ఈ స్వాతంత్ర్య దినోత్సవాన తెలుగు సాహిత్య లోకమంతా శ్రీకాకుళంలోనే…

సాధారణం

కొంచెం అతిగా కన్పించినా ఇది నిజం. సాహిత్య అకాడెమీ, కథానిలయం, శ్రీకాకుళ సాహితి సంయుక్తంగా నిర్వహిస్తున్న కొడవటిగంటి కుటుంబరావు నూరేళ్ల సంబరాలకు ఈసారి శ్రీకాకుళం వేదిక అవుతోంది. దీనికి మహామహులందరూ వస్తున్నారు. పూర్తి వివరాలిదిగో:

ఈ ఆగష్టు 15, 16 తేదీలలో (అంటే ఈ శని, ఆది వారాల్లోనే) శ్రీకాకుళంలో (విజేత ఇన్ హోటల్ లో) రెండు రోజుల పాటు కొ. కు. నూరేళ్ల సంబరాలు జరుగుతున్నాయి. 15 వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాహిత్య అకాడెమీ ప్రాంతీయ కార్యదర్శి ఏ. ఎస్. ఇళంగోవన్ స్వాగతం పలుకుతారు. శ్రీకాకుళ సాహితి బాధ్యులు బివిఏ రామారావు నాయుడు విషయాన్ని ప్రస్తావిస్తారు.  కాళీపట్నం రామారావు ప్రారంభోపన్యాసం చేస్తారు. చాగంటి తులసి ఈ సెషన్ కు అధ్యక్షత వహిస్తారు. వరూధిని, శాంతసుందరి ఇరువురూ అత్మీయ అతిథులుగా హాజరవుతున్నారు.

11.30 గంటలకు జరిగే మొదటి సమావేశంలో “రచయితగా కొ.కు” అంశంపైన సెషన్ ముదిగంటి సుజాతారెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. సింగమనేని నారాయణ సామ్యవాద దృక్పథంపైన, ఓల్గా స్త్రీవాద దృక్పథంపైన, వెలగా వెంకటప్పయ్య బాల సాహిత్యంపైన మాట్లాడుతారు. చింతా అప్పలనాయుడు, దాసరి రామచంద్రరావు కొకు కథలు చదువుతారు.

భోజన విరామానంతరం “విమర్శకునిగా కొ.కు” అనే అంశంపై సెషన్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. సామ్యవాద విమర్శ గురించి పాపినేని శివశంకర్, సిఎఎస్ వి ప్రసాద వర్మ, చలనచిత్ర విమర్శమీద కాకరాల మాట్లాడుతారు. ఆ తరువాత కొకు కథలను వి. రామలక్ష్మి, కొప్పల భానుమూర్తి చదువుతారు.

రెండోరోజు అంటే 16న ఉదయం పదిన్నర గంటలకు “వ్యాస రచయితగా కొ.కు” అన్న మూడవ సెషన్ కవనశర్మ అధ్యక్షతన జరుగుతుంది. సైన్సు వ్యాసాల గురించి నాగసూరి వేణుగోపాల్, చారిత్రక వ్యాసాల గురించి కె. రామమోహన రావు మాట్లాడుతారు. నాల్గవ సెషన్ గా “కొ.కు. రచనాశైలి, సాంస్కృతిక దృక్పథం” గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరుగుతుంది. రచనాశైలి, శిల్పం గురించి అంపశయ్య నవీన్, సాంస్కృతిక దృక్పథం గురించి ఇరివెంటి వెంకటరమణ మాట్లాడుతారు. ఇక కొకు కథలను ఎమ్మెస్వీ గంగరాజు, మల్లిపురం జగదీష్ చదువుతారు.

భోజనాల అనంతరం జరిగే “తదుపరి తరాలవారి రచనలపై కుటుంబరావు ప్రభావం” అన్న అంశంపై యు. ఏ. నరసింహమూర్తి అధ్యక్షతన జరిగే ఐదవ సెషన్ లో మధురాంతకం నరేంద్ర, అట్టాడ అప్పలనాయుడు, కె ఎన్ మల్లీశ్వరి, కాళీపట్నం సుబ్బారావు, చిత్ర మాట్లాడుతారు. ఈ అయిదు సెషన్లను వరుసగా బివిఏ రామారావు నాయుడు, ఏవి రెడ్డిశాస్త్రి, పడాల జోగారావు, నాగరాజు, చాయరాజులు నిర్వహిస్తారు.

ముగింపు సమావేశంలో ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వివినమూర్తి ముగింపు వాక్యం చెప్తారు. జి. ఎస్. చలం వందన సమర్పణ చేస్తారు.

సమావేశ ప్రాంగణంలో సాహిత్య అకాడెమీ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తుంది. తగ్గింపు ధరలకే ఆ పుస్తకాలను పుస్తక ప్రియులు కొనుక్కోవచ్చు.

చివరగా  ఒక్కమాట,   ఈ  సమావేశాలకు  రవికుమార్  హాజరుకానుండడం  ప్రత్యేక  ఆకర్షణ.  ( ఆడెవడు అని  ఆలోచించేవారి  తలదువ్వు  చెరిగిపోవుగాక!! )  అందరికీ  ఇదే  మా  ఆహ్వానం  అని  నేను  రాయలేను  గాని,  వచ్చిన  వాళ్లందరికీ  భోజనాలు  మాత్రమ్  విజేత  హోటల్  లోనే  పెడతున్నారని  చెప్పగలను.

ప్రకటనలు

3 responses »

  1. కొ.కు.సాహిత్య సర్వస్వం ఎంతో శ్రమకోర్చి ఏర్చి కూర్చి సంపుటాలుగా తలకు మించిన భారమైనా ప్రచురించిన విరసం వ్యవస్తాపక సభ్యులు చలసాని ప్రసాద్ గారిని కానీ, క్రిష్ణాభాయిగారిని కాని ఒక సెషన్లో కూడా పాత్ర కల్పించకపోవడం సాహితీలోకంలో వున్న విభజణ రేఖలను ప్రస్ఫుతిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s