్రైమ్ అండ్ పనిష్ మెంట్), లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ (విలియం గోల్డింగ్), ది పవర్ అండ్ ది గ్లోరీ (గ్రాహమ్ గ్రీన్)…. ఇంకా మొపాసా కథలు…. ఈ జాబితా చాలా చాలా పెద్దది..

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

రెండు వైపులనుంచీ ఓ పది దాకా వుండొచ్చు.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నో కామెంట్

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

నేనెప్పుడూ దీని గురించి ఆలోచించలేదు.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

జె. డి. సాలింజర్ రాసిన “కేచర్ ఇన్ ది రై” .. రెండో సారి చదువుతున్నాను.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

చాలా వున్నాయి… చెప్పుకొస్తే మహాభారతం నుంచీ…

ప్రకటనలు

3 responses »

  1. అ.. యి… దు… వేలా? ఇంట్లో మీరెక్కడ ఉంటారండీ మరి? చోటుందా?:-)

    ఇల్యా ఎహ్రెన్ బర్గ్ రాసిన రచయితా -శిల్పమూ పుస్తకం స్కూలు రోజుల్లో AISF వాళ్ళు నాకు బహుమతి గా ఇచ్చారు. అప్పట్లో ఆ పుస్తకం విలువ తెలీక బోరు కొట్టి పక్కన పడేశాను నవల కాకపోవడంతో! ఇప్పుడు చదువుతుంటే అప్పుడెందుకు చదవలేదా అనిపిస్తూ ఉంటుంది.

    థాంక్యూ రవి గారు, నరేంద్ర గారు!

  2. నరేంద్ర గారూ, కాస్త ఆలస్యంగా చదివినా, మీ పఠానానుభవం చదవడం చాల సంతోషమిచ్చింది. ప్రాణహితలో అనుకుంటా, మీ ‘ గాలి పాట ‘ కధ చదివినప్పట్నించీ మీరంటే చాల ఇష్టం ఏర్పడిపోయింది. మీరు ఇష్టంగా పేర్కొన్న ‘శ్రీకాంత్‍’ నిజంగా ఎంత గొప్పగా వుంటుందో. అందులో దృశ్యాలు అప్పుడప్పడు కలల్లోకి వస్తుంటాయి. మధ్య మధ్య శరత్ జీవితం గురించి చేసిన వ్యాఖ్యానాలు కూడా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s