ముప్పై తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు శరత్ తో…

సాధారణం
ఇంటర్ నెట్ పాఠకులలో శరత్ తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కూడలి నిర్వాహకుడు వీవెన్ తో నిర్వహణపరమైన వివాదంలో దాదాపుగా బ్లాగు రచయితలు పాఠకులు రెండు వర్గాలుగా విడిపోయారు. తన సునిశిత హాస్య, వ్యంగ్య శైలితో శరత్ పాఠకులను అలరించే బ్లాగును ఇక్కడ చూడొచ్చు. అంతే కాకుండా సూక్ష్మ బ్లాగింగ్ కోసం ఒక సైటును నిర్వహిస్తున్నారు. ఇదికాక తన వీడియోచిత్రాలతో యూట్యూబు ద్వారా మరికొంతమంది ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అయితే ఈ సమాధానాలు అందుకున్నంతవరకూ నాకు తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం శరత్ అమెరికాలో నివశిస్తున్నారన్నది. మనిషి అంతశ్చేతన (సబ్ కాన్షస్) గురించి రాయడం వలన మాత్రమే అప్పటి సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి ఇప్పటి శరత్ వరకూ ఇంత వివాదాస్పదం కావడం మనం మర్చిపోకూడదు. మంచి పాఠకులైన శరత్ కమ్మటి రచయిత కూడా. ఆయన “ఎవరు” నవల “చతుర”లో ప్రచురితమైంది. మరి ఈవారం ఆయన చదువు ముచ్చట్లు వినండి…
 
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
చాలా వున్నాయి. అందరికీ అన్నీ నచ్చవు కదా. అన్నింటికన్నా బాగా అంటే చెప్పడం కష్టమే.
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
చంద్రమండల యాత్ర పూర్తి అయి 40 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా చందమామ కథలు చదువుతున్నాను. అపోలో వ్యోమగాముల చంద్రమండల యాత్రానుభవాల పుస్తకం  ‘డెస్టినేషన్ మూన్’ కొని చదివేసాను.
3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
ఓ నలభై వుంటాయేమొ. తరచుగా ప్రదేశాలు మారుతున్నందున చాలా పుస్తకాలని వదిలేయాల్సి వస్తోంది.
4.. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
నాకు తెలుగు పుస్తకాల మీదే మక్కువ ఎక్కువ. అవి ఇక్కడ (యు ఎస్ లో) దొరక్క  ఎవరివయినా పుస్తక సమీక్షలు చూసినప్పుడు ఆ పుస్తకాలు చదవలేకపోతున్నానే అనిపిస్తూవుంటుంది. ఇండియా వచ్చినప్పుడు కొన్నయినా కొనుక్కుంటూ వుంటాను.   రిచ్ డాడీ, పూర్ డాడీ చదవాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. మొన్ననే అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసాను. అలాంటివి ఇంకా కొన్ని.
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.
కొంత మంది, కొన్ని పుస్తకాలు వున్నాయి. అన్నీ చెప్పడం కష్టమే కానీ ఎర్నెస్ట్ హెమింగ్వే, చలం, ఛేజ్, యండమూరి, మైకేల్ క్రిచ్టన్ మొదలయిన వారివి బాగా నచ్చాయి.  ఆలోచనా స్రవంతి టెక్నిక్ ఉపయోగించి వ్రాసిన అంపశయ్య, ఊబిలో దున్న, ఎర్నెస్ట్ హెమిగ్వే రచనలు మరియు వ్యక్తిత్వ వికాసం మీద వ్రాసినవి కూడా నచ్చుతాయి.
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
నేనెవరికీ ఇవ్వలేదు. సి బి రావు గారు మా ఇంటికి వచ్చినప్పుడు వారి దగ్గరి నుండి రెండు పుస్తకాలు అందుకున్నాను.
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
  
ఇండియా టుడే (తెలుగు). ఇక్కడికి తెలుగు పత్రికలు పెద్దగా అందుబాటులో వుండవు కదా. వార పత్రికలు అప్పుడప్పుడూ చూసినప్పుడు వైవిధ్యమయిన ధారావాహికలు ఏమీ రాక ఎక్కువగా వారియొక్క ఆస్థాన రచయితలవే వస్తున్నాయనిపిస్తుంది. స్వాతి, ఆంధ్రభూమి వార పత్రికల్లో ఇదివరకు చక్కటి సీరియల్స్ వచ్చేవి. ఇప్పుడు చూస్తే ఎక్కువగా ప్చ్ అనే అనిపిస్తుంది.
8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
హెచ్ జి వెల్ల్స్ రచనలు చదవాలని ఈమధ్య ప్రయత్నించాను కానీ రుచి దొరకలేదు. అందుకు కారణాలు అనేకం వుంటాయి. అలా నచ్చని పుస్తకాలూ చాలా వున్నాయి.
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
స్టీఫెన్ కింగ్ యొక్క ఫోర్ పాస్ట్ మిడ్ నైట్ చదువుతున్నాను.
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
గోరా, చలం, డేల్ కార్నెగీ ల రచనలు. ఒకే ఒక్క పుస్తకం పేర్కొనాలంటే అది ‘How to win friends and Influence people’ by Dale Carnegie అవుతుంది.
ప్రకటనలు

3 responses »

  1. ఒకే ఒక్క పుస్తకం అని కాదు గాని, డేల్‍ కార్నీ ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్‍’ అలాగే ‘హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’ చాల బాగుంటాయి. బాగా ఇండువిజువలైజ్ అయిపోయిన మన కాలంలో కోప్ అప్ కావడానికి చాల వుపయోగపడతాయి….. హెచ్చార్కె.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s